సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్
azadi ka amrit mahotsav

మహారాష్ట్రలోని సింధుదుర్గ్లో ఎం.ఎస్.ఎం.ఇ టెక్నాలజీ సెంటర్కు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి శ్రీ నారాయణ్ రాణే.

నాడు పోస్టు చేయడమైనది: 11 MAR 2024 6:08PM by PIB Hyderabad

కేంద్ర సూక్ష్మ చిన్నమధ్యతరహా ఎంటర్ప్రైజెస్ శాఖ మంత్రి శ్రీ నారాయణ్ రాణే మహారాష్ట్రలోని సింధు దుర్గ్లో ఎం.ఎస్.ఎం.ఇ టెక్నాలజీ సెంటర్కు ఈరోజు శంకుస్థాపన చేశారు. సింధుదుర్గ్ ఔద్యోగిక్ మహోత్సవ్స్వయం ఉపాధి సమ్మేళనాన్ని కూడా కేంద్ర మంత్రి ఈ సందర్బంగా ప్రారంభించారు. ఎ.ఎస్. అండ్ డిసి (ఎం.ఎస్.ఎం.ఇ) అదనపు కార్యదర్శి డాక్టర్ రజనీష్మంత్రిత్వశాఖకు చెందిన ఇతర సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

దేశవ్యాప్తంగా 20 కొత్త టెక్నాలజీ కేంద్రాలువంద ఎక్స్టెన్షన్ కేంద్రాలుఏర్పాటు చేయనున్నారు. ఇవి మైక్రో చిన్నమధ్యతరహా ఎంటర్ ప్రైజ్లకు సాంకేతితకతను మరింత అందుబాటులోకి తీసుకురానున్నాయి. ఎం.ఎస్.ఎం. ఇ టెక్నాలజీ సెంటర్ సింధు దుర్గ్ ను 182 కోట్ల రూపాయల ప్రాజెక్టు వ్యయంతో చేపట్టనున్నారు.ఇవి జనరల్ ఇంజినీరింగ్నఫుడ్ ప్రాసెసింగ్పై దృష్టిపెడతాయి.ఇవి ఎం.ఎస్.ఎం.ఇల వృద్ధికి కొత్త అవకాశాలు కల్పించేందుకు కృషి చేయనున్నాయి.

 

ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీ రాణే, 2030 నాటికి ఇండియా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా అవతరించనున్నదని తెలిపారు.సింధుదుర్గ్లో ఏర్పాటైన టెక్నాలజీ సెంటర్ యువతకు వివిధ రంగాలలో అత్యాధునిక శిక్షణను అందిస్తుందన్నారు. ఇది ఈ రంగం వృద్ధికిరాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి మరింత గా దోహదపడుతుందనిఫుడ్ ప్రాసెసింగ్ అనేది ఈ ప్రాంతంలో ఒక ప్రధాన పారిశ్రామిక కార్యకలాపంగా రూపుదిద్దుకోనున్నదని చెప్పారు.

 ఎఎస్అండ్ డిసి (ఎం.ఎస్.ఎం.ఇ) డాక్టర్ రజనీష్ మాట్లాడుతూ, 2047 నాటికి ఇండియా అభివృద్ది చెందిన దేశగా ఎదగాలంటే ఎం.ఎస్.ఎం.ఇలు అంతర్జాతీయంగా పోటీతత్వం కలిగిఉండడంతోపాటు ప్రపంచ ప్రమాణాలను అందుకోవాలని సూచించారు. దేశవ్యాప్తంగా విస్తరించిన టెక్నాలజీ కేంద్రాలు ఈ పరివర్తనలో కీలక పాత్ర పోషించనున్నాయన్నారు. శ్రీ నారాయణ్ రాణే ప్రధానమంత్రి విశ్వకర్మ పై ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలతో ముచ్చటించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2014309) సందర్శకుల సూచీ సంఖ్య : : 140
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Punjabi , Tamil