ప్రధాన మంత్రి కార్యాలయం
ఎస్‌సిఒ 2019 లో (2019 జూన్ 14 వ తేదీ న)ప్రధాన మంత్రి ప్రసంగం యొక్క అనువాదం
నాడు పోస్టు చేయడమైనది:
14 JUN 2019 3:09PM by PIB Hyderabad
శ్రేష్ఠుడు, కిర్గిజ్ గణతంత్రం యొక్క అధ్యక్షుడు మరియు నేటి సమావేశాని కి చెయర్ మేన్,
ఇక్సెలన్సిజ్, కాలీగ్స్ ఎండ్ ఫ్రెండ్స్,
అన్నింటి కంటే ముందుగా ఎస్‌సిఒ సమిట్ ను సమర్థం గా నిర్వహిస్తున్నందుకు అధ్యక్షుడు శ్రీ జీన్ బెకోవ్ కు మరియు కిర్గిజ్ గణతంత్రాని కి నేను అభినందనల ను తెలియజేయ దలచాను. ఆయన ఇచ్చినటువంటి ఉదారమైనటువంటి ఆతిథ్యాని కి మరియు వైభవోపేతం అయినటువంటి స్వాగతాని కి కూడాను ఆయన కు నేను ధన్యవాదాల ను తెలియజేయ దలచాను. ఎస్‌సిఒ నేతల తో నిర్వహిస్తున్న ఈ సమావేశం లో పాలుపంచుకోవడం అంటే అది నాకు సంతోషాన్ని ఇచ్చేటటువంటి విషయం. భారతదేశం ఎస్‌సిఒ లో పూర్తి కాలపు సభ్యత్వం కలిగిన ఒక దేశం గా మారి ఇప్పటికి రెండు సంవత్సరాలు అయింది. మేం ఎస్‌సిఒ యొక్క కార్యకలాపాలు అన్నింటిలో సకారాత్మకమైన తోడ్పాటుల ను అందించాం. అంతర్జాతీయ స్థాయి లో ఎస్‌సిఒ యొక్క భూమిక ను మరియు విశ్వసనీయత ను పెంచడానికి ఎన్నో కార్యాల ను ఎప్పటికప్పుడు మనం చేపడుతూ వచ్చాం.
శ్రేష్ఠులారా,
భారతదేశం యొక్క చరిత్ర, నాగరకత మరియు సంస్కృతి లు వేల సంవత్సరాలు గా ఎస్‌సిఒ ప్రాంతం తో పెనవేసుకొని ఉన్నాయి. మన ప్రాంతాని కి ఆధునిక యుగం లో మెరుగైనటువంటి కనెక్టివిటీ యొక్క అవసరం ఎంతైనా ఉంది. ఇంటర్ నేశనల్ నార్థ్ సౌథ్ ట్రాన్స్ పోర్ట్ కారిడర్, చాబహార్ నౌకాశ్రయం, అశ్ గాబాత్ ఒప్పందం ల వంటి కార్యక్రమాలు కనెక్టివిటీ విషయం లో భారతదేశం తీసుకొంటున్న శ్రద్ధ ను ప్రస్ఫుటం చేసివేస్తున్నాయి. మేం 2017 వ సంవత్సరం నాటి నుండి కాబుల్, ఇంకా కాందహార్ మొదలుకొని న్యూ ఢిల్లీ మరియు ముంబయి ల మధ్య ఎయర్ ఫ్రైట్ కారిడర్ ను కూడా నిర్వహిస్తూ వచ్చాం. సార్వభౌమత్వం పట్ల గౌరవం, ప్రాంతీయ సమగ్రత, సుపరిపాలన, పారదర్శకత్వం, ఆచరణాత్మకత మరియు విశ్వాసపాత్రత లు అనేవి కనెక్టివిటీ సంబంధి కార్యక్రమాల కు ఒక ఆధారం గా ఉండాలి. ప్రజల మధ్య పరస్పర సంబంధాల ప్రాముఖ్యం సైతం భౌతిక సంధానాని కి తీసిపోయిందేమీ కాదు. ఎస్‌సిఒ లో చాలా వరకు దేశాల కు మా యొక్క ఇ-టూరిస్ట్ వీజా సేవ లు అందుబాటు లో ఉంటున్నాయి. త్వరలోనే ఇండియన్ టూరిజమ్ డిపార్ట్ మెంట్ యొక్క వెబ్ సైట్ వారం లో ప్రతి ఒక్క గంటా పని చేసే పర్యటకుల హెల్ప్ లైను ను కలిగివుంటుంది అని, మరి దీనిలో ఎస్‌సిఒ దేశాల పర్యటకుల కు సౌలభ్యం కోసమని రశ్యన్ భాష లో లభించే రశ్యన్ ఇంట్ ఫేస్ లు కూడా ఉంటాయి అని ప్రకటిస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను.
శ్రేష్ఠులారా,
ఎస్‌సిఒ ప్రాంతం లో స్థిరత్వాని కి మరియు భద్రత కు ఒక ఐక్యమైనటువంటి, శాంతియుక్తమైనటువంటి, భద్రమైనటువంటి మరియు సమృద్ధియుక్తమైనటువంటి అఫ్‌గానిస్తాన్ ఏర్పాటు చాలా ముఖ్యమైన అంశం అని చెప్పాలి. అఫ్గాన్ నాయకత్వం లో, అఫ్గాన్ యాజమాన్యం లో మరియు అఫ్గాన్ నియంత్రణ లో అన్ని వర్గాల ప్రజల ను శాంతి ప్రక్రియ లో భాగస్తుల ను చేయడాని కి జరిగే యత్నాల లో ప్రభుత్వ ప్రయాసల ను మరియు అఫ్‌గానిస్తాన్ ప్రజల ను సమర్థించాలి అనేదే మన ధ్యేయం గా ఉన్నది. ఎస్‌సిఒ అఫ్‌గానిస్తాన్ కాంటాక్ట్ గ్రూపు యొక్క తదుపరి కార్యాచరణ కు ఉద్దేశించిన మార్గసూచీ సిద్ధం గా ఉండడం మనకందరకు సంతోషాన్నికలిగిస్తోంది.
శ్రేష్ఠులారా,
మన ప్రాంతం లో ఆరోగ్యకరమైన సహకారాన్ని బలపరచడం కోసం మనం ఒక దృష్టి కోణాన్ని కలిగి ఉండాలి. మన సహకారాని కి ‘హెచ్‌ఇఎఎల్‌టిహెచ్’ అనే అక్షరాలు ఒక చక్కని బాట ను పరచగలవు. ఈ అక్షరాల లో,
హెచ్ అనే అక్షరం హెల్థ్ కేర్ కోఆపరేశను
ఇ అనే అక్షరం ఇకనామిక్ కోఆపరేశన్
ఎ అనే అక్షరం ఆల్టర్ నేట్ ఎనర్జీ
ఎల్ అనే అక్షరం లిటరేచర్ ఎండ్ కల్చర్
టి అనే అక్షరం టెరరిజమ్ ఫ్రీ సొసైటీ
హెచ్ అనే అక్షరం హ్యూమేనిటేరియన్ కోఆపరేశన్ ను సూచిస్తాయి.
హెల్థ్ కేర్ కోఆపరేశన్ కోసం హెచ్
మనం ఎస్‌సిఒ యొక్క 2019-2021 కార్యచరణ ప్రణాళిక ను ఆరోగ్య సంరక్షణ ప్రధానమైంది గా నొక్కి పలకాలి. భారతదేశం టెలి-మెడిసిన్ మరియు మెడికల్ టూరిజమ్ రంగం లో తాను సంపాదించిన అనుభవాన్ని వెల్లడి చేయడాని కి సంతోషం గా ముందుకు వస్తుంది.
ఇకనామిక్ కోఆపరేశన్ కోసం ఇ
ఇకనామిక్ కోఆపరేశన్ అనేది మన ప్రజల భవితవ్యాని కి ఒక పునాది గా ఉంటుంది. ఒకవైపే మొగ్గు ను చూపుతూ ఉండడం మరియు రక్షణాత్మక విధానం అనేది ఎవ్వరికీ ఏ హితాన్ని అందించిన దాఖలా లు లేవు. మనకు కావలసిందల్లా ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఒ) తో అనుబంధం పెంచుకొనే నియమాల ఆధారితమైన, పారదర్శకమైన వివక్ష కు చోటు ఇవ్వని, అరమరికలు ఉండని, అన్ని పక్షాల ను కలుపుకొని పోయేటటువంటి బహుళ పార్శ్విక వ్యాపార వ్యవస్థ. ఇది సభ్యత్వ దేశాలన్నింటి హితాల ను కాపాడుతుంది. మరీ ముఖ్యం గా అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాల ను పరిరక్షిస్తుంది. ఎస్‌సిఒ లో ఆర్థిక కార్యకలాపాల పరం గా సభ్యత్వ దేశాల కు మిత్రపూర్వకమైన పర్యావరణాన్ని కల్పించేందుకు అదేపని గా పాటుపడాలి అన్నది భారతదేశం యొక్క వాగ్దానం గా ఉంది. ఈ రోజు న మనం కీలకమైన ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయబోతున్నాం; ఇది ఎస్‌సిఒ లో ఆర్థిక వ్యవహారాలు, డిజిటైజేశన్, ఇంకా ఐసిటి లలో సహకారాన్ని బలోపేతం చేయగలదు.
ఆల్టర్ నిట్ ఎనర్జీ కోసం ఎ
జలవాయు పరివర్తన విషయం లో భారతదేశం యొక్క వచనబద్ధత మా యొక్క తత్వ శాస్త్రం లో ఇమిడిపోయివుంది. పుడమి ని మన జనని గా మా తత్వ శాస్త్రం భావిస్తుంది. ప్రస్తుతం భారతదేశం నవీకరణ యోగ్య శక్తి ఉత్పాదన లో ఆరో అతి పెద్ద దేశం గా ఉంది; అంతేకాకుండా, సౌర విద్యుత్తు ఉత్పాదన లో అయిదో అతి పెద్ద దేశం గా కూడా ఉంది. ఇంటర్ నేశనల్ సోలర్ అలయన్స్ భారతదేశం ప్రతిపాదించిన ఒక సంయుక్త కార్యక్రమం. దీని లక్ష్యమల్లా సాంకేతిక విజ్ఞానాన్ని అండ గా తీసుకోవడంతో పాటు సౌరశక్తి సంబంధి ఖర్చుల ను తగ్గించాలి అన్నదే. ఈ కార్యక్రమం లో పాలుపంచుకోవలసింది గా ఎస్‌సిఒ లోని దేశాల ను నేను ఆహ్వానిస్తున్నాను. అభివృద్ధి చెందుతూ ఉన్న ప్రత్యామ్నాయ శక్తి వనరుల పరం గా మా యొక్క అనుభవాన్ని వెల్లడించడానికి మేం సిద్ధం గా ఉన్నాం. ఎస్‌సిఒ లోని పర్యావరణ పరిరక్షణ నిమిత్తం 2019-21 మధ్య కాలం లో సహకారాని కి ఉద్దేశించిన ఒక కాన్సెప్ట్ పేపరు కు ఈ రోజు న మేం సమ్మతి ని తెలియ జేశాం.
లిటరేచర్ ఎండ్ కల్చర్ కోసం ఎల్
ఇతర దేశాల కు చెందిన సాహిత్యాన్ని పరిచయం చేసుకోవడం పట్ల మన యువజనుల ను ప్రోత్సహించామా అంటే గనక అది మన సంబంధాల ను మరింత గా విస్తరింప చేస్తుంది. భారతదేశం లోని సాహిత్యం లో పది మహా గ్రంథాల ను ఎస్‌సిఒ దేశాల కు చెందిన భాషల లోకి అనువాదం చేయడం జరుగుతుంది. ఉజ్ బెకిస్తాన్ సహకారం తో తాశ్ కెంత్ లో ఒక ఎస్‌సిఒ చిత్రోత్సవాన్ని ఇటీవలె విజయవంతం గా నిర్వహించడమైంది. దీనిలో భాగం గా బాలీవుడ్ కు చెందిన వినోద ప్రధానమైన చలన చిత్రాల ను మరియు ఉజ్ బెక్ చలన చిత్రాల ను చేర్చడం జరిగింది. సాహిత్యం మరియు సంస్కృతి మన సమాజాల కు ఒక సకారాత్మకమైన కార్యాచరణ ను అందిస్తాయి. విశేషించి, ఇది మన సమాజం లోని యువత లో సమూల సంస్కరణవాదం యొక్క వ్యాప్తి ని అడ్డుకో గలుగుతుంది.
టెరరిజమ్ ఫ్రీ సొసైటీ కోసం టి
క్రిందటి ఆదివారం నేను శ్రీ లంక ను సందర్శించినప్పుడు సెయింట్ ఏంథని చర్చ్ కు వెళ్ళాను. అక్కడ నేను ఉగ్రవాదం యొక్క లజ్జాకరమైన చేష్ట ను గుర్తుకు తెచ్చుకొన్నాను. ఉగ్రవాదం ఎక్కడైనా, ఏ కాలం లో అయినా తలెత్తగలదు. అమాయక ప్రజల ప్రాణాల ను బలిగొనగలదు. ఈ భూతం తో పోరాడాలి అంటే, మానవీయ శక్తులు అన్నీ కూడాను వాటి సంకుచిత దృక్పథాల నుండి వెలుపలకు వచ్చి ఒక్కటవ్వాల్సి ఉంటుంది. ఉగ్రవాదుల కు సహాయం చేస్తున్న, వారిని సమర్థిస్తున్న, వారికి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న దేశాల ను జవాబుదారు గా చేయాలి. ఎస్‌సిఒ లో సభ్యత్వాన్ని కలిగివున్న దేశాలు ఉగ్రవాదాన్ని అంతం చేయడం కోసం ఎస్‌సిఒ-ఆర్ఎటిఎస్ యొక్క సామర్థ్యాన్ని ప్రభావవంతం అయిన రీతి లో ఉపయోగించుకోవాలి. ఉగ్రవాదం అనే భూతం తో పోరాడడానికి ఒక అంతర్జాతీయ సమావేశాన్ని నిర్వహించాలి అని భారతదేశం పిలుపు ను ఇస్తున్నది.
హ్యూమేనిటేరియన్ కోఆపరేశన్ కోసం హెచ్
ఈ ప్రాంతం లో భారతదేశం మానవత పూర్వకమైన సహాయం అంశం లో, విపత్తులు ఏర్పడిన సందర్భాల లో ముందుగా స్పందించే దేశం గా తన పాత్ర ను పోషిస్తూ వస్తోంది. మేం మా అనుభవాల ను మరియు మా ప్రావీణ్యాన్ని ఎస్‌సిఒ దేశాల కు వెల్లడించేందుకు సంతోషం గా ముందుకు వస్తాం. విపత్తుల వేళల్లో కూడా స్థిరం గా నిలచేటటువంటి మౌలిక సదుపాయాల ను ఏర్పరచేందుకు మనం ప్రత్యేక శ్రద్ధ ను తీసుకొనే తీరాలి.
శ్రేష్ఠులారా,
(నేను బిశ్కెక్ ప్రకటన నున స్వాగతిస్తున్నాను; ఇది సహకారాని కి ఉపయోగపడే ఒక నమూనా.) నేను మన ఆతిథేయి అధ్యక్షుడు శ్రీ జీన్ బెకోవ్ కు మరొక్క మారు ధన్యవాదాల ను తెలియ జేస్తున్నాను. వచ్చే సంవత్సరం లో ఎస్‌సిఒ కు అధ్యక్ష బాధ్యతల ను స్వీకరించనున్నందుకు గాను ప్రెసిడెంట్ శ్రీ వ్లాదిమీర్ పుతిన్ కు నేను శుభాకాంక్షల ను తెలియజేస్తూ, మరి ఆయన ను అభినందించ దలచాను. ఎస్‌సిఒ కు అధ్యక్ష బాధ్యత ను రశ్యన్ ఫెడరేశన్ విజయవంతం గా నిర్వహించడం కోసం భారతదేశం పక్షాన పూర్తి సమర్థన కు నేను హామీ ని ఇస్తున్నాను.
మీకు ఇవే ధన్యవాదాలు.
***
(రిలీజ్ ఐడి: 2017407)
సందర్శకుల సూచీ సంఖ్య : : 28