సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

ఐఐఎంసీకి డీమ్డ్ విశ్వవిద్యాలయం హోదా

Posted On: 31 JAN 2024 6:01PM by PIB Hyderabad

జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్‌ విద్యను అందించే ప్రముఖ విద్యాసంస్థ 'ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్‌'కు డీమ్డ్ విశ్వవిద్యాలయం హోదా దక్కింది. యుూజీసీ సలహా మేరకు, కేంద్ర విద్య మంత్రిత్వ శాఖ డీమ్డ్ విశ్వవిద్యాలయం హోదాను ప్రకటించింది. ఐఐఎంసీ న్యూదిల్లీ ప్రాంగణంతో పాటు జమ్ము (జమ్ము&కశ్మీర్), అమరావతి (మహారాష్ట్ర), ఐజ్వాల్ (మిజోరం), కొట్టాయం (కేరళ), ధెంకనల్‌లో (ఒడిశా) ఉన్న ఐదు ప్రాంతీయ ప్రాంగణాలకు కూడా వర్తిస్తుంది.

ఈ కొత్త హోదాతో, సాధారణ డిగ్రీ పట్టాలతో పాటు డాక్టరేట్‌ డిగ్రీ పట్టాలు కూడా అందించే అధికారం ఇప్పుడు ఐఐఎంసీకి దఖలు పడింది.

వివరణాత్మక ప్రకటనను ఈ దిగువ లింక్‌ ద్వారా చూడవచ్చు.

https://iimc.gov.in/WriteReadData/userfiles/file/2024/Jan/Notification.pdf

***



(Release ID: 2001141) Visitor Counter : 89