సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

భారత లోక్‌పాల్ న్యాయ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ రీతూ రాజ్ అవస్తీ లోక్‌పాల్ సభ్యునిగా శ్రీ పంకజ్ కుమార్ మరియు శ్రీ అజయ్ టిర్కీ ప్రమాణ స్వీకారం

Posted On: 27 MAR 2024 4:25PM by PIB Hyderabad

జస్టిస్ రీతు రాజ్ అవస్థి లోక్‌పాల్ న్యాయ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. భారత లోక్‌పాల్ చైర్‌పర్సన్ జస్టిస్ ఎ. ఎం. ఖాన్విల్కర్ ఆయన చేత ప్రమాణం చేయించారు. లోక్‌పాల్ సభ్యుడిగా శ్రీ పంకజ్ కుమార్, శ్రీ అజయ్ టిర్కీ ప్రమాణ స్వీకారం చేశారు. న్యూఢిల్లీలోని లోక్‌పాల్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. కొత్త నియామకాలు.. ఇప్పటికే ఉన్న ఇద్దరు జ్యుడీషియల్ సభ్యులుగా జస్టిస్ పి. కె. మొహంతి, జస్టిస్ అభిలాష కుమారి, ముగ్గురు సభ్యులు శ్రీ డి. కె. జైన్, శ్రీమతి అర్చన రామసుందరం, శ్రీ మహేందర్ సింగ్ తదితరులు 26 మార్చి 2024న లోక్‌పాల్‌లో తమ పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న తరుణంలో  జరిగాయి.  శ్రీ జస్టిస్ రీతు రాజ్ అవస్థి, భారత లోక్‌పాల్‌లో జ్యుడీషియల్ మెంబర్‌గా చేరడానికి ముందు 22వ లా కమిషన్ ఆఫ్ ఇండియా చైర్‌పర్సన్‌గా పనిచేశారు. అంతకు ముందు కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కూడా సేవలందిచారు. శ్రీ పంకజ్ కుమార్ గుజరాత్ కేడర్ 1986 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. భారత లోక్‌పాల్ సభ్యుడిగా చేరడానికి ముందు, అతను గుజరాత్ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. శ్రీ అజయ్ టిర్కీ మధ్య ప్రదేశ్ కేడర్‌కు చెందిన 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. భారత లోక్‌పాల్ సభ్యునిగా చేరడానికి ముందు, అతను భారత ప్రభుత్వ భూ వనరుల శాఖ కార్యదర్శిగా కూడా సేవలందించారు. శ్రీ ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ మరియు సీబీఐ మరియు ఈడీ ఇతర సీనియర్ అధికారులు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు.

***



(Release ID: 2016557) Visitor Counter : 106