ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జనవరి 18న వికసిత భారత్ సంకల్ప్ యాత్ర లబ్ధిదారులతో సంభాషించనున్న ప్ర‌ధాన మంత్రి


దేశవ్యాప్తంగా వేలాది మంది వికసిత భారత్ సంకల్ప్ యాత్ర లబ్ధిదారులు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు

Posted On: 17 JAN 2024 5:13PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ  2024 జనవరి 18 మధ్యాహ్నం 12:30 గంటలకు దృశ్య మాధ్యమం ద్వారా వికసిత భారత్ సంకల్ప్ యాత్ర లబ్ధిదారులతో సంభాషించనున్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగిస్తారు. దేశ‌వ్యాప్తంగా ఉన్న వేలాది మంది వికసిత భార‌త్ సంక‌ల్ప్ యాత్ర ల‌బ్దిదారులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక  ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటారు.

నవంబర్ 15, 2023న ఈ కార్యక్రమాన్ని  ప్రారంభించినప్పటి నుండి, ప్రధానమంత్రి దేశవ్యాప్తంగా వికసిత భారత్ సంకల్ప్ యాత్ర  లబ్ధిదారులతో క్రమం తప్పకుండా సంభాషిస్తున్నారు. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఈ కార్యక్రమం ఐదుసార్లు జరిగింది (30 నవంబర్, 9 డిసెంబర్, 16 డిసెంబర్, 27 డిసెంబర్, 8 జనవరి, 2024). అలాగే, ప్రధానమంత్రి గత నెల వారణాసి పర్యటన సందర్భంగా వరుసగా రెండు రోజులు (డిసెంబర్ 17-18) వికసిత భారత్ సంకల్ప్ యాత్ర లబ్ధిదారులతో నేరుగా సంభాషించారు.

ఈ పథకాల ప్రయోజనాలు నిర్దేశిత లబ్ధిదారులందరికీ సకాలంలో చేరేలా చూడడం ద్వారా ప్రభుత్వ ఫ్లాగ్‌షిప్ స్కీమ్‌ల సంతృప్తతను సాధించాలనే లక్ష్యంతో దేశవ్యాప్తంగా వికసిత  భారత్ సంకల్ప్ యాత్ర చేపట్టారు.

వికసిత భారత్ సంకల్ప్ యాత్రలో పాల్గొన్న వారి సంఖ్య 15 కోట్లు దాటింది. వికసిత  భారత్ భాగస్వామ్య దృక్పథం వైపు దేశ వ్యాప్తంగా ప్రజలను క్షేత్ర స్థాయిలో ఏకం చేస్తూ ఎంతో తీవ్ర ప్రభావాన్ని సృష్టించడమే ఈ యాత్ర విజయానికి నిదర్శనం.

 

***


(Release ID: 1997120) Visitor Counter : 122