కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
సరళీకృత ధృవీకరణ పథకం కిందకు మరో 37 ఉత్పత్తులు
ధృవీకరణ కోసం తీసుకునే సమయం 8 వారాల నుంచి 2 వారాలకు తగ్గింపు
మూల్యాంకనం రుసుము పూర్తిగా మాఫీ
प्रविष्टि तिथि:
02 JAN 2024 11:11AM by PIB Hyderabad
'డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్' (డాట్) సాంకేతిక విభాగమైన 'టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్ సెంటర్' (టెక్), 01 జనవరి 2024 నుంచి, సరళీకృత ధృవీకరణ పథకం (ఎస్‌సీఎస్) కిందకు మరో 37 ఉత్పత్తులను తీసుకువచ్చింది. దీనివల్ల
ధృవీకరణ కోసం పట్టే సమయం 8 వారాల నుంచి 2 వారాలకు తగ్గుతుంది, సులభతర వ్యాపారాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ ఉత్పత్తుల్లో మీడియా గేట్‌వే, ఐపీ భద్రత పరికరాలు, ఐపీ టెర్మినల్స్, ఆప్టికల్ ఫైబర్ లేదా తీగలు, ట్రాన్స్‌మిషన్ టెర్మినల్ సామగ్రి వంటివి ఉన్నాయి. ఇప్పుడు, ఎస్‌సీఎస్ కిందకు వచ్చిన ఉత్పత్తుల సంఖ్య 12 నుంచి 49కి పెరిగింది.
దీంతోపాటు, 01 జనవరి 2024 నుంచి ఎంటీసీటీఈ కింద సమర్పించిన 'ఎసెన్షియల్ రిక్వైర్‌మెంట్' (ఈఆర్) దరఖాస్తులకు జీసీఎస్, ఎస్‌సీఎస్ విభాగంతో సంబంధం లేకుండా నిర్వహణ రుసుమును మాత్రమే టెక్ వసూలు చేస్తుంది.
మూల్యాంకనం రుసుమును టెక్ పూర్తిగా మాఫీ చేసింది. దీనివల్ల, 'ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మాన్యుఫాక్చరర్' (OEM) లేదా దరఖాస్తుదారుకు భారీ ఉపశమనం కలిగిస్తుంది. ఎందుకంటే దరఖాస్తు రుసుములో ఇప్పుడు 80 శాతం పైగా తగ్గింపు లభిస్తుంది.
ప్రస్తుతం, ఎంటీసీటీఈ కింద 60 టెలికాం & నెట్‌వర్కింగ్ ఉత్పత్తులను గుర్తించారు.
***
(रिलीज़ आईडी: 1992439)
आगंतुक पटल : 296