ప్రధాన మంత్రి కార్యాలయం

వరల్డ్గవర్నమెంట్స్ సమిట్ 2024 లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి

Posted On: 14 FEB 2024 5:10PM by PIB Hyderabad

దుబయి పాలకుడు మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) యొక్క ఉపాధ్యక్షుడు, ప్రధాని, రక్షణ మంత్రి అయినటువంటి శ్రీ శేఖ్ మొహమ్మద్ బిన్ రాశిద్ అల్ మక్తూమ్ ఆహ్వానించిన మీదట ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 ఫిబ్రవరి 14వ తేదీ నాడు దుబయి లో జరిగిన వరల్డ్ గవర్నమెంట్స్ సమిట్ లో గౌరవ అతిథి గా పాల్గొన్నారు. ఈ శిఖర సమ్మేళనం యొక్క ఇతివృత్తం ‘‘భావి ప్రభుత్వాల కు రూపురేఖల ను కల్పించడం’’ పై ఆయన విశిష్ట కీలకోపన్యాన్ని ఇచ్చారు. 2018 సంవత్సరం లో జరిగిన వరల్డ్ గవర్నమెంట్స్ సమిట్ లో కూడా ప్రధాన మంత్రి గౌరవ అతిథి గా ఉన్నారు. ఈ సారి జరిగిన శిఖర సమ్మేళనం లో పది మంది అధ్యక్షులు మరియు పది మంది ప్రధాన మంత్రులు సహా ఇరవై మంది ప్రపంచ నేత లు పాలుపంచుకొన్నారు. ఈ ప్రపంచ సభ లో నూట ఇరవై కి పైగా దేశాల కు చెందిన ప్రభుత్వాల కు మరియు ప్రతినిధుల కు ప్రాతినిధ్యం ఉండింది.

 

ప్రధాన మంత్రి తన ప్రసంగం లో, పాలన తాలూకు స్వభావం మారుతూ ఉన్న విషయమై తన అభిప్రాయాల ను వెల్లడించారు. ‘‘కనీస స్థాయి ప్రభుత్వం, గరిష్ఠ స్థాయి పాలన’’ అనే సూత్రం పై ఆధారపడి భారతదేశం లో పరివర్తన ప్రధానమైనటువంటి సంస్కరణ లు అమలవుతున్నాయి అని ఆయన ప్రముఖం గా పేర్కొన్నారు. సంక్షేమాన్ని, అన్ని వర్గాల ప్రజల ను కలుపుకొని పోవడాన్ని మరియు స్థిరత్వాన్ని పెంపొందింప చేయడం కోసం డిజిటల్ సాంకేతికత ను దేశం ఏ విధం గా ఉపయోగించుకొన్నదీ ఆయన వివరిస్తూ, పాలన లో మానవ కేంద్రిత వైఖరి ఎంతైనా అవసరం అంటూ పిలుపు ను ఇచ్చారు. అన్ని వర్గాల ను కలుపుకొని ముందుకు సాగిపోయేటటువంటి ఒక సమాజాన్ని ఆవిష్కరించడం కోసం ప్రజల భాగస్వామ్యం, వరుస లో నిలబడిన ఆఖరు వ్యక్తి కి సైతం ప్రభుత్వ పథకాల తాలూకు ప్రయోజనాల ను అందించడం మరియు మహిళల నాయకత్వం లో అభివృద్ధి ని సాధించడం అనే అంశాల పై భారతదేశం శద్ధ వహిస్తోంది అని కూడా ఆయన స్పష్టం చేశారు.

 

ప్రపంచం పరస్పరం సంధాన పూర్వకమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉండడం వల్ల రాబోయే కాలం లోని సవాళ్ళ ను పరిష్కరించడం కోసం ప్రభుత్వాలు ఒకదాని తో మరొకటి సహకరించునకొంటూను, ఒకదాని నుండి మరొకటి నేర్చుకొంటూను ఉండాలి అని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. పాలన అనేది అన్ని వర్గాల ను కలుపుకొని పోయేది గాను, సాంకేతికం గా సమర్థమైంది గాను, స్వచ్ఛమైందిగాను మరియు పారదర్శకమైందిగాను, అలాగే కాలుష్య రహిత విధానాల కు ప్రాధాన్యాన్ని ఇచ్చేదిగాను ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది అని ఆయన ఉద్ఘాటించారు. ఇదే సందర్భం లో, ప్రభుత్వాలు ప్రజల కు సేవ చేసే విషయం లో అవి అనుసరించే వైఖరి లో భాగం గా జీవన సౌలభ్యం, న్యాయ సౌలభ్యం, గతిశీలత సౌలభ్యం, నూతన ఆవిష్కరణ సంబంధి సౌలభ్యం, ఇంకా వ్యాపార నిర్వహణపరమైన సౌలభ్యం లకు పెద్దపీట ను వేసి తీరాలి అన్నారు. జలవాయు పరివర్తన సంబంధి కార్యాచరణ పట్ల భారతదేశం అచంచలమైనటువంటి నిబద్ధత ను కలిగి ఉంది అని ఆయన విడమరచి చెబుతూ, సుస్థిరమైన ప్రపంచాన్ని ఆవిష్కరించడం కోసం మిశన్ ఎల్ఐఎఫ్ఇ (పర్యావరణ మిత్రపూర్వకం అయినటువంటి జీవనశైలి) లో చేరవలసింది గా జనబాహుళ్యాని కి పిలుపు ను ఇచ్చారు.

 

కిందటి సంవత్సరం లో జి-20 కి అధ్యక్ష బాధ్యత ను నిర్వర్తించిన భారతదేశం, ఆ క్రమం లో పోషించిన నాయకత్వ పాత్ర ను గురించి, ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక అంశాల ను గురించి, సవాళ్ల ను గురించి సుదీర్ఘం గా ప్రధాన మంత్రి వివరించారు. ఈ సందర్భం లో, గ్లోబల్ సౌథ్ (వికాస శీల దేశాలు) ఎదుర్కొంటున్న అభివృద్ధి సంబంధి సమస్యల ను ప్రపంచ రంగస్థలం మీదకు తీసుకు రావడం లో భారతదేశం చేసిన ప్రయాసల ను ఆయన ప్రముఖం గా ప్రస్తావించారు. బహుళ పక్ష సంస్థల లో సంస్కరణల ను తీసుకురావాలని ఆయన పిలుపును ఇస్తూ, అవి తీసుకొనే నిర్ణయాల లో గ్లోబల్ సౌథ్ కు ఇప్పటి కంటే ఎక్కువ ప్రాధాన్యం దక్కాలి అని కోరారు. భారతదేశం ఒక ‘‘విశ్వ బంధు’’ గా తాను పోషిస్తున్నటువంటి భూమిక లో ప్రపంచ పురోగతి కి తన వంతు కృషి ని సాగిస్తూనే ఉంటుంది అని ఆయన స్పష్టంచేశారు.

 

 

***



(Release ID: 2006040) Visitor Counter : 90