ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జైన ముని ఆచార్యశ్రీ 108 విద్యాసాగర్ జీ మహారాజ్ సమాధి స్థితి ని పొందడం పట్ల తీవ్ర దుఃఖాన్నివ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

Posted On: 18 FEB 2024 10:58AM by PIB Hyderabad

జైన ముని ఆచార్య శ్రీ 108 విద్యాసాగర్ జీ మహారాజ్ సమాధి స్థితి ని పొందినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ దుఃఖాన్ని వ్యక్తం చేశారు.

 

 

ఆచార్య శ్రీ 108 విద్యాసాగర్ జీ మహారాజ్ యొక్క నిష్క్రమణ దేశాని కి తీరని నష్టం అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

ప్రజల లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని తీసుకు రావడం కోసం ఆచార్య గారు ఒడిగట్టిన బహుమూల్యమైన ప్రయాసల ను ఎప్పటికీ స్మరించుకోవడం జరుగుతుంది అని ప్రధాన మంత్రి అన్నారు. వారు జీవన పర్యంతం పేదరికాన్ని నిర్మూలించడం తో పాటు గా సమాజం లో విద్య వ్యాప్తి కి మరియు ఆరోగ్యం పట్ల శ్రద్ధ ను పెంపొందింప చేయడం లో నిమగ్నం అయ్యారు అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

 

 

క్రిందటి సంవత్సరం లో ఛత్తీస్‌గడ్ లోని చంద్రగిరి జైన మందిరం లో ఆచార్య శ్రీ 108 విద్యాసాగర్ జీ మహారాజ్ తో తాను జరిపిన సమావేశాన్ని కూడా ప్రధాన మంత్రి గుర్తు కు తెచ్చుకొని ఆ సమావేశం తనకు మరపురానిది గా ఉండిపోతుంది అన్నారు.

 

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక సందేశాన్ని నమోదు చేస్తూ, ఆ సందేశం లో -

ఆచార్య శ్రీ 108 విద్యాసాగర్ జీ మహారాజ్ గారు పరంబ్రహ్మ లో లీనం కావడం దేశాని కి ఒక భర్తీ చేయలేనటువంటి నష్టాన్ని మిగిల్చింది. ప్రజల లో ఆధ్యాత్మిక జాగృతి ని తీసుకు రావడం కోసం ఆయన ఒడిగట్టినటువంటి బహుమూల్యమైన ప్రయాసల ను సదా స్మరించుకోవడం జరుగుతుంది. వారు జీవన పర్యంతం పేదరిక నిర్మూలన తో పాటు సమాజం లో ఆరోగ్యం మరియు విద్య లను ప్రోత్సహించడం లో నిమగ్నం అయ్యారు. వారి యొక్క ఆశీస్సు లు నిరంతరం లభిస్తూ ఉండడం అనేది నేను చేసుకొన్న అదృష్టం. క్రిందటి సంవత్సరం లో ఛత్తీస్‌గఢ్ లోని చంద్రగిరి జైన మందిరం లో వారితో జరిపిన భేటీ ని నేను ఎన్నటికీ మరచిపోలేను. ఆ సందర్భం లో ఆచార్య జీ వద్ద నుండి నాకు బోలెడంత స్నేహం మరియు దీవెన లు లభించాయి. సమాజాని కి ఆయన అందించిన సాటి లేనటువంటి తోడ్పాటు దేశం లో ప్రతి ఒక్క తరాని కి ప్రేరణ ను అందిస్తూనే ఉంటుంది.’’ అని పేర్కొన్నారు.

 

 

‘‘ఆచార్య శ్రీ 108 విద్యాసాగర్ జీ మహారాజ్ గారి అసంఖ్య భక్త జనుల కు కలిగిన శోకం లో నేను కూడా పాలుపంచుకొంటున్నాను; మరి, ఆచార్య గారి ఆత్మశాంతి కోసం నేను సైతం ప్రార్థిస్తున్నాను. సమాజాని కి ఆచార్య గారు అందించిన అమూల్యమైనటువంటి తోడ్పాటు ను, విశేషించి ప్రజల లో ఆధ్యాత్మిక జాగృతి ని తీసుకు వచ్చే దిశ లో ఆయన చేసిన ప్రయాస లు, పేదరికం నిర్మూలన, ఆరోగ్య సంరక్షణ, విద్య వ్యాప్తి ల కోసం అనేక విధాలు గా ఆయన పాటుపడినందువల్ల ఆయన ను రాబోయే తరాలు సదా స్మరించుకొంటాయి.’’

 

 

‘‘ఆయన ఆశీర్వాదాలు నాకు నిరంతరం లభిస్తూ ఉండడం నాకు దక్కినటువంటి సౌభాగ్యం. క్రిందటి సంవత్సరం లో ఛత్తీస్‌గఢ్ లోని డోంగ్‌రగఢ్ లో చంద్రగిరి జైన మందిరాన్ని సందర్శించడాన్ని నేను ఎన్నటికీ మరువలేను. ఆ వేళ లో, ఆచార్య శ్రీ 108 విద్యాసాగర్ జీ మహారాజ్ గారి సన్నిధి లో నేను కొంత సేపు ఉన్నాను, ఆయన ఆశీస్సుల ను కూడా అందుకొన్నాను.’’ అని పేర్కొన్నారు.

 

 

 


(Release ID: 2007068) Visitor Counter : 117