ప్రధాన మంత్రి కార్యాలయం

కుమారుడిని ఉన్నత చదువుకోసం ఫ్నాన్స్కు పంపిన, ముద్ర రుణ లబ్ధిదారైన ఒంటరి మహిళ.


చేతితో కుట్టిన బొంతలను అమెరికా, కెనడాలకు ఎగుమతి చేస్తున్న, పి.ఎం. కౌశల్ వికాస్ యోజన కింది శిక్షణ పొందిన ముంబాయికి చెందిన మేఘన,.
ఈమె అందరికీ ప్రేరణ అన్న ప్రధానమంత్రి

Posted On: 16 DEC 2023 6:06PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర లబ్ధిదారులతో ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముచ్చటించారు..ఈ సందర్భంగా ప్రధానమంత్రి తెలంగాణా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ఘడ్,
మిజోరం రాష్ట్రాలలో వికసిత్ భారత్ సంకల్ప యాత్రను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.
మేఘన అనే మహిళ ముంబాయికి చెందిన వారు. ఆమె వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర లబ్ధిదారు. ఆమెకు క్యాటరింగ్ వ్యాపారం ఉంది. ఈమె ప్రధానమంత్రి తో మాట్లాడుతూ, ముద్ర యోజన ద్వారా తాను కేంద్ర ప్రభుత్వం నుంచి
రూ90,000 రుణం పొందినట్టు తెలిపారు. ఇది  క్యాటరింగ్ వ్యాపారానికి అవసరమైన వంటసామగ్రి కొనుగోలు చేసేందుకు ఉపయోగపడినట్టు తెలిపారు.దీనితో తాను తన వ్యాపారాన్ని ప్రారంభించి ముందుకు తీసుకువెళుతున్నానని తెలిపారు.
తన కుమారుడికి విద్యారుణం లభించిందని, ప్రస్తుతం అతను ఫ్రాన్స్లో చదువుతున్నాడని తెలిపారు. ముద్ర యోజన, స్వనిధి యోజనతో తాను తన క్యాటరింగ్ వ్యాపారాన్ని విస్తరించినట్టు ఆమె తెలిపారు.

రుణ దరఖాస్తు, సులభతర ప్రక్రియగా ఉందా లేదా అని ప్రధానమంత్రి ఆమెను అడిగినపుడు, తాను దరఖాస్తుచేసుకున్న 8 రోజులలోనే రుణాన్ని పొందినట్టు తెలిపారు. అలాగే తాను సక్రమంగా
రుణాన్ని తిరిగి చెల్లిస్తున్నట్టు తెలిపారు. సకాలంలో రుణ బకాయిలను స్వనిధి పథకం కింద చెల్లించే వారికి తక్కు వడ్డీరేటు ఉంటుందన్న విషయాన్ని తెలిపి, ఈ పథకం కింద ఇంకా ఏమైనా అదనపు రుణ మొత్తానికి దరఖాస్తుచేసుకున్నారా అన్న విషయాన్ని ప్రధానమంత్రి అడిగినపుడు,
తాను ఈ పథం కింద దరఖాస్తు చేసుకోనున్నట్టు తెలిపారు. తన క్యాటరింగ్ వ్యాపారంలో ఇప్పటికే పాతిక మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నట్టు మేఘన ప్రధానమంత్రి కి వివరించారు.

టైలరింగ్ కు సంబంధించి పి.ఎం. కౌశల్ వికాస్ యోజన కింద శిక్షణను పొందినట్టు  కూడా ఆమె తెఇలిపారు. ఇందులో 100 మంది మహిళలను నియమించి అమెరికా , కెనడాలకు చేతితో కుట్టిన బొంతలను ఎగుమతి చేస్తున్నట్టు తెలిపారు.
ప్రభుత్వ పథకాలను అందరికీ అందుబాటులోకి తెచ్చినందుకు ప్రధానమంత్రికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.  ప్రజలు ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకోవలసిందిగా ఆమె పిలుపునిచ్చారు. మేఘన సాధించిన విజయం
అందరికీ ప్రేరణనిస్తుందని ప్రధానమంత్రి అన్నారు. ఇలాంటి వారందరికీ సహాయపడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.

 

***



(Release ID: 1987390) Visitor Counter : 64