ప్రధాన మంత్రి కార్యాలయం

ఆంధ్ర ప్రదేశ్ లోని పుట్టపర్తి కి దగ్గరలో ఉన్నలేపాక్షి లో వీరభద్ర దేవాలయం లో జరిగిన పూజ మరియు దైవ దర్శనం కార్యక్రమాల లోపాలుపంచుకొన్న ప్రధాన మంత్రి

Posted On: 16 JAN 2024 6:13PM by PIB Hyderabad

ఆంధ్ర ప్రదేశ్ లోని పుట్టపర్తి కి దగ్గర లో ఉన్న లేపాక్షి గ్రామం లో గల వీరభద్ర దేవాలయం లో ఈ రోజు న జరిగిన పూజ కార్యక్రమం మరియు దైవ దర్శనం కార్యక్రమాల లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలుపంచుకొన్నారు. తెలుగు లో రంగనాథ రామాయణం నుండి కొన్ని ప్రవచనాల ను శ్రీ నరేంద్ర మోదీ విన్నారు; జటాయు కు సంబంధించిన గాథ ను ఆంధ్ర ప్రదేశ్ లో తోలుబొమ్మలాట గా ప్రసిద్ధమైన కళారూపం మాధ్యం ద్వారా ప్రదర్శించగా, ఆ కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి తిలకించారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

 

‘‘ప్రభువు శ్రీ రాముని భక్తులందరి కీ లేపాక్షి చాలా ముఖ్యమైనటువంటిది. ఈ రోజు న వీరభద్ర ఆలయం లో జరిగిన ప్రార్థనల లో పాలుపంచుకొనే గౌరవం నాకు దక్కింది. భారతదేశం యొక్క ప్రజలు సంతోషం గా ఉండాలి, వారు ఆరోగ్యం గా ఉండాలి మరియు వారు సమృద్ధి తాలూకు సరిక్రొత్త శిఖరాల ను చేరుకోవాలి అంటూ ఆ ఈశ్వరుడి ని నేను ప్రార్థించాను.’’

 

‘‘లేపాక్షి లో గల వీరభద్ర దేవాలయం లో, రంగనాథ రామాయణం నుండి కొన్ని భాగాల ను నేను విన్నాను; మరి అలాగే రామాయణాన్ని గురించినటువంటి ఒక తోలుబొమ్మలాట ప్రదర్శన ను కూడా చూశాను.’’ అని పేర్కొన్నారు.

*****

DS/TS



(Release ID: 1996900) Visitor Counter : 104