ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ రామ్ లలా యొక్క ప్రాణ ప్రతిష్ఠ కు గాను 11 రోజుల ప్రత్యేక ఆచారాన్ని పాటించడం మొదలు పెడుతున్నప్రధాన మంత్రి
ఈ కార్యక్రమాన్ని ఆయన నాసిక్ ధామ్-పంచవటి నుండి ఈ రోజు న మొదలు పెట్టబోతున్నారు
‘‘నేను భావోద్వేగాల తో ఉబ్బితబ్బిబ్బు అవుతున్నాను. నేను నా జీవనం లో మొదటి సారిగా ఈ విధమైనటువంటిమనోభావాల కు లోనవుతూ ఉన్నాను’’
‘‘ప్రభువు నన్ను భారతదేశం లో ప్రజలందరికీ ప్రాతినిధ్యంవహించేటటువంటి ఒక పనిముట్టు వలె మలచారు. ఇది ఒక చాలా పెద్దది అయినటువంటి బాధ్యత మరి’’
‘‘ప్రాణ ప్రతిష్ఠ జరిగే ఘట్టం మనకు అందరికి ఒక ఉమ్మడిఅనుభూతి ని ఇవ్వబోతోంది. రామ మందిరం ఆశయ సాధన కు గాను వారి వారి జీవనాల ను సమర్పణం చేసివేసినటువంటిఅసంఖ్య వ్యక్తుల యొక్క ప్రేరణ నా వెన్నంటి నిలుస్తుంది’’
‘‘ఈశ్వరుని మరో రూపమే ప్రజలు. వారు వారి కి కలిగినటువంటిఅనుభూతుల ను మాటల లో తెలియజేస్తూ, ఆశీస్సుల ను ఇస్తున్నప్పుడు నాలో ఒక క్రొత్త శక్తి ప్రసరిస్తూ ఉంటుంది. ఈ రోజు న, నాకు మీ యొక్క దీవెన లు అవసరం. ’’
Posted On:
12 JAN 2024 10:31AM by PIB Hyderabad
అయోధ్య ధామ్ లోని ఆలయం లో జనవరి 22 వ తేదీ నాడు శ్రీ రామ్ లలా యొక్క ప్రాణ ప్రతిష్ఠ జరుగనుండ గా, అప్పటి వరకు ఇంకా ఉన్న పదకొండు రోజుల లోను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒక ప్రత్యేక ఆచారాన్ని పాటించడం మొదలు పెట్టేశారు. ‘‘ఇది ఒక చాలా పెద్దదైనటువంటి బాధ్యత అని చెప్పాలి. యజ్ఞం చేయడాని కి మరియు దైవాన్ని పూజించడాని కి మనం మన లో ఉన్న దైవీయ చేతన ను జాగృతం చేయవలసి ఉంటుందని మన యొక్క ధర్మ గ్రంథాల లో కూడాను బోధించడం జరిగింది. దీనికి గాను ప్రాణ ప్రతిష్ఠ కు ముందు గా వ్రతం మరియు కఠోరమైన నియమాల ను పాటించాలని శాస్త్రాల లో సూచించడమైంది. ఈ కారణం గా, ఆధ్యాత్మిక యాత్ర జరుపుతున్న కొందరు తపస్పులు మరియు మహాపురుషుల వద్ద నుండి నాకు ఏదయితే మార్గదర్శకత్వం లభించిందో.. వారు ఇచ్చిన సలహా ల ప్రకారమే నేను యమ-నియమాల ను అనుసరిస్తూ ఈ రోజు నుండి పదకొండు రోజుల పాటు సాగే ఒక ప్రత్యేక ఆచారాన్ని పాటించడాన్ని మొదలు పెడుతున్నాను.’’ అని ప్రధాన మంత్రి వివరించారు.
ప్రధాన మంత్రి ఈ క్రింది విధం గా ఒక భావోద్వేగ భరితమైన సందేశాన్ని ఇచ్చారు.
‘ప్రాణ ప్రతిష్ఠ జరుగనున్న నేపథ్యం లో యావత్తు దేశ ప్రజలు రామ భక్తి భావన లో మునిగి తేలుతూ ఉన్నారు అని పేర్కొన్నారు. ఇది సర్వ శక్తిమంతుడి యొక్క ఆశీస్సుల తో నిండిన క్షణం అని ఆయన అభివర్ణిస్తూ, ‘‘నేను భావావేశాల జడి లో ఉప్పొంగిపోతున్నాను. నా జీవనం లో మొదటిసారి గా నేను ఆ తరహా భావాల కు లోనవుతూ ఉన్నాను, భక్తి తాలూకు ఒక భిన్నమైనటువంటి ఆలోచన నాలో జనిస్తున్నది. ఈ విధమైన ఉద్విగ్న యాత్ర అనుభూతి ని నా అంతరంగం అనుభవిస్తున్నది, దాని ని మాటల లో చెప్పలేను. నేను నా అనుభూతులు ఇటువంటివి అని చెప్పదలచుకొన్నప్పటికీ వాటి గాఢత్వాన్ని, విస్తృతి ని మరియు తీవ్రత ను గురించి పలుకులాడ లేకపోతున్నాను. మీరు కూడాను నా స్థితి ఏమిటనేది మరీ బాగా గ్రహించగలరు.’’
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తనకు లభించినటువంటి అవకాశాని కి గాను కృతజ్ఞత ను వ్యక్తం చేశారు. ‘‘అనేక తరాల కు చెందినవారు ఏళ్ళ తరబడి ఒక సంకల్పాన్ని పూని దానిని వారి హృదయాల లో దాచిపెట్టుకొని, ఆ యొక్క కల నెరవేరే టటువంటి ఘడియ ప్రస్తుతం విచ్చేసిన తరుణం లో అక్కడ ఉండే సౌభాగ్యం నాకు ప్రాప్తించింది. ప్రభువు నాకు భారతదేశం లో ప్రజలందరి పక్షాన ఒక మాధ్యం గా ఎంచుకోవడం జరిగింది. ఇది ఒక చాలా పెద్దదైనటువంటి బాధ్యత సుమా.’’ అని ప్రధాన మంత్రి వివరించారు.
ఈ మంగళప్రదమైన సందర్భం లో రుషులు, మునులు, తపస్సులు మరియు పరమాత్మ యొక్క ఆశీర్వాదాలు లభించాలి అంటూ ప్రధాన మంత్రి కోరుకున్నారు; ఈ ఆచార నియమాన్ని రామచంద్ర ప్రభువు నాసిక్ ధామ్- పంచవటి లో చాలా కాలం పాటు బస చేసిన నాసిక్ ధామ్- పంచవటి నుండి ఆచరించబోతూ ఉండటం పట్ల సంతోషాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ రోజు న స్వామి వివేకానంద యొక్క జయంతి మరి, అలాగే మాత జీజాబాయి యొక్క జయంతి కూడా కలసి రావడం పట్ల ఆయన తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. జాతి జనుల అంతశ్చేతన లో చోటు ను సంపాదించుకొన్న ఇద్దరి కి ఆయన తన శ్రద్ధాంజలి ని సమర్పించారు. ఇదే సందర్భం లో ప్రధాన మంత్రి కి ఆయన యొక్క తల్లి గారు గుర్తు కు వచ్చారు. ఆవిడ ఎల్లవేళ ల సీతారాములు అంటే ఎనలేని భక్తి ప్రపత్తుల తో మెలగే వారు.
ప్రభువు రామచంద్రమూర్తి యొక్క భక్త జనులు ఒడిగట్టిన త్యాగాలకు శ్రద్ధాంజలి ని ప్రధాన మంత్రి ఘటిస్తూ, ‘‘ఆ పవిత్ర క్షణాని కి సాక్షి గా నేను అక్కడ నేను హాజరు అయి ఉంటాను గాని నా అంతరంగం లో, నా గుండె యొక్క ప్రతి స్పందన లో భారతదేశం లోని 140 కోట్ల మంది నా సరసనే నిలబడి ఉన్నట్లు నేను భావన చేస్తాను. మీరు నా ప్రక్కనే ఉంటారు.. రామభద్రుని భక్తాళువుల లో ప్రతి ఒక్కరు నాతో నే ఉంటారు. మరి ఆ చైతన్య భరిత క్షణం, మన అందరి కి ఉమ్మడి అనుభూతి ని పంచి ఇవ్వనుంది. రామ మందిర ఆశయ సాధన కోసం అసంఖ్య వ్యక్తులు వారి యొక్క జీవనాన్ని సమర్పణం చేయగా వారి ప్రేరణ ను నేను నా లోలోపల నింపుకొంటాను.’’
దేశ ప్రజలు తన తో జతపడవలసిందంటూ ను మరియు ప్రజల దీవెనల ను తన కు ఇవ్వవలసింది గాను, అలాగే వారి యొక్క అనుభూతుల ను తనతో పంచుకోవలసింది గాను ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు. ‘‘ఈశ్వరుడు ‘నిరాకారుడు’ అనే నిజాన్ని మనం అందరం ఎరుగుదుము.’’ అయితే, దైవం సాకార రూపం లో సైతం మన ఆధ్యాత్మిక ప్రస్థానాని కి బలం అందిస్తూనే ఉంటారు. ప్రజల లో దైవం యొక్క రూపాన్ని నేను స్వయం గా గమనించడం తో పాటు ఆ విషయాన్ని నా యొక్క అనుభవం లోకి కూడా తెచ్చుకొన్నాను. అయితే, దైవం రూపం లో ఉన్న ప్రజలు నన్ను కలసి వారి కి కలుగుతున్న అనుభూతుల ను వర్ణించడం, ఆశీర్వాదాల ను ఇవ్వడం జరిగినప్పుడు నాలోకి ఒక క్రొత్త శక్తి ప్రసరిస్తూ ఉంటుంది. ఈ రోజు న, నాకు మీ యొక్క ఆశీర్వచనాలు కావాలి సుమా.’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
***
DS/SK
(Release ID: 1995586)
Visitor Counter : 220
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam