ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఇంటర్ నేశనల్ కాన్ఫరెన్స్ ఆన్ డిజాస్టర్ రిజిలియంట్ఇన్ ఫ్రాస్ట్రక్చర్ యొక్క ఆరో సంచిక లో ప్రసంగించిన ప్రధాన మంత్రి


‘‘రేపటి మెరుగైనకాలం కోసం మనం ఆటుపోటుల కు తట్టుకొని నిలబడగలిగేటటువంటి మౌలిక సదుపాయాల కల్పన కోసంఈ రోజు న పెట్టుబడి పెట్టి తీరాలి’’

‘‘ప్రపంచ దేశాలు అన్నీ ఆటుపోటుల ను తట్టుకొనగలిగే స్థితి కి చేరగలదు, అదిఎప్పుడు అంటే ప్రతి ఒక్క దేశం తన వంతు గా ఆ తరహా స్థితి ని సాధించినప్పుడు మాత్రమేసుమా’’

‘‘ఆటుపోటుల ను తట్టుకొని అన్ని దేశాలు నిలబడగలగాలి అంటేఅత్యంత బలహీనమైన దేశాల కు మనం తప్పక అండదండల ను అందించాలి’’ 

Posted On: 24 APR 2024 9:53AM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ఇంటర్ నేశనల్ కాన్ఫరెన్స్ ఆన్ డిజాస్టర్ రిజిలియంట్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ (ఐసిడిఆర్ఐ) యొక్క ఆరో సంచిక ను ఉద్దేశించి వీడియో సందేశం మాధ్యం ద్వారా ప్రసంగించారు.

 

సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, ప్రముఖుల కు స్నేహపూర్ణమైనటువంటి స్వాగత వచనాల ను పలికారు. ఈ సమావేశాని కి వారు హాజరు కావడం ప్రపంచ వ్యాప్త కార్యాచరణ ను పటిష్టం చేస్తుందని, మరి డిజాస్టర్ రిజిలియంట్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అనేటటువంటి ముఖ్యమైన అంశం లో తీసుకొనే నిర్ణయాల ను బలపరుస్తుందని ఆయన అన్నారు. కొయలిశన్ ఫార్ డిజాస్టర్ రిజిలియంట్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ (సిడిఆర్ఐ) ను 2019 వ సంవత్సరం లో ప్రారంభించినప్పటి నుండి ఆకర్షణీయమైన వృద్ధి నమోదు అయింది అని ప్రధాన మంత్రి చెప్తూ, ఈ సంస్థ ప్రస్తుతం 39 దేశాలు మరియు 7 సంస్థల తో ఒక ప్రపంచ సంకీర్ణం గా కొనసాగుతోందన్నారు. ‘‘భవిష్యత్తు కు ఇది ఒక శుభసంకేతం గా ఉంది’’ అని ఆయన అన్నారు.

 

ప్రాకృతిక విపత్తులు తరచు గా సంభవిస్తుండడాన్ని, ప్రాకృతిక విపత్తుల తీవ్రత పెరుగుతూ ఉండడాన్ని గురించి ప్రధాన మంత్రి చెప్తూ, వాటి వల్ల కలిగే నష్టాన్ని సాధారణం గా డాలర్ లలో మదింపు చేయడం జరుగుతోంది అన్నారు. ప్రజల పైన, సముదాయాల పైన ప్రాకృతిక విపత్తులు కలుగ జేసే వాస్తవిక ప్రభావం సంఖ్యల కు అందదు అని ఆయన అన్నారు. మానవుల పై ప్రాకృతిక విపత్తులు కలుగజేసే ప్రభావాన్ని గురించి శ్రీ నరేంద్ర మోదీ వివరిస్తూ, భూకంపాలు ఇళ్ళ ను నేలమట్టం చేసి వేల కొద్దీ ప్రజల ను నిరాశ్రయులు గా మార్చుతున్నాయి; ప్రాకృతిక విపత్తులు నీటి సరఫరా వ్యవస్థల ను, మురుగు పారుదల వ్యవస్థల ను విచ్ఛిన్నం చేస్తూ, ప్రజల ఆరోగ్యాన్ని సంకట స్థితి లోకి నెట్టి వేస్తున్నాయి అని ఆయన ప్రస్తావించారు. ప్రాకృతిక విపత్తులు శక్తి ఉత్పాదన నిలయాల పైన కూడా ప్రభావాన్ని ప్రసరించగలవు, దీంతో అపాయకర స్థితి తలెత్తుతుంది అని కూడా ఆయన చెప్పారు.

 

‘‘ఒక మెరుగైనటువంటి రేపటి రోజు కోసం ప్రకృతి విపత్తుల కు తట్టుకొని నిలబడగలిగేటటువంటి మౌలిక సదుపాయాల కల్పన లో మనం ఈ రోజే పెట్టుబడి పెట్టి తీరాలి’’ అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. ఆటుపోటుల ను తట్టుకొని నిలబడాలి అంటే అందుకోసం సరిక్రొత్త గా మౌలిక సదుపాయాల కల్పించాలని, దీనితో పాటు విపత్తు అనంతరం చేపట్టవలసిన పునర్ నిర్మాణం కార్యాల పైన కూడా దృష్టి సారించాలని ఆయన నొక్కి చెప్పారు. విపత్తు వాటిల్లిన తరువాత అందించవలసిన సహాయక మరియు పునరావాస కార్యక్రమాల ను అమలు చేసీ చేయడం తోనే ప్రకృతి విపత్తుల ను ఎదుర్కొనేటటువంటి మౌలిక సదుపాయాల కల్పన పట్ల శ్రద్ధ తీసుకోవాలి అని ప్రధాన మంత్రి అన్నారు.

 

ప్రకృతి ప్రకోపాని కి మరియు విపత్తుల కు ఎటువంటి ఎల్ల లు ఉండవు అనే విషయాన్ని ప్రధాన మంత్రి చెప్తూ, ఒక దేశం తో మరొక దేశం పరస్పరం అత్యధిక స్థాయి లో జతపడినటువంటి ప్రస్తుత ప్రపంచం లో విపత్తు లు మరియు విచ్ఛిన్నాలు కలిగించే ప్రభావం విస్తృతం గా ఉంటుంది అన్నారు. ‘‘ప్రతి ఒక్క దేశం తన వంతు గా ప్రాకృతిక విపత్తుల ను ఎదుర్కొనేది గా మారినప్పుడు మాత్రమే ప్రపంచ దేశాలు అన్నీ ఈ విధమైనటువంటి సామర్థ్యాన్ని సంతరించుకో గలుగుతాయి’’ అని ప్రధాన మంత్రి అన్నారు. నష్ట భయాలు ప్రతి ఒక్క దేశాని కి ఎదురయ్యే కారణం గా, ఆ విపత్తుల ను తట్టుకొనే చర్యల కు కూడా ఉమ్మడి ప్రాధాన్యాన్ని ఇవ్వవలసి ఉంటుంది అని ఆయన స్పష్టం చేశారు. ఈ విధమైన ఉమ్మడి కార్యాచరణ లో ప్రపంచ దేశాలు అన్నీ ఏకతాటి మీదకు రావడం లో సిడిఆర్ఐ మరియు నేటి ఈ సమావేశం సహాయకారి గా ఉంటాయి అని ఆయన అన్నారు.

 

‘‘ప్రపంచ దేశాలు అన్నీ కూడాను ప్రాకృతిక విపత్తుల ను ఎదుర్కోవాలి అంటే గనుక, మనం అత్యంత బలహీనమైన దేశాల కు అండదండల ను తప్పక అందించాలి’’ అని ప్రధాన మంత్రి చెప్పారు. అభివృద్ధి చెందుతున్న చిన్న ద్వీప దేశాల కు విపత్తుల తాలూకు నష్ట భయం అనేది ఉంది అనే విషయాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావించి, ఈ తరహా 13 ద్వీప దేశాల లో ఆర్థిక సహాయాన్ని అందజేయడం కోసం సిడిఆర్ఐ ఒక కార్యక్రమాన్ని సిద్ధం చేసింది అన్నారు. ఈ సందర్భం లో ఆయన డొమినికా లో ప్రకృతి ప్రకోపానికి తట్టుకొని నిలచే తరహా గృహ నిర్మాణ పథకాల ను చేపట్టడం, పాపువా న్యూ గినీ లో రవాణా నెట్ వర్క్ లను ఏర్పాటు చేయడం, డొమినికన్ రిపబ్లిక్ లో మరియు ఫిజీ లో అత్యధిక సామర్థ్యాన్ని కలిగివుండే ముందస్తు హెచ్చరిక వ్యవస్థల ను ఏర్పాటు చేయడం గురించి పేర్కొన్నారు. వికాస శీల (గ్లోబల్ సౌథ్) దేశాల విషయం లో సిడిఆర్ఐ శ్రద్ధ తీసుకొంటునందుకు ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

 

జి-20 సభ్యత్వ దేశాల కూటమి కి అధ్యక్ష బాధ్యతల ను భారతదేశం నిర్వహించిన కాలం లో ఒక క్రొత్త డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ వర్కింగ్ గ్రూపు ను ఏర్పాటు చేస్తూ ఆ గ్రూపునకు ఆర్థిక సహాయాన్ని అందించాలన్న కీలకమైన చర్చ జరిగిందని ప్రధాన మంత్రి గుర్తు కు తీసుకు వచ్చారు. ఆ తరహా చర్య లు సిడిఆర్ఐ వికాసం తో పాటుగా ప్రపంచాన్ని ప్రాకృతిక విపత్తుల ను ఎదుర్కోగలిగే స్థితి లోకి తీసుకు పోగలవు అని ఆయన అన్నారు. రెండు రోజుల పాటు జరుగనున్న ఐసిడిఆర్ఐ లో చర్చోపచర్చ లు సార్థకం అవుతాయన్న విశ్వాసాన్ని ప్రధాన మంత్రి వ్యక్తం చేస్తూ తన ప్రసంగాన్ని ముగించారు.


(Release ID: 2018702) Visitor Counter : 191