ప్రధాన మంత్రి కార్యాలయం
విజయ్ దివస్ నేపథ్యంలో అమరవీరులకు ప్రధానమంత్రి హృదయపూర్వక నివాళి
సాహస వీరుల పరాక్రమానికి భారత్ శిరసాభివందనం; వారి
అకుంఠిత దీక్షను దేశం సదా స్మరించుకుంటుంది: ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
16 DEC 2023 9:43AM by PIB Hyderabad
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ విజయ దివస్ సందర్భంగా 1971నాటి యుద్ధంలో కర్తవ్యబద్ధులై దేశానికి సేవలందిస్తూ అమరులైన వీర సైనికులకు హృదయపూర్వక నివాళి అర్పించారు.
ఈ మేరకు ‘ఎక్స్’ పోస్టు ద్వారా పంపిన సందేశంలో:
‘‘ఇవాళ విజయ్ దివస్ నేపథ్యంలో 1971నాటి యుద్ధంలో భారతదేశానికి నిర్ణయాత్మక విజయం అందించడం ద్వారా తమ కర్తవ్య నిబద్ధతను చాటుకున్న వీర సైనికులకు హృదయపూర్వక నివాళి అర్పిస్తున్నాను. వారి పరాక్రమం, అంకితభావం దేశానికి అపార గర్వకారణం. వారి త్యాగాలు, అకుంఠిత దీక్ష ప్రజల హృదయాల్లో, దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉంటుంది. ఆ వీరుల ధైర్యసాహసాలకు భారతదేశం శిరసాభివందనం చేస్తోంది. వారి అచంచల స్ఫూర్తిని సదా స్మరించుకుంటుంది.’’
***
DS/TS
(रिलीज़ आईडी: 1987304)
आगंतुक पटल : 141
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam