ప్రధాన మంత్రి కార్యాలయం

ఫిబ్రవరి 24,25 తేదీలలో గుజరాత్ లో పర్యటించనున్న ప్రధానమంత్రి


–సుమారు 52,250 కోట్ల రూపాయల విలువగల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితం చేయనున్న ప్రధానమంత్రి.


–ఈ ప్రాజెక్టులలో ఆరోగ్యం, రోడ్లు, రైలుమార్గాలు, ఇంధనం, పెట్రోలియం, సహజవాయువు, పర్యాటక రంగం వంటివి ఉన్నాయి.


–ఓఖా ప్రధానభూభాగం నుంచి ద్వారక ద్వీపాన్ని కలుపుతూ సుదర్శన్ సేతును ప్రధానమంత్రి జాతికి అంకితం చేయనున్నారు.

ఇది భారతదేశంలో అతి పొడవైన కేబుల్ ఆధారిత బ్రిడ్జి
రాజ్కోట్, భటిండా, రాయ్బరేలి, కల్యాణి, మంగళగిరిలలో మొత్తం 5 ఎయిమ్స్లను ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు.

–200 ఆరోగ్య పరిరక్షణ మౌలికసదుపాయా ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేయనున్న ప్రధానమంత్రి.


–ఇఎస్ఐసికి సంబంధించి 21 ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్న ప్రధానమంత్రి.

–కొత్త ముంద్రా–పానిపట్ పైప్లైన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్న ప్రధానమంత్రి

Posted On: 24 FEB 2024 10:45AM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 ఫిబ్రవరి 24,25 తేదీలలో గుజరాత్ సందర్శించనున్నారు. 25 వ తేదీ ఉదయం 7.45 గంటలకు ప్రధానమంత్రి ద్వారక ద్వీప ఆలయంలో పూజలు నిర్వహించి దర్శనం చేసుకుంటారు. అనంతరం ప్రధానమంత్రి ఉదయం 8.25 గంటలకు సుదర్శన సేతు ను సందర్శిస్తారు. అక్కడినుంచి  ఉదయం 9.30 గంటలకు ప్రధానమంత్రి ద్వారకాధీశ్ ఆలయాన్ని సందర్శిస్తారు..

మధ్యాహ్నం 1 గంటలకు ప్రధానమంత్రి సుమారు 4,150 కోట్ల రూపాయల విలువగల పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలుప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితం చేస్తారు.

అనంతరం సాయంత్రం 3.30 గంటలకు ప్రధానమంత్రి రాజ్కోట్ ఎయిమ్స్ సందర్శిస్తారు . సాయంత్రం 4.30 గంటలకు ప్రధానమంత్రిరాజ్ కోట్ లోని రేస్కోర్స్ గ్రౌండ్ నుంచి సుమారు 48,100 కోట్ల రూపాయల విలువగల పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలుప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితం చేస్తారు.

 

ద్వారకలో ప్రధానమంత్రి:

ద్వారకలో జరిగే బహిరంగ సభలో ప్రధానమంత్రి ఓఖా ప్రధాన భూభాగం నుంచి ద్వారక ద్వీపాన్ని కలిపే సుదర్శన సేతును జాతికి అంకితం చేస్తారు. దీనిని 980 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు. 2.32 కిలోమీటర్ల పొడవున నిర్మించిన దేశంలోనే అతి పొడవైన కేబుల్ ఆధారిత బ్రిడ్జి.

 

సుదర్శన్ సేతు లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ బ్రిడ్జి ఫుట్పాత్లో శ్రీమద్ భగవద్గీత నుంచి శ్లోకాలుభగవాన్ శ్రీ కృష్ణుడి చిత్రాలు బ్రిడ్జికి ఇరువైపులా చిత్రించారు. బ్రిడ్జి ఫుట్పాత్పై రూఫ్టాప్ సోలార్ ప్యానళ్లు అమర్చారు. దీనిద్వారా ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ద్వారక నుంచి ద్వారక ద్వీపానికి వెళ్లడానికి ఈ బ్రడ్జివల్ల సమయం ఎంతో ఆదా అవుతుంది. బ్రిడ్జి నిర్మించక ముందు యాత్రికులు ద్వారక ద్వీపానికి వెళ్లాలంటే పడవలపై ఆధారపడాల్సి వచ్చేది. ఈ బ్రిడ్జి దేవభూమి ద్వారకకు ఒక పర్యాటక ఆకర్షణగా నిలవనుంది. ప్రధానమంత్రి వడినార్లో పైప్లైన్ ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న ఆఫ్షోర్ లైన్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తారు. ప్రస్తుత పైప్లైన్ ఎండ్ మానిఫోల్డ్ (పి.ఎల్..ఇ.ఎం)ను తొలగించిమొత్తం వ్యవస్థను పునర్ నిర్మించి (పైప్లైన్లు,పిఎల్ఇఎంలుఅనుసంధానిత లూప్ లైన్) సమీప ప్రాంతానికి మారుస్తారు. ప్రధానమంత్రి రాజ్ కోట్ –ఓఖారాజ్ కోట్ –జెతల్సార్–సోమనాథ్జెతల్సార్– వన్సజలియా రైల్వేలైన్ విద్యుదీకరణ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తారు.

ప్రదానమంత్రి ధొరాజి– జామ్కన్ దోమా– కలావద్ సెక్షన్(ఎన్హెచ్ –927 డి) రోడ్డు వెడల్పు పనులకుజామ్నగర్లో రీజనల్ సైన్స్ సెంటర్ పనులకుజామ్నగర్లోని సిక్కా థర్మల్ పవర్ స్టేషన్లో ఫ్లూ గ్యాస్ డీ సల్ఫరైజేషన్(ఎఫ్.జి.డి) ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు.

రాజ్కోట్లో ప్రధానమంత్రి :

 

రాజ్కోట్లో జరిగే బహిరంగసభలో ప్రధనామంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలుప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితం చేయనున్నారు. వీటి విలువ సుమారు 48,100 కోట్ల రూపాయల వరకు ఉండనుంది. ఇందులో ఆరోగ్యంరోడ్లురైలుమార్గాలుఇంధనం,పెట్రోలియంసహజవాయువుపర్యాటక తదితర రంగాలకు సంబంధంచిన ప్రాజెక్టులు ఉన్నాయి. దేశంలో ఆరోగ్య సదుపాయాలను మెరుగుపరిచే చర్యలలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎఐఐఎంఎస్) లను జాతికి అంకితం చేయనున్నారు. అవి రాజ్కోట్ (గుజరాత్)భటిండా (పంజాబ్)రాయ్బరేలి(ఉత్తరప్రదేశ్)కల్యాణి(పశ్చిమబెంగాల్),మంగళగిరి (ఆంధ్రప్రదేశ్) ఎయిమ్స్ ప్రధానమంత్రి  జాతికి అంకితం చేసే వాటిలో ఉన్నాయి.

దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాలుకేంద్ర పాలిత ప్రాంతాలలో ఆరోగ్య మౌలిక సదుపాయాలను మెరుగు పరిచే 200 ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. వీటి విలువ సుమారు ,11,500 కోట్ల రూపాయలు ఉంటుంది.

 

 పుదుచ్చేరిలోని కారైకల్లో జిప్మెర్ మెడికల్ కాలేజీని ,పంజాబ్లోని సంగ్రూర్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ఆఫ్ మెడికల్ సైన్సెస్ఎడ్యుకేషనల్ రిసెర్చ్ (పిజిఐఎంఇఆర్) ఉప కేంద్రాన్ని ,300 పడకల ఆస్పత్రిని ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు. పుదుచ్చేరి లోని యానాంలో 90 పడకల మల్టీ స్పెషాలిటీ కన్సల్టింగ్ యూనిట్ను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. చెన్నైలో నేషనల్ సెంటర్ ఫర్ ఏజింగ్బీహార్లోని పూర్నియాలో ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజి,  కేరళలోని అళప్పుజలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ కేరళ విభాగాన్నితమిళనాడులోని తిరువళ్లుర్లో  ఏర్పాటైననేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్యూబర్కులోసిస్ (ఎన్ ఐఆర్టి),న్యూ కాంపోజిట్ టిబి రిసెర్చి ఫెసిలిటిని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. అలాగే ప్రధానమంత్రి పలు ఆరోగ్య ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. వీటిలో పంజాబ్లోని ఫిరోజ్పూర్లో పిజిఐఎంఇఆర్ కు చెందిన 100 పడకల ఉప కేంద్రంఢిల్లీలో ఆర్ఎంఎల్ ఆస్పత్రి లో కొత్త మెడికల్ కాలేజీ భవనంఇంఫాల్ ఆర్ఐఎంఎస్లో క్రిటికల్ కేర్ బ్లాక్ఝార్ఖండ్లోని కొడెర్మధుంకాలలో నర్సింగ్ కాలేజీలకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నారు.

 

వీటికి తోడు‌‌‌జాతీయ ఆరోగ్య మిషన్ కింద, ప్రధానమంత్రి – ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్ (పిఎం–ఎబిహెచ్ఐఎం)., ప్రధానమంత్రి 115 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితం చేస్తారు. ఇందులో 78 ప్రాజెక్టులు పిఎం–ఎబిహెచ్ఐఎం కి చెందినవి ఉన్నాయి.(50 యూనిట్లు క్రిటికల్ కేర్ బ్లాక్లు, 15 యూనిట్లు సమీకృత ప్రజారోగ్య ల్యాబ్లు, 13 యూనిట్లు బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్లు)  30 యూనిట్ల వివిధ ప్రాజెక్టులకు సంబంధించినవి అంటే కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్, మోడల్ ఆస్పత్రి, ట్రాన్సిట్ హాస్టల్ వంటివి జాతీయ ఆరోగ్య మిషన్ కిందవి , అలాగే మరికొన్ని ఉన్నాయి.

 

 

ప్రధానమంత్రి ఈ సందర్భంగా పుణెలో  నిసర్గ గ్రామ్ పేరుతో నెలకొల్పిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేచురోపతి ని కూడా ప్రారంభిస్తారు. ఇందులో నేచురోపతి మెడికల్ కాలేజి ,250 పడకల ఆస్ప్రతి,మల్టీ డిసిప్లినరీ రిసెర్చ్, ఎక్స్టెన్షన్సెంటర్ ఉన్నాయి. దీనికితోడు, హర్యానాలోని ఝజ్జర్ లో ఏర్పాటుచేసిన  సెంట్రల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగ, నాచురోపతిని కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఇందులో అత్యున్నత స్థాయి యోగా,  నాచురోపతి పరిశోధన సదుపాయాలు ఉంటాయి. ఈ పర్యటనలో ప్రధానమంత్రి ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఇఇఎస్ఐసి)కి చెందిన 21ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. వీటి విలువ సుమారు రూ 2,280 కోట్ల రూపాయలు. ప్రధానమంత్రి జాతికి అంకితం చేసే ఈ ప్రాజెక్టులలో  బీహార్లోని పాట్నా, రాజస్థాన్ ఆల్వార్ లలో2 మెడిక్ కాలేజీలు, ఆస్పత్రులు, ఛత్తీస్ఘడ్లోని కోర్బా, రాజస్థాన్లోని ఉదయపూర్, జార్ఖండ్లోని ఆదిత్యపూర్,బీహార్ లోని ఫుల్వారీ షరీఫ్,తమిళనాడులోని తిరుప్పూర్, ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ, ఛత్తీస్ఘడ్లోని రాయ్ఘడ్,భిలాయ్ లలో మొత్తం 8 ఆస్పత్రులు, రాజస్థాన్లోని అబూరోడ్, భిల్వారాల, నీమ్రాణాలలో మూడు ఇ.ఎస్.ఐ డిస్పెన్సరీలు, రాజస్థాన్లోని ఆల్వార్, బెహ్రార్, సితాపురలలో, ఉత్తరాఖండ్లోని సెలాఖ్విలో , ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో, కేరళలోని కొరాట్టి, నవైకులమ్, ఆంధ్రప్రదేశ్లోని పైడి భీమవరంలలో 8 ఇ.ఎస్ఐ డిస్పెన్సరీలు ప్రారంభించనున్నారు. 

ఈ ప్రాంతంలో పునరుత్పాదక ఇంధన ఉత్పత్తికి మరింత ఊతం ఇచ్చేందుకు ప్రధానమంత్రి వివిధ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు.ఇందులో 300 మెగా వాట్ల భుజ్ –2 సోలార్ పవర్ ప్రాజెక్టుగ్రిడ్ అనుసంధానిత 600 మెగా వాట్ల  సోలార్ పివి పవర్ ప్రాజెక్టు, ఖవడా సోలార్ పవర్ ప్రాజెక్టు , 200 మెగావాట్ల దయాపూర్ 2 పవన విద్యుత్ ప్రాజెక్టు వంటివి ఉన్నాయి. ప్రధానమంత్రి కొత్త ముద్రా– పానిపట్ పైప్లైన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు విలువ 9,000 కోట్ల రూపాయలు. 1194 కిలోమీటర్ల పొడవుగల ముద్రా– పానిపట్ పైప్లైన్ స్థాపిత సామర్ద్యం 8.4 ఎంఎంటిపిఎ. దీనిని గుజరాత్ తీరంలోని ముంద్రా తీరం నుంచి హర్యానాలోని పానిపట్ లోగల ఇండియన్ ఆయిల్ రిఫైనరీ వరకు ముడిచమురును ఎగుమతి చేసేందుకు పైప్లైన్ను నిర్మించనున్నారు.

 

ఈ ప్రాంతంలో రోడ్డురైలు మార్గాలను మరింత బలోపేతం చేసేందుకు ప్రధానమంత్రి, సురేంద్రనగర్– రాజ్కోట్ రైల్వేలైన్ డబ్లింగ్ను జాతికి అంకితం చేస్తారు, అలాగే పాత ఎన్హెచ్–8 ఇ కింద గల భావ్నగర్–తలాజ(ప్యాకేజ్–1),  ఎన్.హెచ్ 751 కింద పిప్లి–భావనగర్ (ప్యాకేజ్–1) నాలుగు లైన్ల రహదారి ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తారు.సఖియాలి నుంచి సంతాల్పూర్ (ఎన్.హెచ్ 27 )సెక్షన్లో ఆరులైన్ల రహదారికి ,ఇతర పనులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు.



(Release ID: 2008939) Visitor Counter : 66