చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ

‘నేర విచారణ వ్యవస్థ యొక్క పాలన లో భారతదేశం అనుసరిస్తున్నపురోగమన పథం’ పేరిట ఒక సమావేశాన్ని రేపటి రోజు న నిర్వహించనున్న చట్టం మరియున్యాయం ల మంత్రిత్వ శాఖ

Posted On: 19 APR 2024 11:10AM by PIB Hyderabad

అతి పాతవి అయినటువంటి చట్టాల ను రద్దు చేసి, పౌరుల కు ప్రాముఖ్యం ఉండేటటువంటి మరియు చైతన్య భరితమైన ప్రజాస్వామ్యం యొక్క అవసరాల ను తీర్చేటటువంటి చట్టాల కై దేశ నేర న్యాయ విచారణ వ్యవస్థ లో సంస్కరణల ను తీసుకు రావడం కోసమని మూడు చట్టాల ను రూపొందించడమైంది. ఆ చట్టాలు.. భారతీయ న్యాయ సంహిత, 2023; భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, 2023; మరియు భారతీయ సాక్ష్య అధినియమ్, 2023 లు. ఇవి ఇదివరకటి నేర సంబంధి చట్టాలు అయిన భారతీయ శిక్ష స్మృతి 1860, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసిజర్, 1973 మరియు భారతీయ సాక్ష్య చట్టం, 1872 ల స్థానం లో అమలు కానున్నాయి. ఇప్పటికే నోటిఫై చేసిన ప్రకారం, ఈ నేర సంబంధి చట్టాలు 2024 జులై 1 వ తేదీ నుండి అమలు లోకి రానున్నాయి.

 

ఈ చట్టాల ను గురించిన చైతన్యాన్ని పాదుగొల్పడం కోసం, మరీ ముఖ్యం గా వీటితో సంబంధం ఉన్న వర్గాల లో మరియు న్యాయ సమాజం లలో జాగృతి ని నెలకొల్పడాని కి గాను ‘ఇండియాస్ ప్రొగ్రెసివ్ పాథ్ ఇన్ ది అడ్మిస్ట్రేశన్ ఆఫ్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్పేరిట ఒక సమావేశాన్ని చట్టం మరియు న్యాయం ల మంత్రిత్వ శాఖ రేపటి రోజు న అంటే 2024 ఏప్రిల్ 20 వ తేదీ నాడు న్యూ ఢిల్లీ లోని జనపథ్ లో గల డాక్టర్ అంబేడ్ కర్ ఇంటర్ నేశనల్ సెంటర్ లో నిర్వహించనుంది. ఈ కార్యక్రమాని కి ముఖ్య అతిథి గా భారతదేశం యొక్క ప్రధాన న్యాయ మూర్తి డాక్టర్ జస్టిస్ శ్రీ డి.వై. చంద్రచూడ్ విచ్చేయనున్నారు. ఇంకా ఈ కార్యక్రమం లో పాలుపంచుకొనే ఇతర ఉన్నతాధికారుల లో చట్టం మరియు న్యాయం ల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ అర్జున్ రాం మేఘ్ వాల్, భారతదేశం యొక్క ఎల్ డి అటార్నీ జనరల్ శ్రీ ఆర్. వెంకటరమణి, భారత దేశం యొక్క ఎల్ డి సాలిసిటర్ జనరల్ శ్రీ తుషార్ మెహతా, భారతదేశం ప్రభుత్వం లో దేశీయ వ్యవహారాల శాఖ కార్యదర్శి శ్రీ అజయ్ కుమార్ భల్లా, తదితరులు ఉన్నారు.

 

ఈ సమావేశం లక్ష్యాల లో మూడు నేర సంబంధి మూడు క్రొత్త చట్టాల లోని ముఖ్యాంశాల ను గురించి ప్రస్తావన తో పాటు సాంకేతిక పరమైన మరియు ప్రశ్నలు జవాబు ల రూపం లో సాగే సదస్సు ల మాధ్యం ద్వారా సార్థకమైన అభిప్రాయాల ఆదాన ప్రదానం ఈ సమావేశ నిర్వహణ యొక్క లక్ష్యం గా ఉంది. దీనికి తోడు, ఈ సమావేశం లో వేరు వేరు న్యాయస్థానాల కు చెందిన న్యాయమూర్తులు, వకీళ్ళు, విద్య రంగ ప్రముఖులు, చట్టం అమలు సంస్థ ల ప్రతినిధులు, పోలీసు అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ లు, జిల్లా పాలన అధికారులు మరియు న్యాయ శాస్త్ర విద్యార్థులు పాలుపంచుకోనున్నారు.

 

రోజంతా సాగే ఈ సమావేశం ప్రారంభిక సదస్సు తో మొదలై, ముగింపు సభ తో సమాప్తం అవుతుంది. ఈ క్రమం లో, ప్రతి ఒక్క చట్టం పైన ఒక్కొక్కటి వంతు న మూడు సాంకేతిక సదస్సుల ను ఏర్పాటు చేయడమైంది. ప్రారంభిక సదస్సు లో, నేర సంబంధి మూడు నూతన చట్టాల యొక్క విస్తృత లక్ష్యాల ను గురించి వివరించడం జరుగుతుంది.

 

 

***

 



(Release ID: 2018283) Visitor Counter : 142