ప్రధాన మంత్రి కార్యాలయం

కతర్ యొక్క అమీరు గారి తో సమావేశమైన ప్రధాన మంత్రి

Posted On: 15 FEB 2024 5:59PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కతర్ యొక్క అమీరు గారు శ్రీ శేఖ్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ తో దోహా లోని రాజ భవనం లో ఈ రోజు న సమావేశమయ్యారు.

 

ప్రధాన మంత్రి రాజభవనాని కి చేరుకోవడం తోనే ఆయన గౌరవార్థం సంప్రదాయబద్ధ స్వాగత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ముగిసిన తరువాత ఇరు పక్షాలు ప్రతినిధి వర్గ స్థాయి చర్చల లోను మరియు పరిమిత చర్చల లో పాలుపంచుకొన్నారు. ఈ క్రమం లో ఆర్థిక సహకారం, పెట్టుబడులు, శక్తి సంబంధి భాగస్వామ్యం, అంతరిక్ష రంగం లో సహకారం, పట్టణ ప్రాంతాల లో మౌలిక సదుపాయాల కల్పన, సాంస్కృతిక బంధాలు మరియు ఇరు దేశాల ప్రజల మధ్య పారస్పరిక సంబంధాలు సహా అనేక విషయాల పై చర్చ లు జరిగాయి. ఇద్దరు నేతలు ప్రాంతీయ అంశాల పైన మరియు ప్రపంచ అంశాల పైన వారి వారి అభిప్రాయాల ను ఒకరి కి మరొకరు తెలియ జెప్పుకొన్నారు.

 

కతర్ లో 8 లక్షల మంది కి పైగా ఉంటున్న భారతీయ సముదాయం పట్ల శ్రద్ధ తీసుకొంటున్నందుకు గాను అమీరు గారి కి ప్రధాన మంత్రి ధన్యవాదాల ను తెలియ జేశారు. కతర్ తో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత గా విస్తరించడం పట్ల మరియు దానిని పటుతరం గా మలచుకోవడం పట్ల భారతదేశం యొక్క నిబద్ధత ను ప్రధాన మంత్రి తెలియ జేశారు. అమీరు గారి కి వీలైనంత త్వరలో భారతదేశం సందర్శన కు తరలి రావలసింది గా ప్రధాన మంత్రి ఆహ్వానించారు.

 

ప్రధాన మంత్రి వ్యక్తం చేసిన భావన ల పట్ల మరియు గల్ఫ్ ప్రాంతం లో ఒక విలువైన భాగస్వామ్య దేశం గా భారతదేశం పోషిస్తున్నటువంటి పాత్ర పట్ల అమీరు గారు ప్రశంస ను వ్యక్తం చేశారు. కతర్ యొక్క అభివృద్ధి లో చైతన్యవంతులైన భారతీయ సముదాయం అందిస్తున్నటువంటి తోడ్పాటు కు గాను మరియు కతర్ లో నిర్వహించేటటువంటి వివిధ అంతర్జాతీయ కార్యక్రమాల లో భారత సముదాయం ఉత్సాహభరితం గా పాలుపంచుకొంటున్నందుకు గాను అమీరు గారు ప్రశంసల ను కురిపించారు.

 

ఈ సమావేశం ముగిసిన అనంతరం ప్రధాన మంత్రి గౌరవార్థం రాజభవనం లో మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.

 

 

***



(Release ID: 2006521) Visitor Counter : 70