కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
తపాలా విభాగంలో పని చేస్తున్న 2.56 లక్షల మంది గ్రామీణ డాక్ సేవక్‌లకు ఆర్థిక మెరుగుదల పధకాన్ని ప్రారంభించిన మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్
Posted On:
15 MAR 2024 3:39PM by PIB Hyderabad
తపాలా విభాగంలో పని చేస్తున్న 2.56 లక్షలకు పైగా గ్రామీణ డాక్ సేవక్స్ (జిడిఎస్‌లు) ఉద్యోగ పరిస్థితులను మెరుగుపరిచి, ఉద్యోగంలో స్తబ్దతను తొలగించేందుకు ఫైనాన్షియల్ అప్‌గ్రడేషన్ స్కీం (ఆర్థిక మెరుగుదల పథకం)ను శుక్రవారం నాడు కేంద్ర సమాచార, రైల్వేలు & ఎలక్ట్రానిక్స్ & సమాచార సాంకేతికత శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ ప్రారంభించారు.
గ్రామీణ ప్రాంతాలలో తపాలా విభాగానికి వెన్నుగా జిడిఎస్‌లు నిలబడి, దేశంలోని అత్యంత మారుమూల ప్రదేశాలకు కూడా తపాలా, ఆర్థిక సేవలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తారు.
గ్రామీణ డాక్ సేవక్స్ (ఆర్థిక మెరుగుదల మంజూరు) పథకం, 2024లోని కీలక అంశాలుః
ప్రతి గ్రామీణ డాక్ సేవక్ 12, 24, 36 ఏళ్ళ సర్వీసును పూర్తి చేసుకున్నసందర్భంలో వరుసగా, రూ. 4,320/-, రూ. 5,520/-, రూ.7,200 మేరకు వార్షికంగా ఆర్థిక మెరుగుదల ఉంటుంది. అంటే వారి సర్వీసు కాలంలో మూడు సందర్భాలలో వారికి ఈ పెంపుదల ఉంటుంది.
ఇది జిడిఎస్‌లకు కాల సంబంధిత కొనసాగింపు అలవెన్స్ (టిఆర్‌సిఎ) రూపంలో అందించే వేతనానికి అదనం.
జిడిఎస్‌ల ఉద్యోగ పరిస్థితులనను మెరుగుపరిచేందుకు తీసుకున్న విశేష చర్యతో, ఈ పథకం 2,56 లక్షలకు పైగా జిడిఎస్‌లకు లబ్ధి చేకూర్చడమే కాకుండా, వారి సేవలలో స్తబ్దతను తొలగిస్తుంది.
***
(Release ID: 2015119)