యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
"మేరా పెహలా ఓట్ దేశ్ కే లియే" ప్రచారంలో పాల్గొనాలని పిలుపునిచ్చిన శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్
Posted On:
27 FEB 2024 2:55PM by PIB Hyderabad
దేశంలోని ప్రతి ఒక్కరు "మేరా పెహలా ఓట్ దేశ్ కే లియే" ప్రచారంలో పాల్గొనాలని, ఓటు హక్కు వినియోగించుకునేలా యువ ఓటర్లను ప్రోత్సహించాలని కేంద్ర సమాచార & ప్రసార, యువజన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ ఈ రోజు పిలుపునిచ్చారు.
ఎక్స్‌లో సందేశం ఉంచిన శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్, "మేరా పెహ్లా ఓట్ దేశ్ కే లియే" గీతాన్ని ప్రజలతో పంచుకున్నారు.
ఎక్స్ ఖాతాలో ఇలా చెప్పారు:
"గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోదీ ఇటీవలి మన్ కీ బాత్ ప్రసంగంలో ఒక స్పష్టమైన పిలుపు ఇచ్చారు. అతి పెద్ద ప్రజాస్వామ్య పండుగ కోసం దేశం సన్నద్ధమవుతున్న నేపథ్యంలో, అందరూ #MeraPehlaVoteDeshKeLiye ప్రచారంలో చేరాలని, ఓటు హక్కు వినియోగించుకునేలా యువ ఓటర్లు ప్రోత్సహించాలని కోరారు.
ఇప్పుడు #MeraPehlaVoteDeshKeLiye గీతాన్ని వినండి, ప్రతి ఒక్కరితో పంచుకోండి.
మనకు నచ్చిన మార్గంలో, శైలిలో ఈ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్దాం.
ఈ బాధ్యతను స్వీకరిద్దాం, ఆన్‌లైన్‌లో & కళాశాలల్లో మన సామూహిక స్వరాల శక్తిని వినిపిద్దాం"
***
(Release ID: 2009945)
Visitor Counter : 91