మంత్రిమండలి
azadi ka amrit mahotsav

దుస్తులు/ వస్త్రాల ఎగుమతి కోసం రాష్ట్ర మరియు కేంద్ర పన్నులు మరియు లెవీల రాయితీ పథకం కొనసాగింపును మంత్రివర్గం ఆమోదించింది

Posted On: 01 FEB 2024 11:32AM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం 2026 మార్చి 31 వరకు దుస్తులు/వస్త్రాలు మరియు మేడ్ అప్‌ల ఎగుమతి కోసం రాష్ట్ర మరియు కేంద్ర పన్నులు రాయితీ మరియు పన్నుల తగ్గింపు (ఆర్ ఓ ఎస్ సి టీ ఎల్) పథకాన్ని కొనసాగించడానికి ఆమోదించింది.

 

దీర్ఘకాలిక డెలివరీ కోసం ముందస్తుగా ఆర్డర్‌లు ఇవ్వగలిగే టెక్స్‌టైల్స్ రంగంలో ఈ ప్రతిపాదిత కాలవ్యవధి రెండు (2) సంవత్సరాలపాటు స్కీమ్‌ను కొనసాగించడం వలన దీర్ఘకాలిక వాణిజ్య ప్రణాళికకు అవసరమైన స్థిరమైన విధాన పాలన కొనసాగుతుంది.

 

ఆర్ ఓ ఎస్ సి టీ ఎల్  పన్నులు మరియు లెవీల భారాన్ని తొలగించడం అనే విధాన కొనసాగింపు వల్ల ప్రణాళికను మరియు స్థిరత్వాన్ని నిర్ధారిస్తుంది. "వస్తువులు ఎగుమతి చేయబడతాయి అంతే కానీ దేశీయ పన్నులు కాదు" అనే సూత్రబద్ద విధానం స్థిర వ్యాపార ఆవరణాన్ని అందిస్తాయి.

 

కేంద్ర మంత్రివర్గం ఈ పథకానికిగతం లో 31.03.2020 నుంచి 31 మార్చి 2024 వరకు ఆమోదం తెలిపింది ఇప్పుడు ఆర్ ఓ ఎస్ సి టీ ఎల్ కొనసాగింపుకు మరోసారి ఆమోదం లభించింది. ప్రస్తుతం ఉన్న పొడిగింపు మార్చి 31, 2026 వరకు వుంటుంది, దీని ద్వారా వస్త్రాల రంగం లో ఎగుమతి పోటీతత్వాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది. ఇది దుస్తులు/గార్మెంట్స్ మరియు మేడ్ అప్స్ ఉత్పత్తుల జీరో-రేటెడ్ ఎగుమతి సూత్రాన్ని అవలంబిస్తుంది. ఆర్ ఓ ఎస్ సి టీ ఎల్  పరిధిలోకి రాని ఇతర వస్త్ర ఉత్పత్తులు (చాప్టర్ 61, 62 మరియు 63 మినహా) ఇతర ఉత్పత్తులతో పాటు ఆర్ ఓ డీ టీ టీ ఈ పీ  కింద ప్రయోజనాలను పొందేందుకు అర్హులు.

 

రాయితీ ద్వారా దుస్తులు/గార్మెంట్స్ మరియు మేడ్-అప్‌ల ఎగుమతిపై డ్యూటీ డ్రాబ్యాక్ స్కీమ్‌తో పాటు రాష్ట్ర మరియు కేంద్ర పన్నులు మరియు లెవీలను భర్తీ చేయడం ఈ పథకం యొక్క లక్ష్యం. పన్నులు మరియు సుంకాలు ఎగుమతి చేయకూడదనే అంతర్జాతీయంగా ఆమోదయోగ్యమైన సూత్రం ఆధారంగాఎగుమతుల కోసం అంతర్జాతీయ మార్కెట్‌లో సమస్థాయి పోటీ ఆవరణాన్ని కల్పించేందుకు ఈ పథకం రూపొందించబడింది. అందువల్ల, ఇన్‌పుట్‌లపై పరోక్ష పన్నులు మాత్రమే కాకుండా, తిరిగి చెల్లించని ఇతర రాష్ట్ర మరియు కేంద్ర పన్నులు మరియు లెవీల పై కూడా రాయితీలు ఇవ్వబడతాయి లేదా తిరిగి చెల్లించబడతాయి.

 

రవాణా, సొంత విద్యుత్, వ్యవసాయ రంగం, మండి ట్యాక్స్, ఎలక్ట్రిసిటీ డ్యూటీ, ఎగుమతి పత్రాలపై స్టాంప్ డ్యూటీ, ముడి ఉత్పత్తిలో ఉపయోగించే పురుగుమందులు, ఎరువులు మొదలైన ఇన్‌పుట్‌లపై చెల్లించే ఎంబెడెడ్ ఎస్ జి ఎస్ టి ఇంధనంపై రాష్ట్ర పన్నులు మరియు సుంకాల రాయితీలో వ్యాట్ పన్ను నమోదుకాని డీలర్ల నుండి పత్తి  కొనుగోళ్లు, విద్యుత్ ఉత్పత్తిలో ఉపయోగించే బొగ్గు మరియు రవాణా రంగానికి ఇన్‌పుట్‌లపై రీబెట్లు ఇవ్వబడతాయి. రవాణాలో ఉపయోగించే ఇంధనంపై కేంద్ర పన్నులు మరియు సుంకాల రాయితీ, ముడి పత్తి ఉత్పత్తిలో ఉపయోగించే పురుగుమందులు, ఎరువులు మొదలైన ఇన్‌పుట్‌లపై చెల్లించిన సీ జీ ఎస్ టీ, నమోదుకాని డీలర్‌ల నుండి కొనుగోళ్లు, విద్యుత్ ఉత్పత్తిలో ఉపయోగించే బొగ్గు, రవాణా రంగానికి సంబంధించిన ఇన్‌పుట్‌లు మరియు పొందుపరిచిన సీ జీ ఎస్ టీ మరియు పరిహారం సెస్‌లువీటిలో ఉంటాయి. 

 

ఆర్ ఓ ఎస్ సి టీ ఎల్ ఒక ముఖ్యమైన విధాన చొరవ మరియు వస్త్ర విలువ వ్యవస్థ కు అదనపు విలువ జోడించిన మరియు శ్రమతో కూడుకున్న విభాగాలైన దుస్తులు మరియు మేడ్ అప్‌లలో భారతీయ ఎగుమతుల పోటీతత్వాన్ని పెంపొందించడానికి ఇది సహాయపడింది.అలాగే దీర్ఘకాల డెలివరీ కోసం ముందస్తుగా ఆర్డర్‌లు పొందే టెక్స్‌టైల్స్ రంగంలో రెండు (2) సంవత్సరాల పాటు ఈ పథకాన్ని కొనసాగించడం వలన దీర్ఘకాలిక వాణిజ్య ప్రణాళికకు అవసరమైన ఈ స్థిరమైన విధాన పాలన సహాయపడుతుంది

 

****


(Release ID: 2001650) Visitor Counter : 139