ప్రధాన మంత్రి కార్యాలయం
కేంద్రీయ విద్యాలయ వజ్రోత్సవాల సందర్భంగా ప్రస్తుత-పూర్వ విద్యార్థులు.. సిబ్బంది.. సహాయక సిబ్బందితో కూడిన కుటుంబానికి ప్రధాన మంత్రి శుభాకాంక్షలు
‘‘దేశ భవిష్యత్తును రూపుదిద్దడంలో కేంద్రీయ విద్యాలయాలది కీలక పాత్ర: ప్రధాన మంత్రి
Posted On:
15 DEC 2023 4:18PM by PIB Hyderabad
కేంద్రీయ విద్యాలయ వజ్రోత్సవాల సందర్భంగా ప్రస్తుత-పూర్వ విద్యార్థులు, ఉద్యోగులు, సహాయక సిబ్బంది, పూర్వ విద్యార్థులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ మేరకు ‘ఎక్స్’ పోస్టు ద్వారా పంపిన సందేశంలో:
‘‘కేంద్రీయ విద్యాలయ వజ్రోత్సవాల నేపథ్యంలో ప్రస్తుత-పూర్వ విద్యార్థులతోపాటు ఉద్యోగులు, సహాయక సిబ్బందితో కూడిన ఆ కుటుంబానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు! ఈ సుప్రసిద్ధ విద్యా సంస్థ సాధించిన అద్భుత విజయాలను అభినందించి, వేడుకలు చేసుకోవడానికి ఇంతకన్నా మంచి సందర్భం మరొకటి ఉండదు. ఇన్నేళ్లుగా లక్షలాది విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడం ద్వారా మన దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కేంద్రీయ విద్యాలయాలు కీలక పాత్ర పోషించాయి. విద్యార్థుల విద్యా ప్రతిభతోపాటు వారి వ్యక్తిత్వ సమగ్ర వికాసానికి ఈ విద్యాలయాల తోడ్పాటు ఎంతైనా అభినందనీయం’’ అని పేర్కొన్నారు.
(Release ID: 1986987)
Visitor Counter : 106
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali-TR
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam