నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వరల్డ్ ఎనర్జీ కాంగ్రెస్ 2024: క్రొత్త మరియు తాజా గా తెర మీదకు వస్తున్న నవీకరణ యోగ్య శక్తి సంబంధి సాంకేతికతల కోసం వినూత్నమైన ఆర్థిక సహాయ సాధనాల అవసరం ఎంతైనా ఉందన్న ఐఆర్ఇడిఎ సిఎమ్‌డి

Posted On: 26 APR 2024 10:46AM by PIB Hyderabad

నెదర్‌లాండ్స్ లోని రాటర్ డేమ్ లో జరిగిన వరల్డ్ ఎనర్జీ కాంగ్రెస్ యొక్క 26 వ సంచిక లో భాగం గా ‘‘ద న్యూ ఇంటర్ డిపెండెన్సీస్: ట్రస్ట్, సెక్యూరిటీ ఎండ్ క్లయిమేట్ రెజిలియన్స్’’ అనే ఇతివృత్తం పై ఏర్పాటైన బృంద చర్చ లో ఇండియన్ రిన్యూవబుల్ ఇండియన్ రిన్యూవబుల్ ఎనర్జి డివెలప్ మెంట్ ఏజెన్సి లిమిటెడ్ (ఐఆర్ఇడిఎ.. ‘ఇరెడా’) యొక్క చెయర్ పర్సన్ & మేనేజింగ్ డైరెక్టర్ (సిఎమ్ డి) శ్రీ ప్రదీప్ కుమార్ దాస్ పాలుపంచుకొన్నారు.

 

చర్చ సాగిన క్రమం లో, శక్తి సంబంధి పరివర్తన బాట లో భారతదేశం సాగిస్తున్న యాత్ర ను గురించి మరియు దేశం లో నవీకరణ యోగ్య శక్తి స్వీకార ప్రక్రియ ను ముందుకు తీసుకుపోవడం లో ఐఆర్ఇడిఎ పోషిస్తున్న కీలక భూమిక ను గురించిన అంశాల ను ఇరెడా సిఎమ్ డి వివరించారు. 2030 వ సంవత్సరాని కల్లా 500 గీగా వాట్ (జిడబ్ల్యు) సామర్థ్యం కలిగిన శిలాజేతర ఇంధన సంబంధి శక్తి సామర్థ్యాన్ని సాధించాలి అని భారతదేశం పెట్టుకొన్న మహత్వాకాంక్ష భరిత లక్ష్యం జలవాయు పరివర్తన కు వ్యతిరేకం గా ప్రపంచం జరుపుతున్న పోరాటం లో ఒక ఆశాభరితమైన దీప స్తంభం గా భారతదేశాన్ని నిలబెడుతోంది అని ఆయన అన్నారు. అలాగే 2070 వ సంవత్సరాని కల్లా ఉద్గారాల పరం గా చూసినప్పుడు నికరం గా శూన్యం (సున్నా) లక్ష్యాన్ని చేరుకోవాలి అన్నది భారతదేశం యొక్క వచనబద్ధత గా ఉందన్న విషయాన్ని కూడా ఆయన ప్రముఖం గా ప్రకటించారు. నవీకరణ యోగ్య శక్తి రంగం లో శరవేగం గా పురోగమిస్తూ ఉన్న కారణం గా, ప్రపంచం లో నవీకరణ యోగ్య శక్తి ఉత్పాదన పరమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్న దేశాల జాబితా లో నాలుగో స్థానం లో భారతదేశం ఉంది అని ఆయన తెలిపారు.

 

 

 

 

పర్యావరణాని కి మైత్రీపూర్వకం గా ఉండే శక్తి ఉత్పాదన రంగ సంస్థల కు ఆర్థిక సహాయాన్ని అందించడం లో అతి పెద్ద బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బిఎఫ్‌సి) గా ఐఆర్ఇడిఎ చాలా కీలకమైనటువంటి పాత్ర ను పోషిస్తూ, శక్తి సంబంధి పరివర్తన గతి ని వేగవంతం చేస్తోంది అని ఆయన అన్నారు. నవీకరణ యోగ్య శక్తి ఉత్పాదన రంగం లో నష్ట భయాల ను తగ్గించడం కోసం వినూత్నమైనటువంటి ఆర్థిక సహాయ పథకాల ను అమలు పరచడం ద్వారా మరియు ఈ రంగం లో ప్రైవేటు రంగ సంస్థ ల ప్రమేయాన్ని ప్రోత్సహించడం ద్వారా శక్తి పరివర్తన ప్రధానమైన ప్రాజెక్టుల కు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించడం లో ఐఆర్ఇడిఎ చేస్తున్న ప్రయాసల ను సిఎమ్‌డి ఈ సందర్భం లో వివరించారు.

 

 

 

  • ప్రపంచ వ్యాప్తం గా శక్తి రంగం లో తల ఎత్తిన సంకట స్థితి ని గురించి కూడాను వరల్డ్ ఎనర్జీ కాంగ్రెస్ యొక్క బృందం చర్చించింది. శక్తి ఉత్పాదన రంగం లో భద్రత కు పూచీ పడడం కోసమని విభిన్నమైనటువంటి మార్గాల ను అనుసరించడాని కి మరియు సుదృఢమైన మౌలిక సదుపాయాల ను కల్పించడానికి ప్రాముఖ్యాన్ని ఇవ్వవలసి ఉంటుంది అని సిఎమ్ డి స్పష్టం చేశారు. బలమైనటువంటి పవర్ నెట్ వర్క్ లను ఏర్పాటు చేయడం ద్వారా ప్రాంతీయ మార్కెట్టుల ను ఏకీకరించడం ఎంతైనా ముఖ్యం అని ఆయన అన్నారు. దేశీయ పింఛను / బీమా నిధుల అసెట్స్ అండర్ మేనేజ్‌మెంట్ (ఎయుఎమ్) నుండి 4 శాతం గాని లేదా 5 శాతం గాని నవీకరణ యోగ్య శక్తి బాండ్ ల కు కేటాయించడాన్ని తప్పనిసరి చేయాలని, ఇలా చేస్తే బాండ్ బజారు విస్తృతం అవుతుంది; అంతేకాక ప్రపంచ మరియు స్థానిక పెట్టుబడులు అదనం గా అంది వస్తాయి అని కూడా ఆయన ప్రతిపాదించారు.

 

 

పర్యావరణ అనుకూల ఆర్థిక వ్యవస్థ కు దోహదం చేయడం అనేది ఐఆర్ఇడిఎ యొక్క నిరంతర వాగ్ధానం గా ఉంటుందని సిఎమ్‌డి పునరుద్ఘాటిస్తూ, తన ప్రసంగాన్ని ముగించారు. ఈ కంపెనీ పెట్టుబడుల ను ఆకర్షించడం, నూతన సాంకేతికతల ను ప్రోత్సహించడం లతో పాటుగా విధానపరమైన సంస్కరణల కు మొగ్గు చూపుతున్నదని ఆయన అన్నారు. 2070 వ సంవత్సరాని కల్లా ఉద్గారాల పరం గా నికరం గా శూన్యం (సున్నా) స్థాయి ని సాధించే దిశ లో భారత దేశం పురోగమిస్తూ ఉన్న క్రమం లో, ఐఆర్ఇడిఎ దీర్ఘకాలికమైనటువంటి మరియు భద్రమైనటువంటి శక్తి ఉత్పాదన అవకాశాల కు మార్గదర్శకత్వాన్ని అందించడం లో అగ్రస్థానాన ఉంటుంది అని సిఎమ్‌డి అన్నారు.

 

‘‘ద న్యూ ఇంటర్ డిపెండెన్సీస్: ట్రస్ట్, సెక్యూరిటీ ఎండ్ క్లయిమేట్ రెజిలియన్స్’’ అనే ఇతివృత్తం పై 2024 ఏప్రిల్ 24 న ఏర్పాటైన బృంద చర్చ లో పాలుపంచుకొన్న ఇతరుల లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్, యూరోప్ మరియు హెడ్ ఆఫ్ కంట్రీ, యుకె, బిపి, లుయీస్ కింగ్ హమ్ సిబిఇ; గ్లోబల్ ఎనర్జీ & రిసోర్సెస్ స్ట్రేటిజీ లీడర్, ఇవై, శ్రీ ఎండీ బ్రోగన్; మరియు పనామా కెనాల్ ఆథారిటి అడ్ మినిస్ ట్రేటర్ శ్రీ రికువార్టే వాస్కేజ్ మొరాలేస్ లు ఉన్నారు.

 

ఇవి కూడా చదువగలరు:

· శక్తి సంబంధి భద్రత, ప్రాప్తి మరియు స్థిరత్వం ల కలయిక తో ఉనికి లోకి వస్తున్న శక్తి పరిదృశ్యాన్ని నిర్వహించే పద్ధతుల పై ప్రపంచ శక్తి సమ్మేళనం లో భాగం అయిన మంత్రుల స్థాయి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో చర్చించడమైంది

 

· వరల్డ్ ఎనర్జీ కాంగ్రెస్ 2024 లో పాలుపంచుకొన్న భారతదేశం: ఇండియా పెవిలియన్ ను ప్రారంభించిన విద్యుత్తు శాఖ కార్యదర్శి మరియు నెదర్‌లాండ్స్ లో భారతదేశం యొక్క రాయబారి

 

***


(Release ID: 2018941) Visitor Counter : 317