ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

హెచ్‌పీవీ టీకాల విషయంలో నిజం - అబద్ధం


9-14 ఏళ్ల వయస్సు గల బాలికల కోసం భారత ప్రభుత్వం హెచ్‌పీవీ టీకాలను ప్రారంభించబోతున్నట్లు వచ్చిన వార్తలు అబద్ధం

హెచ్‌పీవీ టీకాల ప్రారంభంపై నిర్ణయం తీసుకోని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ

Posted On: 13 JAN 2024 4:36PM by PIB Hyderabad

9-14 సంవత్సరాల వయస్సు గల బాలికలకు 'హ్యూమన్‌ పాపిల్లోమా వైరస్' (హెచ్‌పీవీ) టీకాలు వేసే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం 2024 ఏప్రిల్‌-జూన్‌ కాలంలో ప్రారంభిస్తుందని కొన్ని మీడియా వర్గాల్లో వార్తలు వచ్చాయి. ఆ వార్తలు నిజం కాదు, ఊహాజనితం.

హెచ్‌పీవీ టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించడంపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దేశంలో గర్భాశయ కేన్సర్ కేసులను మంత్రిత్వ శాఖ నిశితంగా పరిశీలిస్తోంది, రాష్ట్రాలు & వివిధ ఆరోగ్య విభాగాలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోంది.

 

****



(Release ID: 1996417) Visitor Counter : 81