వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

బాంగ్లాదేశ్, యుఎఇ, భూటాన్, బహ్రెయిన్, మారిశస్ మరియు శ్రీ లంక.. ఈ ఆరు దేశాల కు 99,150 ఎమ్టి ఉల్లిపాయల ఎగుమతి కి అనుమతిని ఇచ్చిన కేంద్రం


విభిన్న దేశాల కు ఉల్లిపాయల ను ఎగుమతి చేసేందుకుఏజెన్సీ గా నేశనల్ కోఆపరేటివ్ ఎక్స్‌పోర్ట్ స్ లిమిటెడ్  (ఎన్‌సిఇఎల్) ఉంది

మధ్య ప్రాచ్యం తో పాటు యూరోప్ లోని కొన్ని దేశాల కు ఎగుమతిచేయడం కోసం ప్రత్యేకం గా పండించిన 2000 ఎమ్ టి తెల్ల ఉల్లిగడ్డల ఎగుమతి కి అనుమతి ని ఇచ్చిన భారతప్రభుత్వం

Posted On: 27 APR 2024 1:48PM by PIB Hyderabad

భారతదేశం ఇరుగు పొరుగున ఉన్న బాంగ్లాదేశ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ), భూటాన్, బహ్రెయిన్, మారిశస్ మరియు శ్రీ లంక.. ఈ ఆరు దేశాల కు 99,150 మెట్రిక్ టన్నుల (ఎమ్‌టి) ఉల్లిగడ్డల ను ఎగుమతి చేసేందుకు ప్రభుత్వం అనుమతి ని ఇచ్చింది. 2023-24 లో అంత క్రితం సంవత్సరం తో పోలిస్తే ఖరీఫ్ మరియు రబీ సీజనుల లో ఫలసాయం అంచనా కన్న తక్కువ గా నమోదైన నేపథ్యం లో దేశీయం గా ఉల్లిపాయల లభ్యత తగినంతగా ఉండేందుకు పూచీ పడడానికి మరియు అంతర్జాతీయ బజారు లో గిరాకీ ని పెంచాలన్న కారణం గాను ఉల్లిగడ్డ ల ఎగుమతి పై నిషేధాన్ని విధించడమైంది.

 

 

ఆయా దేశాల కు ఉల్లిగడ్డల ఎగుమతి కి ఏజెన్సీ గా నేశనల్ కోఆపరేటివ్ ఎక్స్‌పోర్ట్ స్ లిమిటెడ్ (ఎన్‌సిఇఎల్) ఉంది. ఎన్‌సిఇఎల్ ఎల్1 ధరల లో ఇ-ప్లాట్ ఫార్మ్ ద్వారా దేశవాళీ ఉల్లిగడ్డల ను సేకరించి, ఆ సరుకు ను దిగుమతిదారు దేశం లోని ప్రభుత్వం నామినేట్ చేసిన ఏజెన్సీ కి గాని లేదా ఏజెన్సీ లకు గాని సరఫరా చేసింది. ఈ ప్రక్రియ ఆ ఏజెన్సీ లేదా ఏజెన్సీల కు 100 శాతం ముందస్తు చెల్లింపు పద్ధతి లో బేరం కుదిరినటువంటి ధర ప్రాతిపదిక న చోటు చేసుకొంది. దిగుమతిదారు దేశం లో ఉన్న ప్రస్తుత మార్కెట్ ధర లు మరియు దేశీయ బజారు లోను, అంతర్జాతీయ బజారు లోను చెలామణి లో ఉన్న ధరల ను లెక్క లోకి తీసుకొని కొనుగోలుదారుల కు ఎన్‌సిఇఎల్ తాను తన రేటు ను తెలియజేయడం జరుగుతుంది. ఆ యా దిగుమతిదారు దేశాలు అభ్యర్థించిన మేరకు పైన ప్రస్తావించిన ఆరు దేశాల కు ఎగుమతి కై కేటాయింపులు జరిపిన మేరకు ఉల్లిపాయల కోటా ను సరఫరా చేయడం జరుగుతోంది. ఎగుమతి చేయడం కోసమని ఎన్‌సిఇఎల్ సేకరించే ఉల్లిగడ్డల లో ప్రధాన సరఫరాదారు గా మహారాష్ట్ర ఉంది; దేశం లో ఉల్లిగడ్డల ఉత్పత్తి లో అతి పెద్ద ఉత్పత్తిదారు గా మహారాష్ట్ర యే ఉంది.

 

మధ్య ప్రాచ్యం లో మరియు యూరోప్ లోని కొన్ని దేశాల ఎగుమతి బజారుల కోసం ప్రత్యేకం గా సాగు చేసినటువంటి 2000 మెట్రిక్ టన్నుల తెల్ల ఉల్లిగడ్డ ల ఎగుమతి చేయడానికి కూడా ను ప్రభుత్వం అనుమతి ని ఇచ్చింది. అచ్చం గా ఎగుమతి కోసమే ఉద్దేశించిన అటువంటి కారణం గా, తెల్ల ఉల్లిపాయ ల ఉత్పాదన వ్యయం వాటి విత్తనాల ఖరీదు ఎక్కువ గా ఉండడం, గుడ్ ఎగ్రీకల్చరల్ ప్రాక్టీస్ (జిఎపి) ని అనుసరించ వలసి రావడం లతో పాటు గా మైక్సిమం రెజిడ్యూ లిమిట్స్ (ఎమ్ఆర్ఎల్) సంబంధి ప్రమాణాల ను పాటించవలసి రావడం వల్ల ఇతర రకాల ఉల్లిపాయల కన్న అధికం గా ఉంటుంది.

 

 

వినియోగదారు వ్యవహారాల సంబంధి విభాగం యొక్క ధరల స్థిరీకరణ నిధి (పిఎస్ఎఫ్) తోడ్పాటు తో ఈ సంవత్సరం లో రబీ-2024 సీజను లో ఉల్లిగడ్డ ల బఫర్ కొనుగోలు లక్ష్యాన్ని ఈ సంవత్సరం లో 5 లక్షల టన్నులు గా ఖరారు చేయడమైంది. ఎన్‌సిసిఎఫ్ మరియు ఎన్ఎఎఫ్ఇడి ల వంటి కేంద్రాయ సంస్థ లు ఏదైనా నిలవ కు అర్హమైనటువంటి ఉల్లిగడ్డల కొనుగోలు ను మొదలుపెట్టడం కోసం సేకరణ, నిలవ మరియు రైతుల పేరుల నమోదు ల కోసం ఎఫ్‌పిఒ స్/ఎఫ్‌పిసి స్/పిఎసి స్ ల వంటి స్థానిక ఏజెన్సీల తో జత కలుస్తున్నాయి. డిఒసిఎ, ఎన్‌సిసిఎఫ్, ఎన్ఎఎఫ్ఇడి లకు చెందిన ఒక ఉన్నత స్థాయి బృందం పిఎస్ఎఫ్ బఫర్ కోసం అయిదు ఎల్ఎమ్ టి ఉల్లిగడ్డ ల కొనుగోలు విషయం లో రైతులు, ఎఫ్ పిఒ/ఎఫ్ పిసి ఇంకా పిఎసి ల మధ్య అవగాహన ను కలుగజేయాలన్న ఉద్దేశ్యం తో 2024 ఏప్రిల్ 11వ తేదీ మొదలుకొని 13 వ తేదీ ల మధ్య కాలం లో మహారాష్ట్ర లోని నాసిక్ మరియు అహమద్ నగర్ జిల్లాల ను సందర్శించింది.

 

 

ఉల్లిపాయల ను నిలవ చేయడం లో ఎదురయ్యే నష్టాన్ని తగ్గించడం కోసమని, ముంబయి లోని బిఎఆర్ సి యొక్క సాంకేతిక సహకారం తీసుకొంటూ కాంతి ప్రసారం మరియు శీతలీకరణ గోదాముల లో ఉంచవలసిన నిలవల పరిమాణాన్ని క్రిందటి సంవత్సరం లో నిర్దేశించుకొన్న 1200 ఎమ్‌టి ల స్థాయి ల నుండి ఈ సంవత్సం లో 5,000 ఎమ్ టి లకు పైగా పెంచాలి అనే నిర్నయాన్ని వినియోగదారు వ్యవహారాల సంబంధి విభాగం నిర్ణయించింది. గత సంవత్సరం చేపట్టిన ఉల్లిగడ్డల కిరణీకరణం మరియు శీతలీకరణ ప్రక్రియ ల ప్రయోగాత్మక ప్రాజెక్టు ఫలితం గా నిలవ ల సంబంధి నష్టం 10 శాతాని కి లోపు పరిమితం అయింది.

 

 

 

***



(Release ID: 2019115) Visitor Counter : 51