రైల్వే మంత్రిత్వ శాఖ
2024 వేసవి కాలంలో రికార్డు సంఖ్య లో అదనపు రైళ్ళ ను నడుపుతున్న భారతీయ రైల్ వే లు
ఈ వేసవి కాలం లో, ప్రయాణికుల కు సౌకర్యవంతమైన మరియు హాయి తో కూడిన యాత్ర కు పూచీ పడడం కోసం 9111 యాత్రల ను నిర్వహించడం జరుగుతుంది
Posted On:
19 APR 2024 10:41AM by PIB Hyderabad
ప్రయాణికుల కు సౌకర్యవంతం గా ఉండే విధం గాను మరియు వేసవి కాలం లో యాత్రల డిమాండు లో అపేక్షిత వృద్ధి కి తగిన విధం గాను ఏర్పాటుల ను చేయడం కోసమని ఎండ కాలం లో రికార్డు సంఖ్య లో 9111 యాత్రల ను ఇండియన్ రైల్ వేస్ నిర్వహిస్తున్నది.
2023 వ సంవత్సరం ఎండ కాలం తో పోలిస్తే ఇది తగినంత వృద్ధి ని చూపుతోంది. గడచిన గ్రీష్మ కాలం లో మొత్తం మీద 6369 యాత్ర లు నమోదు అయ్యాయి. ఈ సంఖ్య ను చూశామా అంటే గనక పెరుగుదల 2742 యాత్రలు గా ఉన్నట్లు తేలుతుంది. దీని అర్థం ప్రయాణికుల అవసరాల ను ప్రభావవంతం గా తీర్చడం కోసం భారతీయ రైల్ వే లు ఎంత నిబద్ధత తో ఉన్నదీ తెలుస్తున్నది.
అదనపు రైళ్ళ ను ప్రముఖమైనటువంటి రైలు మార్గాల లో ఎటువంటి అంతరాయం ఎదురవకుండా యాత్ర సాగిపోయేటట్టు గా పూచీపడడం కోసం దేశవ్యాప్తం గా కీలక గమ్యస్థానాల ను కలపడం కోసం అదనపు రైళ్ల ప్రణాళిక ను ఎంతో శ్రద్ధ ను తీసుకొని రూపొందించడమైంది. అన్ని జోనల్ రైల్ వేల తరఫు న భారతదేశ వ్యాప్తం గా ఎండకాలం లో తమిళ నాడు, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా, పశ్చిమ బంగాల్, బిహార్, ఉత్తర్ ప్రదేశ్, కర్నాటక, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, ఝార్ ఖండ్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్ మరియు దిల్లీ వంటి రాష్ట్రాల లో యాత్రికుల రద్దీ ని తగ్గించడం కోసం ఈ అదనపు యాత్ర ల ను నిర్వహించడానికి సన్నాహాలు చేయడమైంది.
రైల్ వే
|
జోనల్ రైల్ వేస్ నోటిఫై చేసిన యాత్ర లు
|
సెంట్రల్ రైల్ వే
|
488
|
ఈస్టర్న్ రైల్ వే
|
254
|
ఈస్ట్ సెంట్రల్ రైల్ వే
|
1003
|
ఈస్ట్ కోస్ట్ రైల్ వే
|
102
|
నార్థ్ సెంట్రల్ రైల్ వే
|
142
|
నార్థ్ ఈస్టర్న్ రైల్ వే
|
244
|
నార్థ్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్ వే
|
88
|
నార్దన్ రైల్ వే
|
778
|
నార్థ్ వెస్టర్న్ రైల్ వే
|
1623
|
సౌథ్ సెంట్రల్ రైల్ వే
|
1012
|
సౌథ్ ఈస్టర్న్ రైల్ వే
|
276
|
సౌథ్ ఈస్ట్ సెంట్రల్ రైల్ వే
|
12
|
సౌథ్ వెస్టర్న్ రైల్ వే
|
810
|
సదరన్ రైల్ వే
|
239
|
వెస్ట్ సెంట్రల్ రైల్ వే
|
162
|
వెస్టర్న్ రైల్ వే
|
1878
|
మొత్తం
|
9111
|
అదనపు రైళ్ళ ను గురించిన పథక రచన చేయడం మరియు వాటిని నిర్వహించడం అనేవి నిరంతరాయం గా సాగే ప్రక్రియ లు. దీని కోసం ఏదైనా మార్గం లో ప్రత్యేకమైన సందర్భాల లో రాక పోక లు జరిపే రైళ్ళ యొక్క అవసరం ఎంత ఉంది అనేది మదింపు చేయడాని కి గాను పిఆర్ఎస్ వ్యవస్థ లో వేచి ఉండే ప్రయాణికుల వివరాల కు తోడు గా ప్రసార మాధ్యమాల లో వచ్చే కథనాలు, సోశల్ మీడియా ప్లాట్ ఫార్మ్, రైల్ వే ఇంటిగ్రేటెడ్ హెల్ప్ లైన్ సంఖ్య 139 ల వంటి అన్ని కమ్యూనికేశన్ మాధ్యాల ను ప్రతిరోజూ 24 గంటలూ లెక్క లోకి తీసుకోవడం జరుగుతుంది. ఈ సమాచారాన్ని ఆధారం గా తీసుకొని అవసరాలను బట్టి రైళ్ళ సంఖ్య ను మరియు యాత్రల సంఖ్య ను పెంచడం జరుగుతుంటుంది. యావత్తు వేసవి కాలాని కి రైళ్ళ సంఖ్య గాని లేదా అదనపు రైళ్ళ ద్వారా ఏర్పాటు చేసే యాత్ర ల సంఖ్య గాని స్థిరం గా అయితే ఉండదు.
వేసవి కాలాన్ని దృష్టి లో పెట్టుకొని, రైల్ వే స్టేశన్ లలో త్రాగునీటి ని అందుబాటులో ఉండేటట్లు చూడాలని జోనల్ రైల్ వే లకు ఆదేశాలు ఇవ్వడమైంది. అన్ని ప్రధానమైన మరియు ముఖ్యమైన రైల్ వే స్టేశన్ లలో గుంపు ల నియంత్రణ కోసం విస్తృత వ్యవస్థ ను సిద్ధం చేయడమైంది. గుంపుల ను ఒక వ్యవస్థిత పద్ధతి లో నియంత్రించడం కోసం అన్ని కార్యక్రమాల ను పర్యవేక్షించడానికి ఈ స్టేశన్ లలో అనుభవజ్ఞులైన అధికారుల కు బాధ్యతల ను అప్పగించడమైంది.
సామాన్య శ్రేణి యాత్రికుల కు ఉద్దేశించిన రైలు పెట్టెల లో వారు ప్రవేశించడం కోసం రైలు ప్రయాణం మొదలయ్యే స్టేశన్ లలో ఒక వరుస లో ప్రయాణికులు నిలబడేటట్టు గా చూడడాని కి గాను రైల్ వే ప్రొటెక్శన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్) సిబ్బంది ని పురమాయించడమైంది. జన సమూహం భారీ గా పోగుబడే ప్రాంతాల లో గట్టి పర్యవేక్షణ కై మరియు యాత్రికుల కు వాస్తవిక సమయం లో సహాయాన్ని అందించడం కోసం సిసిటివి కంట్రోల్ రూమ్ లో ఆర్‌పిఎఫ్ లోని కుశల సిబ్బంది ని ఏర్పాటు చేయడమైంది.
భారీ రద్దీ ఉండే సందర్భాల లో త్రొక్కిసలాట స్థితి తలఎత్తకుండా నివారించడం కోసం గుంపు ను అదుపు చేయడం కోసం రైల్ వే పోలీసు (జిఆర్‌పి) & రైల్ వే ప్రొటెక్శన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్) లకు చెందిన సిబ్బంది సేవల ను ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ల వద్ద అందుబాటు లో ఉంచుతారు.
ప్రయాణికులు అందరికీ అనుకూలమైనటువంటి మరియు సౌకర్యవంతమైనటువంటి యాత్రానుభూతి ని అందించడం కోసం ఇండియన్ రైల్ వేస్ కంకణం కట్టుకొంది. యాత్రికులు ఈ అదనపు రైళ్ళ లో వారి వారి టికెట్టుల ను రైల్ వే టికెట్ కౌంటర్ ల ద్వారా గాని, లేదా ఐఆర్‌సిటిసి వెబ్ సైట్ / ఏప్ మాధ్యం ద్వారా గాని బుక్ చేసుకోవచ్చును.
***
(Release ID: 2018243)
Visitor Counter : 154