సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పిఐబి ఫోటో ఫీచర్


శ్రీ రాంలాలా ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ 11 రోజుల ప్రత్యేక దీక్ష

ఈ క్రమంలో ప్రధాన మంత్రి వివిధ పుణ్యక్షేత్రాలలో పర్యటిస్తున్నారు మరియు విభిన్న భాషలలో రామాయణ పారాయణాలను వింటున్నారు

Posted On: 21 JAN 2024 7:01PM by PIB Hyderabad

జనవరి 22న అయోధ్య ధామ్ ఆలయంలో జరిగే శ్రీ రాంలాలా ప్రతిష్ఠాపనకు ముందు 11 రోజుల పవిత్ర దీక్షను జనవరి 12, 2024న నాసిక్‌లోని కాలా రామ్ మందిర్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఆయన నాసిక్ ధామ్ నుండి దీక్షను కొనసాగించారు. పంచవటిలో రాముడు సన్నిధిలో సమయం గడిపారు.

 

image.png

 

శ్రీ కాలారామ్ ఆలయం, నాసిక్


జనవరి 12, 2024న మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న కాలా రామ్ మందిర్‌లో ప్రధాని ప్రార్థనలు చేసి పూజలు చేశారు. శ్రీ రామ్ కుండ్ వద్ద దర్శనం చేసుకుని పూజలు నిర్వహించారు. రామాయణంలోని ‘యుధ్ కాండ’ విభాగాన్ని, శ్రీరాముడు అయోధ్యకు విజయోత్సాహంతో స్వదేశానికి వెళ్లడాన్ని చిత్రీకరిస్తూ మరాఠీ భాషలో ప్రధానమంత్రికి పఠించారు. సంత్ ఏక్‌నాథ్ జీ మరాఠీలో వ్రాసిన భావార్థ రామాయణంలోని శ్లోకాలను కూడా పిఎం విన్నారు.

 

image.png

 

వీరభద్ర దేవాలయం, లేపాక్షి, ఏపీ


16 జనవరి 2024న  మంగళవారం నాడు ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తిలో గల లేపాక్షి వీరభద్ర దేవాలయాన్ని సందర్శించి పూజలు చేశారు. ప్రధాన మంత్రి తెలుగు భాషలోని రంగనాథ రామాయణాన్ని విన్నారు మరియు ఆంధ్ర ప్రదేశ్‌కు సంబంధించిన పురాతన తోలుబొమ్మల కళారూపం తోలు బొమ్మలాట ద్వారా చిత్రీకరించబడిన జటాయుని కథను తిలకించారు.

image.png


 

గురువాయూర్ ఆలయం, త్రిస్సూర్, కేరళ


 కేరళలోని గురువాయూర్‌లో గల గురువాయూర్ ఆలయాన్ని కూడా ప్రధాని సందర్శించి పూజలు చేశారు.

 

image.png

 

 త్రిప్రయార్ శ్రీ రామస్వామి దేవాలయం, త్రిస్సూర్, కేరళ

 
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జనవరి 17, 2024న కేరళలోని త్రిప్రయార్‌లోని శ్రీ రామస్వామి వారి దివ్య క్షేత్రాన్ని సందర్శించారు. శ్రీ రామస్వామి ఆలయంలో దర్శనం మరియు పూజలు చేశారు. ప్రధాన మంత్రి సాంస్కృతిక ప్రదర్శనను కూడా వీక్షించారు మరియు కళాకారులను సత్కరించారు.

 

image.png


 

శ్రీ రంగనాథస్వామి ఆలయం, తిరుచిరాపల్లి, తమిళనాడు


2024 జనవరి 20వ తేదీ పవిత్రమైన రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడులోని శ్రీ రంగనాథస్వామి పవిత్ర క్షేత్రాన్ని సందర్శించారు. ప్రఖ్యాత కంబన్ తన కళాఖండాన్ని ప్రపంచానికి తొలిసారిగా ఆవిష్కరించిన పవిత్ర స్థలంలో కంబ రామాయణం కవితా ప్రదర్శనను కూడా ప్రధాని విన్నారు.

 

image.png

 


 

శ్రీ అరుల్మిగు రామనాథస్వామి దేవాలయం, రామేశ్వరం


శ్రీ రంగనాథస్వామి ఆలయంలో పూజలు చేసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడులోని రామేశ్వరం అరుల్మిగు రామనాథస్వామిని దర్శించుకున్నారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా వెలసిన స్వామికి నివాళులర్పించి తన భక్తిని చాటుకున్నారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో అనేక ఆధ్యాత్మిక గీతాలు ప్రదర్శించిన భజన సంధ్య వంటి వివిధ కార్యక్రమాలలో కూడా ఆయన పాల్గొన్నారు.

 

image.png

 


 

కోదండరామస్వామి దేవాలయం, ధనుష్కోడి

 

ఈరోజు ధనుష్కోడిలోని కోదండరామస్వామి ఆలయంలో ప్రధాని దర్శనం మరియు పూజలు నిర్వహించారు. ధనుష్కోడి సమీపంలో రామసేతు నిర్మించిన ప్రదేశంగా చెప్పబడే అరిచల్ మునైని కూడా ప్రధాని సందర్శించారు.

image.png

 

****


(Release ID: 1998521) Visitor Counter : 109