భారత ఎన్నికల సంఘం

దివ్యాంగుల కోసం కేంద్ర ఎన్నికల సంఘం ప్రచారకర్తగా వ్యవహరించనున్న అర్జున అవార్డు గ్రహీత పారా ఆర్చర్ శీతల్ దేవి


అందరిని చేరుకోవడం, చేరిక లక్ష్యంగా ఇండియన్ డెఫ్ క్రికెట్ అసోసియేషన్ ( ఐడిసిఎ) ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ( డిడిసిఎ) మధ్య క్రికెట్ మ్యాచ్

'సీనియర్ సిటిజన్లు, అంగ వైకల్యం ఉన్న వారి కోసం రూపొందించిన ఓటర్ గైడ్ విడుదల

Posted On: 17 MAR 2024 4:31PM by PIB Hyderabad

ఓటర్లను విద్యావంతులను చేసి, ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ప్రోత్సహించడానికి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బిసీసీఐ) సహకారంతో ఇండియన్ డెఫ్ క్రికెట్ అసోసియేషన్ (ఐడీసిఏ) జట్టు, ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డిడిసిఏ) జట్ల మధ్య కేంద్ర ఎన్నికల సంఘం ఎగ్జిబిషన్ క్రికెట్ మ్యాచ్‌ను నిర్వహించింది. న్యూ ఢిల్లీ లోని కర్నైల్ సింగ్ స్టేడియంలో మ్యాచ్‌  2024 మార్చి 16న  జరిగింది. ఎన్నికలపై అవగాహన కల్పించడం కోసం వినూత్నంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ పారా-ఆర్చర్, అర్జున అవార్డు గ్రహీత శ్రీమతి శీతల్ దేవిని పిడబ్ల్యుడి విభాగం ఎన్నికల ప్రచారకర్తగా వ్యవహరిస్తారని ఎన్నికల సంఘం ప్రకటించింది. 

ఈ కార్యక్రమంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ శ్రీ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు  శ్రీ జ్ఞానేశ్ కుమార్, శ్రీ సుఖ్ బీర్ సింగ్ సంధులు పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు.  ప్రఖ్యాత భారత మాజీ క్రికెటర్ నిఖిల్ చోప్రా ముఖ్య అతిథిగా పాల్గొన్న కార్యక్రమానికి డిడిసిఎ ,ఐడిసిఎ అధికారులు హాజరయ్యారు. 

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా యూఏఈ లో  జరిగిన T20 ఛాంపియన్స్ ట్రోఫీని సాధించిన భారత బధిరుల క్రికెట్ జట్టుకు సీఈసీ  శ్రీ రాజీవ్ కుమార్ అభినందించారు.  నిలిచింది. " ''ప్రధాన స్రవంతి క్రికెట్ జట్లతో  ఇండియన్ డెఫ్ క్రికెట్ అసోసియేషన్ జట్టు   మ్యాచ్‌ను స్పాన్సర్ చేసే అవకాశాన్ని కేంద్ర ఎన్నిక్ల సంఘం పరిశీలిస్తుంది " అని శ్రీ రాజీవ్ కుమార్ తెలిపారు. 

మ్యాచ్‌ను  వివిధ వర్గాల  దివ్యాంగులు (పిడబ్ల్యుడిలు),యువ ఓటర్లతో సహా 2500 మంది తిలకించారు.పోటీ పడిన  రెండు జట్లు ఉత్సాహభరితమైన ప్రదర్శనను ప్రదర్శించాయి. అందరినీ కలుపుకొని పోవడం, కలిసి మెలిసి ఉండడం అనే సందేశంతో నిర్వహించిన మ్యాచ్ లో డిడిసిఎ జట్టు (190/5) 69 పరుగుల తేడాతో ఐడిసిఎ(121/8)జట్టుపై విజయం సాధించింది.  ‘ఓటుకు మించింది ఏమీ  లేదు, నేను కచ్చితంగా ఓటు వేస్తాను’ అనే సందేశం మ్యాచ్ సందర్భంగా ప్రచారం చేయడంలో ఎన్నికల సంఘం విజయం సాధించింది. 

అందరికీ ఓటు హక్కు కల్పించి  సాధికారత కల్పించడానికి ఎన్నికల సంఘం చేస్తున్న కృషిలో భాగంగా కార్యక్రమం జరిగింది.  దివ్యాంగులు ఓటర్లుగా నమోదు చేసుకుని ఓటు హక్కు వినియోగించుకోవడానికి కార్యక్రమం ఒక స్ఫూర్తిగా నిలుస్తుంది. 
' దృష్టిలోపం ఉన్న దివ్యాంగులు నిర్వహించిన 'షైనింగ్ స్టార్ మ్యూజిక్ బ్యాండ్ సంగీత విభావరితో మ్యాచ్ ముగిసింది.

కార్యక్రమంలో భాగంగా దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ ఓటర్ల  కోసం ఎన్నికల సంఘం రూపొందించిన  ఓటర్స్ గైడ్‌ను విడుదల చేశారు.  ఈ సమగ్ర బుక్‌లెట్ పోలింగ్ స్టేషన్‌లలో  దివ్యాంగుల కోసం కల్పించే మౌలిక సదుపాయాలు, సమాచార, విధానపరమైన వివరాలు, సీనియర్ సిటిజన్‌లకు అందుబాటులో ఉండే పోస్టల్ బ్యాలెట్‌, ప్రక్రియ తదితర సౌకర్యాలను పొందుపరిచారు.  

దివ్యాంగుల కోసం కేంద్ర ఎన్నికల సంఘం అనేక చర్యలు అమలు చేస్తోంది. గుర్తించిన లోపాలు కలిగిన  దివ్యాంగులు ఇంటి నుంచి ఓటు వేయడానికి  సౌకర్యం కల్పించడం, పోలింగ్ కేంద్రాల వారీగా వికలాంగుల గుర్తింపు, పోలింగ్ రోజున ఉచిత రవాణా సదుపాయం, అన్ని పోలింగ్ స్టేషన్‌లలో వైకల్యం-నిర్దిష్ట సౌకర్యాలు, పోలింగ్ స్టేషన్‌లలో యాక్సెసిబిలిటీ చెక్‌లిస్ట్, రాష్ట్ర ,జిల్లా స్థాయి  ప్రచారకర్తలను నియమించడం, అవగాహన ప్రచారాలు,  సాక్ష్యం  యాప్, బ్రెయిలీ ఆధారిత ఎపిక్, ఈవిఎం లను  ఏర్పాటు చేయడం లాంటి కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి. .
ఇటువంటి కార్యక్రమాలు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కువ మంది  ముఖ్యంగా యువత, వికలాంగులు పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకుంటారని  భారత ఎన్నికల సంఘం నమ్మకంగా ఉంది. మార్గదర్శకాలు,  సమగ్ర చర్యల అమలు కోసం ఎన్నికల సంఘం పటిష్ట వ్యవస్థను అభివృద్ధి చేసింది.ప్రజాస్వామ్యబద్ధంగా స్వేచ్ఛగా ఎన్నికలు జరిగేలా చూసేందుకు సంఘం  కట్టుబడి ఉంది.
ఇండియన్ సైన్ లాంగ్వేజ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ (ISLRTC)కి చెందిన విద్యార్థులు సంకేత భాషలో జాతీయ గీతాన్ని ఉద్వేగభరితంగా ఆలపించడం తో కార్యక్రమం  ముగిసింది.


 

****



(Release ID: 2015358) Visitor Counter : 330