సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

‘‘పింఛనుదారుల జీవన సౌలభ్యం కోసం పింఛను ను అందించేబ్యాంకుల కు చెందిన పింఛన్ పోర్టల్స్ అన్నింటిని పెన్శన్ & పెన్శనర్స్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ కు చెందినఇంటిగ్రేటెడ్ పెన్శనర్స్ పోర్టల్ లో కలపడం జరుగుతుంది’’ అని తెలిపిన సెక్రట్రి (పి&పిడబ్ల్యు)


బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఇంటిగ్రేటెడ్ పెన్శనర్స్పోర్టల్ ఆరంభం కావడం తో పాటు, అయిదు బ్యాంకులు ఈ సింగిల్ విండో ద్వారా సేవల నుఅందించడం కోసం చెట్టపట్టాల్ వేసుకొన్నాయి 

Posted On: 27 APR 2024 3:31PM by PIB Hyderabad

‘‘పింఛనుదారుల జీవన సౌలభ్యం కోసం పింఛను ను అందించే బ్యాంకుల కు చెందిన పింఛన్ పోర్టల్స్ అన్నింటినీ పెన్శన్ & పెన్శనర్స్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ (పి&పిడబ్ల్యు) కు చెందిన ఇంటిగ్రేటెడ్ పెన్శనర్స్ పోర్టల్ లో కలపడం జరుగుతుంది’’ అని సెక్రట్రి (పి&పిడబ్ల్యు) శ్రీ వి. శ్రీనివాస్ అన్నారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఇంటిగ్రేటెడ్ పెన్శనర్స్ పోర్టల్ ను శ్రీ వి. శ్రీనివాస్ 2024 ఏప్రిల్ 26 వ తేదీ నాడు ప్రారంభించి, ఆ సందర్భం లో ప్రసంగించారు. పింఛనుదారుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాల ను డిపార్ట్ మెంట్ ఆఫ్ పెన్శన్ & పెన్శనర్స్ వెల్ఫేర్చేపట్టింది అని ఆయన తెలియ జేశారు. ఆ తరహా కార్యక్రమాల లో పెన్శన్ దారుల కు డిజిటల్ ఎమ్‌పవర్‌మెంట్ అనేది ఒక కార్యక్రమం గా ఉందని, మరి దీనిని డిజిటల్ జీవన్ ప్రమాణ్ పత్రం, ఇంకా భవిష్య పోర్టల్ ల వంటి విభిన్న మాధ్యాల ద్వారా అమలు పరచడం జరుగుతోంది అని ఆయన వివరించారు.

 

 

పారదర్శకత్వాని కి, డిజిటైజేశన్ కు మరియు సేవల అందజేత కు బాట ను పరచాలన్న లక్ష్యాని కి అనుగుణం గా, భవిష్య ప్లాట్ ఫార్మ్ అనేది పింఛను ప్రక్రియ మరియు చెల్లింపు లలో ప్రతి దశ ను డిజిటైజ్ చేయడాని కి మార్గాన్ని సుగమం చేసింది. అంటే ఈ ప్రక్రియ లో పదవీ విరమణ చేసిన వ్యక్తి అతడి/ఆమె యొక్క పత్రాల ను ఆన్ లైన్ లో దాఖలు చేయడం మొదలుకొని ఎలక్ట్రానిక్ నమూనా లో పిపిఒ ను జారీ చేయడం మరియు అది ఆ తరువాత డిజిలాకర్ కు చేరుకోవడం వరకు భాగం గా ఉంటాయి అన్నమాట. భవిష్యప్లాట్ ఫార్మ్ ఒక ఏకీకృతమైన ఆన్ లైన్ పెన్శన్ ప్రాసెసింగ్ సిస్టమ్. కేంద్ర ప్రభుత్వం లోని అన్ని విభాగాల లో 2017 వ సంవత్సరం లో జనవరి 1 వ తేదీ నాటి నుండి అమలు లోకి వచ్చే విధం గా ఈ భవిష్యప్లాట్ ఫార్మ్ ను తప్పనిసరి చేసి వేయడమైంది. ఈ వ్యవస్థ ప్రస్తుతం లో 98 మంత్రిత్వ శాఖలు/ విభాగాల లో విజయవంతం గా అమలవుతున్నది. దీనిలో 870 కార్యాలయాల ను అనుబంధం చేయడం తో పాటు 8,174 డిడిఒలు కూడా భాగం అయ్యాయి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇ-గవర్నెన్స్ సంబంధి సేవ ల అందజేత ప్రధానమైన పోర్టల్స్ అన్నింటిలోకి ఎన్ఇఎస్‌డిఎ అసెస్‌మెంట్ 2021 ప్రకారం, డిపార్ట్ మెంట్ ఆఫ్ పెన్శన్ & పెన్శనర్స్ వెల్ఫేర్ కు భవిష్య (డిఒపిపిడబ్ల్యు అభివృద్ది పరచిన పింఛను మంజూరు మరియు చెల్లింపు ల కోసం ఒక ఆన్ లైన్ ట్రాకింగ్ సిస్టమ్) కు గాను మూడవ ర్యాంకు తో సమ్మానించడమైంది.

 

 

 

 

పింఛనుదారుల కు బ్యాంకు ల నుండి ఎదురయ్యే సమస్య లు.. ఉదాహరణ కు బ్యాంకు మార్పు, జీవన్ ప్రమాణ్ పత్రి సమర్పించే స్థితి, పెన్శన్ పత్రం , ఫార్మ్ 16, పెన్శన్ రసీదు యొక్క సమాచారం వంటి వి.. ను సాధ్యమైనంత తగ్గించాలి అనే ఉద్దేశ్యం తో పెన్శన్ ను అందిస్తున్న బ్యాంకుల వెబ్ సైట్ ను డిఒపిపిడబ్ల్యు కు చెందిన ఇంటిగ్రేటెడ్ పెన్శనర్స్ పోర్టల్ లో కలిపివేయడం జరుగుతున్నది. దీని వల్ల ఈ సేవల ను సింగిల్ విండో ద్వారా అందుకోవడానికి వీలు ఏర్పడుతుంది.

 

భవిష్య పోర్టల్ తో ఎస్‌బిఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేశనల్ బ్యాంకు మరియు కెనరా బ్యాంకు ల పెన్శన్ పోర్టల్ లను జోడించే పని పూర్తి అయింది. ఈ ఏకీకరణ తో, బ్యాంక్ ఆఫ్ ఇండియా కు చెందిన పింఛనుదారులు పింఛను పత్రం, జీవన్ ప్రమాణ్ పత్రం సమర్పించే స్థితి, డ్యూ ఎండ్ డ్రాన్ స్టేట్ మెంట్, ఇంకా ఇంటిగ్రేటెడ్ పెన్శనర్స్ పోర్టల్ యొక్క మాధ్యం ద్వారా ఫార్మ్ 16 వంటి సేవల ను ఒకే చోటు లో పొందడం ఖాయం అయింది. సమీప భవిష్యత్తు లో చాలా వరకు పింఛను పంపిణీ బ్యాంకుల ను ఇంటిగ్రేటెడ్ పెన్శనర్స్ పోర్టల్ తో కలపడం జరుగుతుంది.

 

 

 

***



(Release ID: 2019116) Visitor Counter : 74