సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించనున్న కేంద్ర పరిపాలన సంస్కరణలు & ప్రజా ఫిర్యాదుల విభాగం


08.03.2024న "సివిల్ సర్వీసుల్లో మహిళలు" వెబ్‌నార్ నిర్వహణ

ప్రసంగించనున్న క్రీడల విభాగం కార్యదర్శి, ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ కార్యదర్శి, వినియోగదారు వ్యవహారాల విభాగం ఓఎస్‌డీ

Posted On: 07 MAR 2024 12:16PM by PIB Hyderabad

మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా సాధించిన విజయాలను గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం మార్చి 08న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుతున్నారు. మహిళా సాధికారత, లింగ సమానత్వాన్ని సాధించే క్రమంలో ఎదురయ్యే వివిధ సమస్యలపై చర్చించే అవకాశాన్ని ఆ రోజు అందిస్తుంది.

కేంద్ర పరిపాలన సంస్కరణలు & ప్రజా ఫిర్యాదుల విభాగం అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా, 08 మార్చి 2024న మధ్యాహ్నం 3 గంటలకు, "సివిల్ సర్వీసుల్లో మహిళలు" అనే అంశంపై వర్చువల్ వెబ్‌నార్‌ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు, రాష్ట్ర ఏఆర్‌ విభాగాల అధికార్లు, జిల్లా కలెక్టర్లు హాజరవుతారు.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0017NET.jpg

కేంద్ర క్రీడల విభాగం కార్యదర్శి శ్రీమతి సుజాత చతుర్వేది, ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీమతి అనిత ప్రవీణ్, వినియోగదారు వ్యవహారాల విభాగం ప్రత్యేక అధికారి శ్రీమతి నిధి ఖరే వెబ్‌నార్‌లో ప్రధాన వక్తలుగా పాల్గొంటారు.

 <><><>



(Release ID: 2012250) Visitor Counter : 53