హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వీర్‌బాల్ దివాస్‌ సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలోని గురుద్వారా శ్రీ బడిసంగత్ సాహిబ్ వద్ద కేంద్ర హోం మరియు సహకార మంత్రి శ్రీ అమిత్ షా దర్శనం చేసుకున్నారు. ఈ చారిత్రాత్మక గురుద్వారా లో గురు నానక్ దేవ్ జీ మరియు గురు తేగ్ బహదూర్ జీల ఆశీస్సులు కోరారు.


వీర్‌బాల్ దివస్‌లో జరిగే సత్సంగ్‌లో పాల్గొనడానికి ఇక్కడికి రావడం తన అదృష్టమని హోంమంత్రి చెప్పారు

వారి అమరవీరుల దినోత్సవాన్ని వీర్ బల్ దివస్‌గా ప్రకటిస్తూ, ప్రధాని మోదీ జీ వారి త్యాగం యొక్క గాథను దేశం మరియు ప్రపంచంలోని ప్రతి మూలకు వ్యాపింపజేశారు.

ధర్మం మరియు సత్యాన్ని రక్షించడానికి గురు గోవింద్ సుంఘ్‌జీన్ చిన్న వయస్సులో సాహిబ్జాడే చేసిన త్యాగాలు మనందరికీ రాబోయే యుగాలకు స్ఫూర్తినిస్తాయి.

వీర్ బాల్దివాస్ సందర్భంగా గురు గోవింద్ సింగ్ జీ యొక్క నలుగురు సాహిబ్జాదే మరియు మాతా గుజ్రీ జీకి శ్రీ అమిత్ షా ప్రణమిల్లారు

అత్యున్నత ధైర్యంతో వారు క్రూరమైన మొఘల్ పాలనకు వ్యతిరేకంగా నిలబడి, మతం మారడానికి నిరాకరించి, బలిదానం ఎంచుకున్నారు.

Posted On: 26 DEC 2023 4:15PM by PIB Hyderabad

ఈ రోజు వీర్ బాల్ దివస్ సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలోని గురుద్వారా శ్రీ బడిసంగత్ సాహిబ్ వద్ద కేంద్ర హోం మరియు సహకార మంత్రి శ్రీ అమిత్ షా  దర్శనం చేసుకున్నారు. ఈ చారిత్రాత్మక గురుద్వారా లో  గురు నానక్ దేవ్ జీ మరియు గురు తేగ్ బహదూర్ జీల ఆశీస్సులు కోరారు.

వీర్ బాల్ దివస్‌లో జరిగే సత్సంగ్‌లో పాల్గొనడానికి ఇక్కడకు రావడం తన అదృష్టమని కేంద్ర హోం మంత్రి ఎక్స్ ప్లాట్‌ఫారమ్‌లో తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

ధర్మాన్ని, సత్యాన్ని కాపాడేందుకు చిన్నతనంలోనే గురుగోవింద్‌సుంఘ్‌జీ సాహిబ్‌జాదే చేసిన త్యాగాలు మనందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని అన్నారు.

 ఎక్స్ (X )ప్లాట్‌ఫారమ్‌లోని మరో పోస్ట్‌లో, కేంద్ర హోం మరియు సహకార మంత్రి, శ్రీ అమిత్ షా వీర్ బల్ దివాస్ సందర్భంగా గురు గోవింద్ సింగ్ జీ యొక్క నలుగురు సాహిబ్జాడే మరియు మాతా గుజ్రీ జీకి నమస్కరించారు. అత్యున్నతమైన , వీరోచితంగా  ధైర్యంతో వారు క్రూరమైన మొఘల్ పాలనకు వ్యతిరేకంగా నిలబడి, మతం మారడానికి నిరాకరించి బలిదానం ఎంచుకున్నారని హోంమంత్రి చెప్పారు. వారి అసమానమైన పరాక్రమం రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. వారి అమరవీరుల దినోత్సవాన్ని వీర్‌బాల్ దివస్‌గా ప్రకటిస్తూ, ప్రధాని మోదీ జీ వారి త్యాగం యొక్క గాథను దేశం మరియు ప్రపంచంలోని ప్రతి మూలకు వ్యాపింపజేశారు.

 

***


(Release ID: 1990632) Visitor Counter : 111