ప్రధాన మంత్రి కార్యాలయం
పశ్చిమ బంగాల్ లోని కోల్‌కాతా లో 15,400 కోట్ల రూపాయల విలువైన అనేక కనెక్టివిటీ ప్రాజెక్టుల ను ప్రారంభించడం తో పాటు శంకుస్థాపన చేసిన ప్రధాన మంత్రి
భారతదేశం లోనే నీటిఅడుగు భాగం లో నిర్మితమైన ఒకటో మెట్రో రూట్ అయినటువంటి కోల్ కాతా లోని ఎస్‌ప్లేనేడ్-హావ్‌డామైదాన్ మెట్రో రూట్ లో ప్రయాణించిన ప్రధాన మంత్రి
మన దేశం లో ఏదైనా ఒక ప్రధాన నది జలాల అడుగు భాగం లోనిర్మితమైన మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో సొరంగ మార్గాన్ని హావ్‌డా మైదాన్-ఎస్‌ప్లేనేడ్మెట్రో సెక్శను కలిగివుండడం అనేది గర్వించదగ్గ సన్నివేశం గా ఉంది: ప్రధాన మంత్రి
Posted On:
06 MAR 2024 1:29PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కోల్‌కాతా లో అనేక కనెక్టివిటీ ప్రాజెక్టుల ను ఈ రోజు న ప్రారంభించడం తో పాటు శంకుస్థాపన కూడా జరిపారు. ఈ ప్రాజెక్టు ల విలువ 15,400 కోట్ల రూపాయలు ఉంది. పట్టణ ప్రాంతాల లో మొబిలిటీ సెక్టర్ లో చేపట్టిన ఈ అభివృద్ధి ప్రధాన ప్రాజెక్టు లు మెట్రో రైల్ మరియు రీజనల్ రేపిడ్ ట్రాన్‌జిట్ సిస్టమ్ (ఆర్ఆర్‌టిఎస్) లకు చెందినవి.
ప్రధాన మంత్రి మెట్రో ప్రాజెక్టు లు అన్నింటిని సింహావలోకం చేశారు; అంతేకాకుండా, కోల్‌కాతా లో భారతదేశం లో కెల్లా మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో అయినటువంటి ఎస్‌ప్లేనేడ్ - హావ్‌డా మైదాన్ మెట్రో మార్గం లో ఒక మెట్రో రైలు లో ఆయన ప్రయాణించారు కూడాను. ఆయన తన మెట్రో రైలు ప్రయాణం సందర్భం లో శ్రమికుల తో మరియు బడిపిల్లల తో సైతం మాట్లాడారు.
ఎక్స్ మాధ్యం లో కొన్ని సందేశాల ను ప్రధాన మంత్రి నమోదు చేస్తూ, ఆ యా సందేశాల లో -
‘‘ఈ ప్రాజెక్టు లో పని చేసిన వారి తోను మరియు యువజనుల తోను కలసి చేసిన మెట్రో యాత్ర పుణ్యమాని ఈ అనుభూతి స్మరణీయమైంది గా మిగిలిపోయింది. మేం హుగ్ లీ నది అడుగు న గల సొరంగ మార్గం గుండా కూడాను పయనించాం.’’
‘‘కోల్ కాతా నగరం లో మెట్రో నెట్ వర్క్ గణనీయం గా వృద్ధి చెందిన కారణం గా ఈ రోజు న కోల్‌కాతా ప్రజల కు అత్యంత విశిష్టమైనటువంటి రోజు అవుతుంది. సంధానాని కి దన్ను లభించనుంది, మరి రాకపోకల లో రద్దీ ఇక మీదట తగ్గుతుంది. మన దేశం లో ఏదైనా ఒక ప్రధాన నది అడుగు భాగాన అండర్ వాటర్ మెట్రో ట్రాన్స్ పోర్టేశన్ టనల్ ను కలిగివున్నటువంటి మొట్టమొదటి మార్గం గా హావ్‌డా మైదాన్ -ఎస్‌ప్లేనేడ్ మెట్రో సెక్శన్ గుర్తింపు ను తెచ్చుకోవడం ఒక గర్వించదగినటువంటి క్షణం అని చెప్పాలి.’’
‘‘కోల్‌కాతా మెట్రో ద్వారా కొన్ని స్మరణీయమైనటువంటి క్షణాలు ఆవిష్కృతం అయ్యాయి. జనశక్తి కి నేను ప్రణామాన్ని ఆచరించడం తో పాటు గా వారికి రెట్టించిన ఉత్సాహం తో సేవల ను అందిస్తూనే ఉంటాను.’’ అని పేర్కొన్నారు.
పశ్చిమ బంగాల్ రాష్ట్ర గవర్నరు శ్రీ సి.వి. ఆనంద బోస్ మరియు ఇతరులు ఈ సందర్భం లో హాజరయ్యారు.
పూర్వరంగం
పట్టణ ప్రాంతం లో రాకపోకల ను సులభతరం చేయడం కోసం క్రొత్త మార్ల ను పెంచడం పట్ల శ్రద్ధ తీసుకోవడానికై ప్రధాన మంత్రి కోల్ కాతా మెట్రో లో హావ్ డా మైదానం-ఎస్ ప్లేనేడ్ సెక్శను, కవి సుభాష్-హేమంత్ ముఖోపాధ్యాయ్ మెట్రో సెక్శను, తారాతలా-మాజెరహాట్ మెట్రో సెక్శను (జోకా-ఎస్ ప్లేనేడ్ మార్గంలో ఓ భాగం), రూబీ హాల్ క్లినిక్ నుండి రామ్ వాడీ సెక్శను వరకు పుణె మెట్రో, ఎస్ఎన్ జంక్శన్ మెట్రో స్టేశన్ నుండి త్రిపునిథుర మెట్రో స్టేశన్ వరకు కోచి మెట్రో రైల్ ఒకటో దశ విస్తరణ ప్రాజెక్టు (ఐబి దశ), తాజ్ ఈస్ట్ గేట్ నుండి మనకామేశ్వర్ వరకు ఆగ్ రా మెట్రో యొక్క విస్తరణ, దిల్లీ-మేరఠ్ ఆర్ఆర్ టిఎస్ కారిడర్ లోని దుహాయి-మోదీనగర్ (ఉత్తర) సెక్శను లను ప్రారంభించారు. ఈ సెక్శనుల లో రైలు సర్వీసుల కు ఆయన ప్రాపరంభ సూచక ఆకుపచ్చటి జెండా ను చూపెట్టారు. పింప్ రీ చించ్ వడ్ మెట్రో-నిగ్ డీ మధ్య పుణె మెట్రో రైల్ ప్రాజెక్టు ఒకటోదశ విస్తరణ పనులకు కూడాను ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు.
రహదారి మార్గం లో రాకపోకల పరం గా రద్దీ ని తగ్గించడం లో , అంతరాయం లేనటువంటి, సులభం మరియు సౌకర్యవంతం అయినటువంటి కనెక్టివిటీ ని అందించడం లో ఈ విభాగాలు సహాయపడతాయి. కోల్ కాతా మెట్రో లో హావ్ డా మైదానం-ఎస్ ప్లేనేడ్ సెక్శను భారతదేశంలో ఏదైనా ఒక శక్తిశాలి నది క్రింది ప్రప్రథమ రవాణా సొరంగ మార్గం గా రూపు ను దిద్దుకొన్నది కావడం విశేషం. హావ్ డా మెట్రో స్టేశను భారతదేశంలో అన్నింటి కంటే లోతైనటువంటి మెట్రో స్టేశను అని చెప్పాలి. దీనికి అదనం గా, ఈ రోజు న ప్రారంభం అయినటువంటి తారాతలా - మాజెర్ హాట్ మెట్రో సెక్శను లో మాజెర్ హాట్ మెట్రో స్టేశన్ రైల్ వే లైనులు , ప్లాట్ ఫార్మ్ లు మరియు కాలువ ను ఆనుకొని ఉన్న ఒక అద్వితీయమైనటువంటి ఎత్తయిన మెట్రో స్టేశన్ గా ఉంది. ఈ రోజు న ప్రారంభించినటువంటి ఆగ్ రా మెట్రో లో ని సెక్శను చరిత్రాత్మక పర్యటన ప్రాంతాల కు కనెక్టివిటీ ని పెంచనుంది. ఆర్ఆర్ టిఎస్ సెక్శను ఎన్సీఆర్ లో ఆర్థిక కార్యకలాపాల కు ప్రోత్సాహాన్ని అందించగలదు.
*****
DS/TS
(Release ID: 2011978)
Visitor Counter : 127
Read this release in:
Khasi
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam