వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత్-యూఏఈ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 2024లో భాగంగా భారత్-యూఏఈ బిజినెస్ సమ్మిట్ జరిగింది.


యూఏఈ - ఇండియా సి ఈ పీ ఏ కౌన్సిల్ వెబ్‌సైట్ సమ్మిట్‌లో ప్రారంభించబడింది

“అందుబాటు అవకాశాలు: ఇండియా- యుఎఇ స్టార్ట్-అప్ సంఘటిత వ్యవస్థ ” పేరుతో సిఐఐ ఇండియా-యుఎఇ స్టార్ట్-అప్ ఇనిషియేటివ్‌పై నివేదిక కూడా ప్రారంభించబడింది

భారతదేశం-యూఏఈ సి ఈ పీ ఏ అమల్లోకి వచ్చినప్పటి నుండి ద్వైపాక్షిక వాణిజ్యం 15% పెరిగింది

Posted On: 11 JAN 2024 11:57AM by PIB Hyderabad

వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 2024లో భాగంగా భారతదేశం మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి 10 జనవరి 2024న ఇండియా-యూఏఈ బిజినెస్ సమ్మిట్ జరిగింది.

 

యూఏఈ అధ్యక్షుడు హెచ్.హెచ్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 2024కి ముఖ్య అతిథిగా విచ్చేశారు, ఇది రెండు దేశాల మధ్య పెరుగుతున్న సహకారాన్ని మరియు బలపడుతున్న సంబంధాలను మరింత నొక్కి చెబుతుంది. భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, హెచ్.హెచ్. షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌కు ఘన స్వాగతం పలికారు మరియు భారతదేశం-యుఎఇ సంబంధాలను పెంపొందించడానికి ఆయన ఆలోచనలు మరియు ప్రయత్నాలను భారతదేశం గౌరవిస్తుందని వ్యాఖ్యానించారు.

 

ఇండియా-యుఎఇ బిజినెస్ సమ్మిట్ ప్రారంభ సెషన్‌లో కేంద్ర వాణిజ్యం మరియు పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజాపంపిణీ మరియు జౌళి శాఖ (ఇండియా) మంత్రి శ్రీ పీయూష్ గోయల్ విదేశీ వాణిజ్య శాఖ సహాయ మంత్రి, ఆర్థిక మంత్రిత్వ శాఖ  గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర రజనీకాంత్ పటేల్ తో పాటు  హెచ్. ఈ డా. థాని బిన్ అహ్మద్ అల్ జియోదీ కీలక ప్రసంగాలు చేశారు.  

 

శ్రీ పీయూష్ గోయల్, హెచ్. ఈ. డా. థానీ బిన్ అహ్మద్ అల్ జీయౌడీ, మరియు శ్రీ భూపేంద్ర రజనీకాంత్ పటేల్ ప్రారంభ సెషన్‌లో భాగంగా యూఏఈ - ఇండియా సి ఈ పీ ఏ కౌన్సిల్ వెబ్‌సైట్‌ను లాంఛనంగా ప్రారంభించారు. సెషన్ భారతదేశం యొక్క అభివృద్ధి చెందుతున్న స్టార్టప్ వ్యవస్థను హైలైట్ చేసింది మరియు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సి ఐ ఐ) నేషనల్ స్టార్టప్ కౌన్సిల్ మరియు సహ వ్యవస్థాపకుడు - స్నాప్‌డీల్ మరియు టైటాన్ క్యాపిటల్ చైర్మన్ శ్రీ కునాల్ బహ్ల్ కూడా ఉపన్యసించారు.

 

సి ఐ ఐ ఇండియా-యుఎఇ స్టార్ట్-అప్ ఇనిషియేటివ్‌పై “అందుబాటు అవకాశాలు: ఇండియా- యుఎఇ స్టార్ట్-అప్ సంఘటిత వ్యవస్థ ” పేరుతో ఒక నివేదిక కూడా సమ్మిట్ సందర్భంగా ప్రారంభించబడింది. ప్రారంభ సెషన్‌కు సి ఐ ఐ ప్రెసిడెంట్ మరియు టీ వీ ఎస్ సప్లై చైన్ సొల్యూషన్స్ లిమిటెడ్ చైర్మన్ శ్రీ ఆర్ దినేష్ అధ్యక్షత వహించారు మరియు హెచ్. ఈ  సుల్తాన్ అహ్మద్ బిన్ సులేయం, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ - డీ పీ వరల్డ్ మరియు లులు గ్రూప్ ఇంటర్నేషనల్ చైర్మన్ ఎం. ఏ . యూసఫ్ అలీ, భారతదేశంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలో పెట్టుబడులు పెట్టడానికి తమ ఆసక్తిని కనబర్చారు.

వాణిజ్య రుణాలు, పెట్టుబడుల సులభతరం మరియు రంగాల సహకారం వంటి రంగాలలో మరింత సహకారం కోసం భారతదేశం-యుఎఇ బిజినెస్ సమ్మిట్ కేంద్రీకృత చర్చ సెషన్‌ను  నిర్వహించింది. భారతదేశం మరియు యుఎఇ ప్రతినిధి బృందాలు ప్రభుత్వం మరియు పరిశ్రమల నుండి ప్రతినిధులు పాల్గొన్నారు. సెషన్‌లో భారతదేశ ఎగుమతిదారులకు మద్దతుగా యుఎఇ లో భారతదేశం ప్రతిపాదించిన వేర్‌హౌసింగ్ సదుపాయం భారత్ మార్ట్‌పై ప్రదర్శన ఉంది. భారతదేశం-యుఎఇ వాణిజ్యం 2022లో  85 బిలియన్ డాలర్లకు పెరిగింది, 2022-23 సంవత్సరానికి యుఎఇ భారతదేశం యొక్క మూడవ-అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా మరియు భారతదేశం యొక్క రెండవ అతిపెద్ద ఎగుమతి గమ్యస్థానంగా మారింది. ఫిబ్రవరి 2022లో, యుఎఇ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ( సి ఈ పీ ఏ)పై సంతకం చేసిన మొదటి దేశంగా భారతదేశం అవతరించింది. 1 మే 2022న  సి ఈ పీ ఏ అమల్లోకి వచ్చినప్పటి నుండి ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు 15% పెరిగింది.  సి ఈ పీ ఏ అనేది రెండు దేశాల మధ్య సహకారానికి కొత్త శకానికి నాంది పలికేందుకు మరియు దీర్ఘకాల సాంస్కృతిక, రాజకీయ మరియు ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడానికి రూపొందించబడిన ఒక మైలురాయి ఒప్పందం. ఇది 80% కంటే ఎక్కువ ఉత్పత్తి శ్రేణులపై సుంకాలను తగ్గించడానికి, వాణిజ్యానికి అడ్డంకులను తొలగించడానికి మరియు పెట్టుబడి మరియు జాయింట్ వెంచర్లకు కొత్త మార్గాలను రూపొందించడంలో సహాయపడింది.  సి ఈ పీ ఏ యొక్క మొదటి 12 నెలల్లో, ద్వైపాక్షిక చమురేతర వాణిజ్యం 50.5 బిలియన్ డాలర్లకు చేరుకుంది, ఇది అంతకు ముందు సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 5.8% వృద్ధిని సూచిస్తుంది. 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల చమురుయేతర వాణిజ్యం లక్ష్యంగా రెండు దేశాలు వేగంగా కదులుతున్నాయి. సరిహద్దు లావాదేవీల కోసం స్థానిక కరెన్సీల వినియోగాన్ని ప్రోత్సహించడానికి ఒక ఫ్రేమ్‌వర్క్ ఏర్పాటు కోసం అవగాహన ఒప్పందంపై సంబంధిత ఇండియా మరియు యుఎఇ సెంట్రల్ బ్యాంక్‌ల గవర్నర్లు జూలై 2023లో సంతకం చేశారు. స్థానిక కరెన్సీ సెటిల్‌మెంట్‌ను అభివృద్ధి చేయడం ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పరిష్కరించుకోవడానికి రెండు దేశాల మధ్య వ్యవస్థ పరస్పర విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది మరియు రెండు దేశాల ఆర్థిక వ్యవస్థల పటిష్టతను నొక్కి చెబుతుంది. పరస్పర వృద్ధి మరియు శ్రేయస్సు కోసం భారతదేశం-యుఎఇ ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలను వేగవంతం చేసే దిశగా యుఎఇ-ఇండియా బిజినెస్ సమ్మిట్ మరో ముందడుగు. 

***


(Release ID: 1995285) Visitor Counter : 173