ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మహా శివరాత్రి సందర్భం లో ప్రజల కు శుభాకాంక్షల నుతెలియజేసిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 08 MAR 2024 8:58AM by PIB Hyderabad

మహా శివరాత్రి సందర్భం లో ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను తెలియ జేశారు. ఈ మహా పర్వదినం ప్రతి ఒక్కరి జీవనం లో క్రొత్త శక్తి ని ప్రసరింప చేయాలని, అలాగే అమృత కాలం లో దేశం యొక్క సంకల్పాల కు ఒక క్రొత్త బలాన్ని కూడా ప్రసాదించాలని శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్షించారు.

 

ఎక్స్ మాధ్యం లో ప్రధాన మంత్రి ఒక సందేశాన్ని నమోదు చేస్తూ, సందేశం లో -

‘‘దేశం లోని నా యొక్క కుటుంబ సభ్యులు అందరికీ మహా శివరాత్రి యొక్క హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఈ మహా పర్వదినం ప్రతి ఒక్కరి జీవనం లో క్రొత్త శక్తి ని ప్రసరింప చేయడం తో పాటుగా అమృత కాలం లో దేశం యొక్క సంకల్పాల కు కూడా క్రొత్త శక్తి ని అందించాలి అని నేను కోరుకుంటున్నాను. జయ్ భోలేనాథ్.’’’ అని పేర్కొన్నారు.

 

 

***

DS/ST


(रिलीज़ आईडी: 2012656) आगंतुक पटल : 122
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Malayalam