మంత్రిమండలి
azadi ka amrit mahotsav

2009 మే నెలనుండి 2015 నవంబరు మధ్య కాలానికి గాను ఎరువు (యూరియా) యూనిట్ లకు దేశీయం గా గ్యాసును సరఫరా చేయడం కోసం మార్కెటింగ్ మార్జిన్ కు ఆమోదం తెలిపిన మంత్రిమండలి

Posted On: 01 FEB 2024 11:36AM by PIB Hyderabad

ఎరువు (యూరియా) యూనిట్ లకు 2009 వ సంవత్సరం మే నెల ఒకటో తేదీ మొదలుకొని 2015 నవంబరు 17 వ తేదీ వరకు ఉన్న కాలాని కి గాను దేశీయ గ్యాసు ను సరఫరా చేయడాని కి సంబంధించి మార్కెటింగ్ మార్జిన్ నిర్ధారణ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న సమావేశమైన కేంద్ర మంత్రిమండలి తన ఆమోదాన్ని తెలిపింది.

 

 

ఈ ఆమోదం ఒక నిర్మాణాత్మకమైనటువంటి సంస్కరణ అని చెప్పాలి. గ్యాసు ను మార్కెటింగ్ చేయడం తో జత పడి ఉన్నటువంటి అదనపు నష్ట భయం మరియు వ్యయాల ను భరించడం కోసం ఈ మార్కెటింగ్ మార్జిన్ ను గ్యాస్ ధర కంటే కొంత ఎక్కువ గా వినియోగదారు ల వద్ద నుండి గ్యాస్ మార్కెటింగ్ కంపెనీ వసూలు చేస్తుంది. ప్రభుత్వం ఇంతకు ముందు 2015 వ సంవత్సరం లో యూరియా మరియు ఎల్‌పిజి ఉత్పత్తిదారు సంస్థల కు దేశీయ గ్యాసు సరఫరా చేయడానికి సంబంధించినటువంటి మార్కెటింగ్ మార్జిను ను నిర్ణయించింది.

 

ఈ ఆమోదం విభిన్న ఎరువు (యూరియా) యూనిట్ లకు ఆయా యూనిట్ లు 01.05.2009 నుండి 17.11.2015 మధ్య కాలం లో కొనుగోలు చేసినటువంటి దేశీయ గ్యాసు కు అవి చెల్లించిన మార్కెటింగ్ మార్జిన్ కంపోనంట్ కు సంబంధించి అదనపు మూలధనాన్ని అందిస్తుంది. ఇది 18.11.2015 కు పూర్వం నుండి చెల్లిస్తూ వస్తున్నటువంటి రేటుల పై ఆధారపడి ఉంటుంది.

 

ఆత్మనిర్భర్ భారత్ ను ఆవిష్కరించాలి అని ప్రభుత్వం తీసుకొన్న సంకల్పాని కి అనుగుణం గా, తయారీదారు సంస్థల కు పెట్టుబడి ని పెంచుకోవడానికి ప్రోత్సాహకం ఈ ఆమోదం ద్వారా లభించ గలదు. అధికం గా సమకూరే పెట్టుబడి తో ఎరువుల రంగం లో స్వయం సమృద్ధి ప్రాప్తిస్తుంది. గ్యాస్ సంబంధి మౌలిక సదుపాయాల రంగం లో రాబోయే కాలం లో పెట్టుబడుల పరం గా ఒక విధమైన నమ్మకం సైతం ఏర్పడుతుంది.

 

 

***


(Release ID: 2001473) Visitor Counter : 102