మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
ఈశాన్య రాష్ట్రాల పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం
- కార్యదర్శి శ్రీమతి అల్కా ఉపాధ్యాయ అధ్యక్షతన అదనపు ముఖ్య కార్యదర్శి/ ప్రిన్సిపల్ సెక్రటరీ/ సెక్రటరీ/ డైరెక్టర్లు మరియు స్కీమ్ ఆఫీసర్ల సమావేశం
Posted On:
14 FEB 2024 5:07PM by PIB Hyderabad
ఈశాన్య రాష్ట్రాల పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమల శాఖ అధికారులతో ఏహెచ్డీ శాఖ కార్యదర్శి శ్రీమతి అల్కా ఉపాధ్యాయ ఈరోజు న్యూఢిల్లీలో పశుసంవర్ధక మరియు డెయిరీ రంగానికి సంబంధించిన ప్రాంతీయ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం మరియు త్రిపురలలో డిపార్ట్మెంట్ యొక్క కార్యక్రమాలు/పథకాల అమలు పురోగతిని చర్చించడానికి అడిషనల్ చీఫ్ సెక్రటరీ/ ప్రిన్సిపల్ సెక్రటరీ/ సెక్రటరీతో పాటు సంబంధిత డైరెక్టర్లు, పశుసంవర్ధక శాఖ వారితో ఈ సమావేశం నిర్వహించారు. సమీక్షా సమావేశానికి అదనపు కార్యదర్శి, జాయింట్ సెక్రటరీలు, చీఫ్ కంట్రోలర్ ఆఫ్ అకౌంట్స్ మరియు భారత ప్రభుత్వపు పశుసంవర్ధక మరియు పాడిపరిశ్రమ శాఖ ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారు. రాష్ట్రీయ గోకుల్ మిషన్ (ఆర్జీఎం), నేషనల్ లైవ్స్టాక్ మిషన్ (ఎన్ఎల్ఎం), నేషనల్ యానిమల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ (ఎన్ఏడీసీపీ), డెయిరీ ప్రాసెసింగ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ (డీఐడీఎఫ్), ఈశాన్య రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న డెయిరీ డెవలప్మెంట్ కోసం జాతీయ కార్యక్రమం (ఎన్పీడీడీ) వంటి అన్ని పశుసంవర్ధక మరియు డెయిరీ పథకాల భౌతిక మరియు ఆర్థిక పురోగతిని కార్యదర్శి అల్కా ఉపాధ్యాయ సమీక్షించారు. ఆయా పథకాల కింద ఈశాన్య రాష్ట్రాల వద్ద ఉన్న ఖర్చు చేయని నిల్వలను ఉపయోగించుకోవాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా ఆమె నొక్కిచెప్పారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక కార్యాచరణ ప్రణాళికలు మరియు డిమాండ్లను వెంటనే ఖరారు చేసి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాలని రాష్ట్రాలను ఆదేశించారు. పశుగ్రాసం టాస్క్ ఫోర్స్, పశువుల బీమా, ఐవీఎఫ్ ల్యాబ్ల ఏర్పాటుకు రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, రాష్ట్రాలలో మెరుగైన ఆరోగ్య సంరక్షణ సేవల కోసం మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి సారించాలని ఆమె రాష్ట్ర ఏహెచ్డీలను కోరింది. అదనంగా, ఎన్ఏడీసీపీ స్కీమ్ను సమర్థవంతంగా అమలు చేయడం.. కోసం దానికి సంబంధించి ఫీడ్బ్యాక్ కోసం రాష్ట్రాలను ఆమె ఆదేశించారు. పాడి పరిశ్రమను ప్రోత్సహించడానికి వ్యూహాత్మక విధానంగా పాల సహకార సంఘాలతో పాటు పాల ఉత్పత్తిదారుల కంపెనీల స్థాపనపై ఆమె బలమైన దృష్టి పెట్టారు. రీఅలైన్డ్ యానిమల్ హస్బెండరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ (ఏహెచ్ఐడీఎఫ్) పోర్టల్ను ప్రారంభించడంతో, ఆమె ఈ పథకాన్ని లబ్ధిదారులలో చురుకుగా ప్రోత్సహించాలని, దాని ప్రయోజనాలను పెంచుకోవడానికి మరియు వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి చర్యలను చేపట్టాలాని రాష్ట్రాలను కోరారు.
***
(Release ID: 2006185)