హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సూరత్ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా గుర్తించే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంపై ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపిన కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా


సూరత్ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయికి పెంచడం విదేశీ పర్యాటకులకు తలుపులు తెరుస్తుంది, విదేశీ వాణిజ్యాన్ని మెరుగుపరుస్తుంది

प्रविष्टि तिथि: 16 DEC 2023 12:33PM by PIB Hyderabad

సూరత్ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా గుర్తించే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంపై, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీకి కేంద్ర హోం & సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా కృతజ్ఞతలు తెలిపారు.

తన సంతోషాన్ని ఎక్స్‌ వేదికపై అమిత్‌ షా పంచుకున్నారు. “మెరిసే వజ్రాల వల్ల మాత్రమే కాదు, తన విభిన్న సంస్కృతి & ఘనమైన వారసత్వం వల్ల కూడా ప్రయాణికుల పాలిట నిధి వంటిది సూరత్‌. సూరత్ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయికి పెంచడం వల్ల విదేశీ పర్యాటకులకు తలుపులు తెరుచుకోవడంతోపాటు విదేశీ వాణిజ్యం కూడా పెరుగుతుంది. దీనిని అంతర్జాతీయ విమానాశ్రయంగా గుర్తించేందుకు కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నందుకు ప్రధాని నరేంద్ర మోదీకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు" అని శ్రీ అమిత్‌ షా ట్వీట్‌ చేశారు.


(रिलीज़ आईडी: 1987378) आगंतुक पटल : 117
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Gujarati , Tamil , Kannada