రైల్వే మంత్రిత్వ శాఖ

హోలీ పండుగ సీజన్‌లో ప్రయాణీకులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి ఇప్పటివరకు 540 ప్రత్యేక సర్వీసులను ప్రకటించిన భారతీయ రైల్వే


ప్రధాన స్టేషన్లలో క్రౌడ్ మేనేజ్‌మెంట్‌కు ప్రాధాన్యత

దేశంలోని ప్రధాన గమ్యస్థానాలను రైల్వే మార్గాల్లో అనుసంధానించేలా ఈ రైళ్ల ప్రణాళిక రూపొందించబడింది

గత ఏడాదితో పోలిస్తే ఈ పండుగ సీజన్‌లో 219 అదనపు సర్వీసులు

Posted On: 21 MAR 2024 11:49AM by PIB Hyderabad

ఈ హోలీ పండుగ సీజన్‌లో రైలు ప్రయాణికుల సౌకర్యార్థం మరియు ప్రయాణికుల అదనపు రద్దీని నియంత్రించేందుకు భారతీయ రైల్వే 540 ప్రత్యేక రైలు సర్వీసులను నడుపుతోంది.

దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన గమ్యస్థానాలైన ఢిల్లీ- పాట్నా, ఢిల్లీ- భాగల్‌పూర్, ఢిల్లీ-ముజఫర్‌పూర్, ఢిల్లీ-సహర్సా, గోరఖ్‌పూర్- ముంబై, కోల్‌కతా-పూరి, గౌహతి- రాంచీ, న్యూఢిల్లీ- శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా, జైపూర్- బాంద్రా టెర్మినస్, పూణే- దానాపూర్, దుర్గ్-పాట్నా, బరౌనీ-సూరత్ మొదలైన మార్గాల్లో రైళ్లను అనుసంధానం చేసేలా ఈ ప్రణాళిక రూపొందించబడింది.

 

క్రమ సంఖ్య

రైల్వే

నోటిఫైడ్ సేవలు

1

సీఆర్

88

2

ఈసీఆర్

79

3

ఈఆర్

17

4

ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే

12

5

ఎన్‌సిఆర్

16

6

ఎన్‌ఈఆర్

39

7

ఎన్‌ఎఫ్‌ఆర్‌

14

8

ఎన్‌ఆర్‌

93

9

ఎన్‌డబ్ల్యూఆర్‌

25

10

ఎస్‌సిఆర్

19

11

ఎస్‌ఈఆర్‌

34

12

ఎస్‌ఈసిఆర్‌

4

13

ఎస్‌ఆర్‌

19

14

ఎస్‌డబ్ల్యూఆర్‌

6

15

డబ్ల్యూసిఆర్

13

16

డబ్ల్యూఆర్

62

 

మొత్తం

540

  

రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్‌) సిబ్బంది పర్యవేక్షణలో టెర్మినస్ స్టేషన్ల వద్ద క్యూను ఏర్పాటు చేయడం ద్వారా రద్దీని నియంత్రించే చర్యలు చేపట్టబడతాయి. అలాగే అన్‌రిజర్వ్ కోచ్‌లలో ప్రయాణికులు  క్రమబద్ధంగా ప్రవేశించేలా చూస్తారు.

ప్రయాణికుల భద్రత కోసం ప్రధాన స్టేషన్లలో అదనపు ఆర్పీఎఫ్ సిబ్బందిని మోహరించారు. రైళ్లను సజావుగా నడిపేందుకు ప్రధాన స్టేషన్లలో ఎమర్జెన్సీ డ్యూటీలో అధికారులను నియమించారు. రైళ్ల సర్వీసులో ఎలాంటి అంతరాయం ఏర్పడినా ప్రాధాన్యతపై హాజరు కావడానికి వివిధ విభాగాల్లో సిబ్బందిని నియమించారు.

ప్లాట్‌ఫారమ్ నంబర్‌లతో పాటు రైళ్ల రాక/బయలుదేరు సమయాలను సకాలంలో ప్రకటించడానికి చర్యలు తీసుకోబడ్డాయి.

 
***


(Release ID: 2015946) Visitor Counter : 53