ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జనవరి 12 వ తేదీ న మహారాష్ట్ర ను సందర్శించనున్నప్రధాన మంత్రి


ముప్ఫై వేల ఐదు వందల కోట్ల రూపాయల కు పైచిలుకు విలువకలిగిన అనేక అభివృద్ధి ప్రాజెక్టుల కు మహారాష్ట్ర లో శంకుస్థాపన చేయడం తో పాటు వాటిలో కొన్నిప్రాజెక్టుల ను ప్రారంభించనున్న మరియు దేశ ప్రజల కుఅంకితం ఇవ్వనున్న ప్రధాన మంత్రి

సంధానం లో సౌలభ్యాన్ని వృద్ధి చెందిప చేసే ముఖ్య చర్యలో భాగం గా ‘అటల్ బిహారీ వాజ్‌పేయీ  సేవారీ - నావ సేవ అటల్ సేతు’ ను ప్రారంభించనున్న ప్రధాన మంత్రి

సుమారు 17,840 కోట్ల రూపాయల వ్యయం తో నిర్మాణం జరిగిన అటల్ సేతు భారతదేశం లో అత్యంత పొడవైన వంతెన యే కాకుండాదేశం లో అత్యంత పొడవైన సాగర సేతువు గా కూడా ను

ఈస్టర్న్ ఫ్రీవే యొక్క ఆరెంజ్ గేట్ ను మరీన్ డ్రైవ్ తోకలిపే భూమి లోపలి రహదారి సొరంగ మార్గం యొక్క నిర్మాణాని కి శంకుస్థాపన చేయనున్నప్రధాన మంత్రి

రత్నాభరణాల రంగాని కి ఊతం ఇచ్చే విధం గా ఎస్ఇఇపిజడ్సెజ్ లో ‘భారత్ రత్నమ్’ ను మరియు న్యూ ఎంటర్‌ప్రైజెస్ & సర్వీసెజ్ టవర్ (ఎన్ఇఎస్‌టి) 01 ని ప్రారంభించనున్నప్రధాన మంత్రి

రైల్ రంగాని కి చెందిన అనేక ప్రాజెక్టుల ను మరియుత్రాగునీటి పథకాల ను దేశ ప్రజల కు అంకితమివ్వడం జరుగుతుంది

మహిళల కు సాధికారిత కల్పన దిశ లో మరొక ప్రయాస

Posted On: 11 JAN 2024 11:12AM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 జనవరి 12 వ తేదీ న మహారాష్ట్ర ను సందర్శించనున్నారు. ప్రధాన మంత్రి మధ్యాహ్నం పూట సుమారు 12 గంటల 15 నిమిషాల వేళ కు నాసిక్ కు చేరుకొని, అక్కడ ఇరవై ఏడో జాతీయ యువ జనోత్సవాన్ని ప్రారంభించనున్నారు. రమారమి 3 గంటల 30 నిమిషాల వేళ కు ముంబయి లో అటల్ బిహారీ వాజ్‌పేయీ సేవారీ - నావ సేవ అటల్ సేతు ను ప్రధాన మంత్రి ప్రారంభించడం తో పాటు గా దాని గుండా ప్రయాణించనున్నారు. సాయంత్రం దాదాపు గా 4 గంటల 15 నిమిషాల వేళకు నవీ ముంబయి లో జరిగే ఒక సార్వజనిక కార్యక్రమం లో ప్రధాన మంత్రి పాలుపంచుకొంటారు. ఈ కార్యక్రమం లో భాగం గా అనేక అభివృద్ధి ప్రాజెక్టుల ను ప్రారంభించడం, దేశ ప్రజల కు అంకితమివ్వడం, ఇంకా కొన్ని పథకాల కు శంకుస్థాపన చేయడం లోనూ ఆయన పాలుపంచుకోనున్నారు.

 

‘అటల్ బిహారీ వాజ్‌పేయీ సేవారీ - నావ సేవ అటల్ సేతు’ ను గురించి

పట్టణ రవాణా సంబంధి మౌలిక సదుపాయాల ను మరియు సంధానాన్ని పటిష్ట పరచడం ద్వారా పౌరుల కు సంధాన సౌలభ్యాన్నిమెరుగు పరచాలి అన్నది ప్రధాన మంత్రి దృష్టి కోణం గా ఉంది. ఈ దార్శనికత కు అనుగుణం గా ముంబయి ట్రాన్స్‌ హార్బర్ లింక్ (ఎమ్‌టి‌హెచ్‌ఎల్) కు ప్రస్తుతం అటల్ బిహారీ వాజ్‌పేయీ సేవారీ - నావ సేవ అటల్ సేతుపేరు తో నిర్మించడం జరిగింది. ఈ వంతెన కు శంకుస్థాపన ను సైతం ప్రధాన మంత్రి 2016 వ సంవత్సరం డిసెంబరు లో జరిపారు.

 

అటల్ సేతు ను 17,840 కోట్ల రూపాయల కు పైగా మొత్తం వ్యవయం తో నిర్మించడమైంది. ఇది దాదాపు గా 21.8 కిలో మీటర్ ల పొడవు న రూపొందిన ఆరు దోవల వారధి గా ఉన్నది. సముద్రం మీద దాదాపు 16.5 కి.మీ. పొడవు న మరియు భూమి పైన సుమారు 5.5 కి.మీ. మేర ఈ వంతెన విస్తరించింది. ఇది భారతదేశం లో అత్యంత పొడవైనటువంటి వంతెనగా ఉంది. అంతేకాదు, భారతదేశం లో అత్యంత దీర్ఘమైనటువంటి సాగర సేతువు కూడా ను. ఇది ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయాని కి మరియు నవీ ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయాని కి వేగవంతమైనటువంటి సంధానాన్ని సమకూర్చడం తో పాటు గా ముంబయి నుండి పుణే కు, గోవా కు మరియు భారతదేశం దక్షిణ ప్రాంతాల కు ప్రయాణించేందుకు పట్టే కాలాన్ని సైతం తగ్గించి వేస్తుంది. ఇది ముంబయి నౌకాశ్రయాని కి మరియు జవాహర్‌ లాల్ నెహ్ రూ నౌకాశ్రయాని కి మధ్య కనెక్టివిటీ ని మెరుగు పరుస్తుంది.

 

నవీ ముంబయి సార్వజనిక కార్యక్రమం

నవీ ముంబయి లో ఏర్పాటు చేసిన ఒక సార్వజనిక కార్యక్రమం లో ప్రధాన మంత్రి పాల్గొని, 12,700 కోట్ల రూపాయల కు పైగా విలువైనటువంటి అనేక అభివృద్ధి ప్రాజెక్టుల ను ప్రారంభించడం మరియు దేశ ప్రజల కు అంకితమివ్వడం తో పాటుగా కొన్ని పథకాల కు శంకుస్థాపన కూడా చేయనున్నారు.

 

ఈస్టర్న్ ఫ్రీవే యొక్క ఆరెంజ్ గేట్ ను మరీన్ డ్రైవ్ తో జోడించేటటువంటి భూమి లోపలి రహదారి సొరంగాని కి ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. 9.2 కి.మీ. పొడవైన సొరంగం నిర్మాణాని కి 8,700 కోట్ల రూపాయల కు పైగా ఖర్చు కానుంది; ఇది ముంబయి లో మౌలిక సదుపాయాల అభివృద్ధి పరం గా ఒక ముఖ్యమైనటువంటి పథకం అని చెప్పాలి; ఇది ఆరెంజ్ గేట్ మరియు మరీన్ డ్రైవ్ ల మధ్య ప్రయాణ కాలాన్ని తగ్గిస్తుంది.

 

సూర్య రీజనల్ బల్క్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు యొక్క ఒకటో దశ ను దేశ ప్రజల కు ప్రధాన మంత్రి అంకితం చేయనున్నారు. 1975 కోట్ల రూపాయల కు పైగా వ్యయం తో అభివృద్ధి పరచినటువంటి ఈ యొక్క పథకం మహారాష్ట్ర లోని పాల్ ఘర్ మరియు ఠాణె జిల్లా కు త్రాగునీటి సరఫరా సదుపాయాన్ని కల్పించనుంది. దీని ద్వారా సుమారు 14 లక్షల మంది కి ప్రయోజనం లభిస్తుంది.

 

దాదాపు గా 2000 కోట్ల రూపాయల విలువ కలిగిన రైల్ వే ప్రాజెక్టు లను ప్రధాన మంత్రి కార్యక్రమం లో భాగం గా దేశ ప్రజల కు అంకితం చేయనున్నారు. ఈ ప్రాజెక్టుల లో ఉరణ్-ఖార్‌కోపర్ రేల్ వే లైన్ యొక్క రెండో దశను అంకితం ఇవ్వడం కూడా ఒక భాగం గా ఉంది. ఈ ప్రాజెక్టు నవీ ముంబయి కి సంధానాన్ని వృద్ధి చెందింప చేస్తుంది. నేరుల్/బేలాపుర్ నుండి ఖార్‌కోపర్ ల మధ్య నడిచే శివారు సర్వీసుల ను ఇక మీదట ఉరణ్ వరకు పొడిగించడం జరుగుతుంది. ఉరణ్ రేల్ వే స్టేశన్ నుండి ఖార్‌కోపర్ వరకు రాకపోక లు జరిపే ఇఎమ్‌యు రైలు కు కూడా ప్రధాన మంత్రి జెండా ను చూపెట్టి ఆ రైలు యొక్క తొలి ప్రయాణాన్ని ప్రారంభించనున్నారు.

 

దేశ ప్రజల కు అంకితం చేయనున్న ఇతర రైలు ప్రాజెక్టుల లో ఠాణె-వాశీ/పన్‌ వేల్ ట్రాన్స్- హార్బర్ లైన్ లో వద్ద ఒక నూతన సబ్ అర్బన్ స్టేశన్ దీఘా గాఁవ్తో పాటు, ఖార్ రోడ్డు, ఇంకా గోరేగాఁవ్ రైల్ వే స్టేశన్ మధ్య నవీనమైన ఆరో మార్గం ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల తో ముంబయి కి నిత్యం రాకపోకల ను జరిపే వేల కొద్దీ ప్రయాణికుల కు ప్రయోజనం లభిస్తుంది.

 

 

సాంతాక్రుజ్ ఇలెక్ట్రానిక్ ఎక్స్‌ పోర్ట్ ప్రోసెసింగ్ జోన్-స్పెశల్ ఇకానామిక్ జోన్ (ఎస్ఇఇపిజెడ్ సెజ్) లో రత్నాభరణాల రంగం కోసం నిర్మాణం అయిన భారత రత్నమ్’ (మెగా కామన్ ఫెసిలిటేశన్ సెంటర్) ను ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. ఇది 3డి మెటల్ ప్రింటింగ్ సహా, ప్రపంచం లో లభ్యమవుతున్న అత్యుత్తమ యంత్రాల తో కూడిన దేశం లోని మొట్టమొదటిది అయిన ప్రాజెక్టు. దీని లో ఈ రంగం లోని నైపుణ్యం కలిగిన శ్రమికుల తో పాటు దివ్యాంగ విద్యార్థుల కు శిక్షణ ను ఇచ్చేటటువంటి ఒక పాఠశాల ను కూడా ఏర్పాటు చేయడమైంది. ఈ మెగా సిఎఫ్‌సి రత్నాభరణాల వ్యాపారం లో ఎగుమతుల రూపురేఖల ను మార్చివేయనుంది. దీనితో దేశీయ తయారీ ప్రక్రియ కు కూడా సాయం అందనుంది.

 

ఎస్ఇఇపిజెడ్ – ఎస్ఇజడ్ లో న్యూ ఎంటర్‌ప్రైజెస్ & సర్వీసెజ్ టవర్ (ఎన్ఇఎస్‌టి) - 01 ను కూడా ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. ఎన్ఇఎస్ టి-01 అనేది ప్రధానం గా రత్నాభరణాల రంగం లో భాగం గా ఉండే యూనిట్ లను ప్రస్తుతం, అవి నెలకొన్న స్టాండర్డ్ డిజైన్ ఫ్యాక్టరీ - 1 నుండి మరొక చోటు కు మార్చనున్నాయి. నూతన టవర్ ను పెద్ద సంఖ్య లో ఉత్పత్తి చేపట్టడం కోసం, మరి పరిశ్రమ యొక్క అవసరాల కు అనుగుణం గా ఉండడం కోసం నిర్మించడం జరిగింది.

 

కార్యక్రమం లో నమో మహిళా సశక్తీకరణ్ అభియాన్ను కూడా ప్రధాన మంత్రి ఇదే ప్రారంభిస్తారు. ఈ అభియాన్ మహారాష్ట్ర లో నైపుణ్యాభివృద్ధి సంబంధమైన శిక్షణ తోపాటు నవ పారిశ్రామికత్వ వికాసం తాలూకు మెలకువల ను బోధించి, మహిళల కు సాధికారిత ను కల్పించాలనే లక్ష్యం తో చేపట్టడమైంది. రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్ర ప్రభుత్వం మహిళాభివృద్ధి ప్రధాన కార్యక్రమాల ను కలిసికట్టు గా ముందుకు తీసుకుపోతూ, వాటి తాలూకు ప్రయోజనాల ను లబ్ధిదారులు అందరికీ అందేటట్లు చూసే క్రమం లో ఈ అభియాన్ ను లక్షించడమైంది.

 

27వ జాతీయ యువజనోత్సవం

దేశ అభివృద్ధి ప్రస్థానం లో యువత కు ఒక కీలకమైన స్థానాన్ని కట్టబెట్టాలి అన్నది ప్రధాన మంత్రి నిరంతర ప్రయాస గా ఉంటోంది. ఈ ప్రయాస లో మరొక భాగమా అన్నట్లు గా, ప్రధాన మంత్రి ఇరవై ఏడో జాతీయ యువజనోత్సవాన్ని (ఎన్ వైఎఫ్) నాసిక్ లో ప్రారంభించనున్నారు.

 

జాతీయ యువజనోత్సవాన్ని ప్రతి సంవత్సరం లో జనవరి 12 వ తేదీ మొదలుకొని 16 వ తేదీ వరకు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. జనవరి 12 వ తేదీ న స్వామి శ్రీ వివేకానంద యొక్క జయంతి. ఈసారి ఈ ఉత్సవాని కి ఆతిథేయి రాష్ట్రం గా మహారాష్ట్ర ఉంది. ఈ సంవత్సరం నిర్వహించే ఉత్సవం యొక్క ఇతివృత్తం గా వికసిత్ భారత్ @ 2024: యువా కే లియే యువా కె ద్వారా (Viksit Bharat@ 2047: युवा के लिए, युवा के द्वारा) అనేది ఉంది.

 

భారతదేశం లో వివిధ ప్రాంతాల కు చెందిన యువజనులు ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ భావన తో వారి అనుభవాల ను వ్యక్తం చేయడం కోసం మరియు కలిసికట్టు గా దేశం యొక్క పునాది ని బలపరచడం కోసం తగిన వేదిక ను అందించడం ఎన్‌వైఎఫ్ యొక్క సంకల్పం. దేశం అంతటి నుండి దాదాపు గా 7,500 మంది యువ ప్రతినిధులు నాసిక్ లో నిర్వహించే ఈ ఉత్సవం లో పాలుపంచుకోనున్నారు. ఈ ఉత్సవం లో భాగం గా సాంస్కృతిక ప్రదర్శనల ను, దేశవాళీ ఆటల ను, ప్రసంగం మరియు విషయగత ఆధారిత సమర్పణ, యువ కళాకారుల శిబిరం, పోస్టర్ లను తయారు చేయడం, కథా రచన, యువజన సమ్మేళనం, ఆహార పదార్థాల మహోత్సవం నిర్వహణ తదితర కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది.

 

***

 

 


(Release ID: 1995287) Visitor Counter : 153