ప్రధాన మంత్రి కార్యాలయం

ఒడిశా లోనిజాజ్ పుర్ లో వివిధ పథకాల ప్రారంభం వేళ లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

Posted On: 05 MAR 2024 5:23PM by PIB Hyderabad

ఒడిశా గవర్నరు శ్రీ‌ రఘుబర్ దాస్ గారు, ఈ రాష్ట్రం యొక్క గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ నవీన్ పట్ నాయక్ గారు, మంత్రివర్గం లో నా సహచరుడు శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారు, శ్రీ బిశ్వేశ్వర్ టుడు గారు, ఇతర ప్రముఖులు, మహిళలు మరియు సజ్జనులారా,



జయ్ జగన్నాథ్.


ఈ రోజు న ప్రభువు జగన్నాథ్ మరియు మాత బిరజ ల దివ్యమైన ఆశీర్వాదం తో జాజ్‌పుర్ లో మరియు ఒడిశా లో అభివృద్ధి తాలూకు ఒక ధార ప్రవహించడం మొదలుపెట్టింది. ఈ రోజు న బిజు బాబు జయంతి కూడాను. ఒడిశా ప్రగతి కి మరియు దేశ ప్రగతి కి బిజు బాబు అందించినటువంటి తోడ్పాటు అసమానమైంది గా ఉండింది. నేను దేశ ప్రజలు అందరి తరఫు న మాన్యుడు బిజు బాబు కు శ్రద్ధాసుమాల ను అర్పించడం తో పాటు గా ఆయన కు వందనాన్ని ఆచరిస్తున్నాను.
 

మిత్రులారా,

ఈ రోజు న ఇక్కడ 20,000 కోట్ల రూపాయల విలువైన ముఖ్య పథకాలను ప్రారంభించడం తో పాటు గా శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమాలు పెట్రోలియమ్, సహజ వాయువు, పరమాణు శక్తి రంగాల కు చెందినవి కావచ్చు, లేదా రహదారులు, రైలు మార్గాలు, ఇంకా రవాణా లకు సంబంధించినవి కావచ్చు.. ఈ అభివృద్ధి కార్యాల తో ఇక్కడ పారిశ్రమిక కార్యకలాపాలు పెరిగి ఉపాధి కి క్రొత్త అవకాశాలు అందిరాగలవు. నేను ఈ ప్రాజెక్టుల కు గాను ఒడిశా లో ప్రజలందరి కి అనేకానేక అభినందనల ను తెలియ జేస్తున్నాను.

 

మిత్రులారా,

ఈ రోజు న మనకు వర్తమాన అంశాల పై శ్రద్ధ ఉన్న ఒక ప్రభుత్వం మాత్రమే కాకుండా అభివృద్ధి చెందినటువంటి భారతదేశాన్నిఆవిష్కరించడాని కి ఒక ప్రతిజ్ఞ ను తీసుకొన్నటువంటి, భవిష్యత్తు ను గురించిన ఆలోచనలు కలిగినటువంటి ప్రభుత్వం ఉన్నది. శక్తి రంగాన్ని తీసుకొంటే రాష్ట్రాల సామర్థ్యాల ను, మరీ ముఖ్యం గా భారతదేశం లోని తూర్పు ప్రాంతాల సామర్థ్యాన్ని పెంపొందింప చేసేందుకు మేం కృషి చేస్తున్నాం. ‘ఊర్జా గంగ’ ప్రాజెక్టు లో భాగం గా అయిదు పెద్ద రాష్ట్రాలు.. ఉత్తర్ ప్రదేశ్ లో, బిహార్ లో, ఝార్‌ ఖండ్ లో, పశ్చిమ బంగాల్ లో మరియు ఒడిశా లో.. సహజ వాయువు సరఫరా కు భారీ ప్రాజెక్టు లు నడుస్తున్నాయి. ఈ రోజు న, మన దేశ ప్రజల కు సేవల ను అందించడానికి పారాదీప్-సోమ్‌నాథ్‌ పుర్-హల్దియా గొట్టపు మార్గాన్ని సగర్వం గా అంకితం చేసుకొంటున్నాం. దీనికి తోడు, పారాదీప్ రిఫైనరీ లో సహజ వాయువు ప్రోసెసింగ్ కోసం ఒక యూనిట్ ను ప్రారంభించడమైంది. అదే విధం గా ఒక క్రొత్త మోనో ఎథిలిన్ గ్లైకాల్ ప్లాంటు ను ఆవిష్కరించడమైంది. ఇది భారతదేశం లోని తూర్పు ప్రాంతం లో పాలిస్టర్ పరిశ్రమ కు ఒక క్రొత్త శకాన్ని తీసుకొని వస్తుంది. దీనితో భద్రక్ లో, ఇంకా పారాదీప్ లో నిర్మాణం లో ఉన్నటువంటి టెక్స్‌టైల్ పార్కుల కు ముడిసరకు సులువుగా అందుబాటు లోకి రానుంది.

 

మిత్రులారా,
 

ఈ రోజు న జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ఇటీవల కొన్నేళ్ళ లో మన దేశం లో శ్రమ సంస్కృతి లో చోటు చేసుకొన్న ఒక ముఖ్యమైన మార్పు ను కూడా ప్రస్ఫుటం చేస్తున్నది. ఇది వరకటి ప్రభుత్వాలు అవి తలపెట్టిన ప్రాజెక్టుల ను నిర్ణీత కాల క్రమం లో పూర్తి చేయడం లో నిబద్ధత ను పాటించేవి కావు. దీనికి భిన్నం గా, మా ప్రభుత్వం ప్రాజెక్టుల ను ఒకసారి మొదలు పెట్టిన తరువాత వాటి ని సకాలం లో పూర్తి చేయడాని కి పెద్దపీట వేస్తోంది. 2014 వ సంవత్సరం మొదలుకొని దేశవ్యాప్తం గా నిలచిపోయిన లేదా జాప్యం జరిగిన ఎన్నో ప్రాజెక్టుల ను విజయవంతం గా పూర్తి చేయడమైంది. ఉదాహరణ కు చెప్పుకోవాలి అంటే గనక పారాదీప్ రిఫైనరీ ని గురించి న చర్చలు ఎప్పుడో 2002 వ సంవత్సరం లో ఆరంభం అయితే పురోగతి 2013-14 వరకు సంభవించలేదు. పారాదీప్ రిఫైనరీ ప్రాజెక్టు ను ఎట్టకేల కు కార్యరూపం లోకి తీసుకు వచ్చి, పూర్తి చేసింది మా ప్రభుత్వమే. దీనికి మించి, తెలంగాణ లోని సంగారెడ్డి లో పారాదీప్-హైదరాబాద్ పైప్ లైన్ ప్రాజెక్టు ను ప్రారంభించే భాగ్యం ఈ రోజు న నాకు దక్కింది. పైపెచ్చు, మూడు రోజుల క్రిందట పశ్చిమ బంగాల్ లోని ఆరామ్‌బాగ్ లో హల్దియా నుండి బరౌనీ వరకు 500 కిలో మీటర్ ల ముడి చమురు సరఫరాకు ఉద్దేశించిన గొట్టపుమార్గాన్ని ప్రారంభించడంతో ఒక ముఖ్యమైన మైలురాయి ని చేరుకోవడమైంది.



మిత్రులారా,

భారతదేశం లోని తూర్పు ప్రాంతం లో ప్రాకృతిక వనరులు సమృద్ధం గా ఉన్నాయి. మరి మా ప్రభుత్వం ఒడిశా లోని అరుదైన ఖనిజ సంపద సహా ఈ పుష్కలమైన వనరుల ను ఒడిశా యొక్క అభివృద్ధే ధ్యేయం గా వినియోగం లోకి తీసుకు వస్తోంది. ఈ రోజు న మనం గంజామ్ జిల్లా లో ఒక నిర్లవణీకరణ ప్లాంటు కు శంకుస్థాపన చేసుకొన్నాం; దీనితో ఒడిశా లో వేల కొద్దీ ప్రజల కు లాభం కలుగనుంది. ఈ ప్రాజెక్టు ప్రతి రోజు 50 లక్షల లీటర్ ల ఉప్పునీటి ని త్రాగడానికి అనువైంది గా మార్చుతుంది.

 

మిత్రులారా,

ఒడిశా లో వనరుల ను వృద్ధి చెందింప చేసి, రాష్ట్రం యొక్క పారిశ్రమిక సత్తా ను ఇనుమడింప చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఆధునిక సంధానం సంబంధి కార్యక్రమాల కు ప్రాధాన్యాన్ని కట్టబెడుతున్నది. గడచిన దశాబ్ది కాలం లో ఈ విషయం లో చెప్పుకోదగిన పురోగతి ని సాధించడమైంది. సుమారు గా 3,000 కిలో మీటర్ ల జాతీయ రాజమార్గాల ను ఒడిశా లో నిర్మించడమైంది. రైల్ వే బడ్జెటు ను సుమారు 12 రెట్లు పెంచడమైంది. జాజ్‌పుర్, భద్రక్, జగత్‌సింహ్‌ పుర్, మయూర్‌భంజ్, ఖోర్‌ధా, గంజామ్, పురీ, ఇంకా కేందుఝర్ లు సహా అనేక జిల్లాల లో జాతీయ రాజమార్గ విస్తరణ పథకాలు పురోగమిస్తున్నాయి. వీటి లక్ష్యమల్లా రైలు, హైవే, ఇంకా పోర్ట్ కనెక్టివిటీ ని ఇంతలంతలు చేయడమే. అదనం గా, క్రొత్త గా ప్రారంభించిన అంగుల్-సుకిందా రైలు మార్గం కీలకమైన ప్రాప్తి కి పూచీపడుతున్నది.. దీనితో కళింగనగర్ పారిశ్రమిక మండలం యొక్క విస్తరణ కు మార్గం తెరచుకొంది. ఒడిశా లో అభివృద్ధి సంబంధి ప్రయాసల ను వేగవంతం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకొంది. బిజు బాబు జయంతి సందర్భం లో ఆయన కు మరొక్కసారి నేను శ్రద్ధపూర్వకం గా స్మరించుకొంటూ మీకు అందరి కి అభివృద్ధి కార్యక్రమాల తాలూకు అనేకానేక అభినందనల ను తెలియ జేస్తున్నాను.

 

జయ్ జగన్నాథ్.

అస్వీకరణ: ఇది ప్రధాన మంత్రి ప్రసంగానికి భావానువాదం. సిసలు ఉపన్యాసం హిందీ భాష‌ లో కొన‌సాగింది.

 

 

 

***

 



(Release ID: 2015735) Visitor Counter : 28