ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

యుఎఇ ని మరియు కతర్ ను సందర్శించే కంటే ముందు ప్రధాన మంత్రి జారీ చేసిన ప్రకటన

Posted On: 13 FEB 2024 11:06AM by PIB Hyderabad

నేను ఒక ఆధికారిక సందర్శన పై ఫిబ్రవరి 13 , 14 వ తేదీ లలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) కు మరియు ఫిబ్రవరి 14 , 15 వ తేదీ లలో కతర్ ప్రయాణమై వెళ్తుతున్నాను. 2014వ సంవత్సరం తరువాత నేను జరుపుతున్న ఏడో యుఎఇ యాత్ర, మరి అలాగే కతర్ కు రెండో యాత్ర అని చెప్పాలి.

 

గడచిన తొమ్మిది సంవత్సరాల లో, యుఎఇ తో మన సహకారం వివిధ రంగాల లో ఉదాహరణ కు వ్యాపారం మరియు పెట్టుబడి, రక్షణ ఇంకా భద్రత, ఆహారం మరియు ఇంధన భద్రత, విద్య ల వంటి రంగా లలో అనేక రెట్లు వృద్ధి చెందింది. మన సాంస్కృతిక మరియు రెండు దేశాల ప్రజల మధ్య పారస్పరిక సంబంధాలు ఇది వరకు ఎన్నడు లేనంత గా బలం గా మారాయి.

 

అబు ధాబీ లో యుఎఇ అధ్యక్షుడు శ్రీ శేఖ్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నాహ్‌యాన్ తో సమావేశమై మన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకుపోయే అంశం లో విస్తృత శ్రేణి చర్చలు జరపాలని నేను ఆశపడుతున్నాను. ఇటీవల గుజరాత్ లో జరిగిన వైబ్రన్ట్ గుజరాత్ గ్లోబల్ సమిట్ 2024 కు ముఖ్య అతిథి గా శ్రీ శేఖ్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నాహ్‌యాన్ విచ్చేసినప్పుడు ఆయన కు ఆతిథేయి గా వ్యవహరించే సౌభాగ్యం నాకు దక్కింది.

 

దుబయి పాలకుడు మరియు యుఎఇ ఉపాధ్యక్షుడు, ప్రధాని, ఇంకా రక్షణ మంత్రి అయినటువంటి శ్రీ శేఖ్ మొహమ్మద్ బిన్ రాశిద్ అల్ మక్తూమ్ ఆహ్వానించిన మీదట, నేను 2024 ఫిబ్రవరి 14 వ తేదీ నాడు దుబయి లో వరల్డ్ గవర్నమెంట్ సమిట్ లో ప్రపంచ నేతల సమూహాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నాను. ప్రధాని శ్రీ శేఖ్ మొహమ్మద్ బిన్ రాశిద్ తో నేను జరబోయే చర్చలు దుబయి తో మన బహుముఖీన సంబంధాల ను బలపరచుకోవడం అనే అంశం పై కేంద్రీకృతం కానున్నాయి.

 

ఇదే యాత్ర లో, నేను అబు ధాబీ లో ఒకటో హిందూ మందిరాన్ని కూడా ప్రారంభించనున్నాను. ఈ బిఎపిఎస్ దేవాలయం సద్భావన, శాంతి మరియు సహనం ల తాలూకు విలువల కు ఒక చిరకాలిక ప్రశంస కానుంది; ఈ విలువల ను భారతదేశం మరియు యుఎఇ లు పాటిస్తూ వస్తున్నాయి.

 

అబు ధాబీ లో జరిగే ఒక ప్రత్యేక కార్యక్రమం లో నేను యుఎఇ లోని అన్ని ఎమిరేట్ ల నుండి తరలివచ్చే భారతీయ సముదాయం యొక్క సభ్యుల ను ఉద్దేశించి ప్రసంగిస్తాను.

 

కతర్ లో నేను అమీరు శ్రీ శేఖ్ తమీమ్ బిన్ హమాద్ అల్ థానీ తో భేటీ అవ్వాలని ఆశపడుతున్నాను. ఆయన నాయకత్వం లో కతర్ మహత్తరమైన వృద్ధి ని మరియు పరివర్తన ను నమోదు చేస్తూ వస్తోంది. కతర్ లో ఇతర ఉన్నతాధికారుల తో కూడాను సమావేశమవ్వాలని నేను ఆశ పడుతున్నాను.

 

భారతదేశం మరియు కతర్ ల మధ్య చరిత్రాత్మకమైనటువంటి సన్నిహిత మరియు మైత్రీపూర్వక సంబంధాలు నెలకొన్నాయి. ఇటీవల కొన్నేళ్ళ లో, మన మధ్య ఉన్నత స్థాయి రాజకీయ ఆదాన ప్రదానాలు, రెండు దేశాల మధ్య వ్యాపారం మరియు పెట్టుబడి వృద్ధి చెందడం, మన ఇంధన భాగస్వామ్యం బలపడడం మరియు సంస్కృతి లో, విద్య రంగం లో సహకారం సహా అన్ని రంగాల లో బహుముఖీన సంబంధాలు నిరంతరం గాఢం గా మారుతూ ఉన్నాయి. దోహా లో 8,00,000 మంది కి పైగా భారతీయ సముదాయం ఉండడం ప్రగాఢ సంబంధాల కు ప్రమాణం గా ఉంది.

 

***


(Release ID: 2005621) Visitor Counter : 99