ప్రధాన మంత్రి కార్యాలయం
గుజరాత్‌లోని ఓఖా ప్రధాన భూభాగాన్ని బేట్ ద్వారక ద్వీపంతో కలిపే ‘సుదర్శన్ సేతు’కు ప్రధాని ప్రారంభోత్సవం
Posted On:
25 FEB 2024 11:16AM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఓఖా ప్రధాన భూభాగాన్ని బేట్ ద్వారక ద్వీపంతో కలిపే సుదర్శన్ సేతును ప్రారంభించారు. దాదాపు 2.32 కిలోమీటర్ల ఈ తీగల వంతెన దేశంలోనే అతి పొడవైనది కాగా, దీన్ని రూ.980 కోట్ల వ్యయంతో నిర్మించారు.
దీనిపై ప్రధానమంత్రి ‘ఎక్స్’ ద్వారా పంపిన ఒక సందేశంలో:
‘‘సుదర్శన్ సేతు ఓఖా ప్రధాన భూభాగాన్ని బేట్ ద్వారక ద్వీపంతో కలుపుతుంది. దాదాపు 2.32 కిలోమీటర్ల ఈ తీగల వంతెన దేశంలో అత్యంత పొడవైనది కాగా, దీన్ని రూ.980 కోట్లతో నిర్మించారు.’’
‘‘సుదర్శన్ సేతు ఒక అద్భుతం’’ అని పేర్కొన్నారు.
నేపథ్యం
సుదర్శన్ సేతు విశిష్ట రీతిలో రూపకల్పన చేయబడింది. ఈ వంతెన పొడవునా పాదచారులు సాగే మార్గంలో శ్రీమద్భగవద్గీతలోని శ్లోకాలతో, రెండు వైపులా శ్రీకృష్ణ భగవానుని చిత్రాలతో అలంకరించబడింది. పాదచారుల మార్గం ఎగువ భాగాల్లో ఒక మెగావాట్ విద్యుదుత్పాదక సామర్థ్యంగల సౌరఫలకాలను ఏర్పాటు చేశారు. ఈ వంతెనతో రవాణా సౌలభ్యం ఇనుమడించడమే కాకుండా ద్వారక-బేట్ ద్వారకల మధ్య భక్తుల ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఈ వంతెన నిర్మాణానికి ముందు యాత్రికులు బేట్ ద్వారక వెళ్లడానికి పడవలమీద ఆధారపడేవారు. ఇప్పుడీ వంతెన విశిష్టమైనది మాత్రమేగాక దేవభూమి ద్వారకలో ఇదొక ప్రధాన పర్యాటక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ వంతెన ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రితో పాటు గుజరాత్ గవర్నర్ శ్రీ ఆచార్య దేవవ్రత్, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్, ఎంపీ శ్రీ సి.ఆర్.పాటిల్ తదితరులు పాల్గొన్నారు.
*****
DS/TS
(Release ID: 2009010)
Visitor Counter : 158
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam