ప్రధాన మంత్రి కార్యాలయం

భారత్-కొరియా దౌత్య సంబంధాల స్వర్ణోత్సవంపై ప్రధాని హర్షం


గణతంత్ర కొరియా అధ్యక్షుడికి హృదయపూర్వక శుభాకాంక్షలు

Posted On: 10 DEC 2023 12:23PM by PIB Hyderabad

భారత్-గణతంత్ర కొరియాల మధ్య దౌత్య సంబంధాలకు నేటితో 50 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఆ దేశాధ్యక్షుడు గౌరవనీయ యూన్ సుక్ యోల్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రెండు దేశాల మధ్య పరస్పర గౌరవం, ఉమ్మడి విలువలు, భాగస్వామ్య విస్తరణలతో కూడిన స్నేహబంధాన్ని కొనియాడారు. ఈ సందర్భంగా ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత లోతుగా విస్తరించే దిశగా గౌరవనీయ యూన్ సుక్ యోల్‌తో సంయుక్తంగా కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నామని శ్రీ మోదీ ప్రకటించారు.

 

మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“భారత్-గణతంత్ర కొరియాల మధ్య దౌత్య సంబంధాల స్వర్ణోత్సవ సందర్భాన్ని వేడుక చేసుకుంటున్నాం. ఇది పరస్పర గౌరవం, ఉమ్మడి విలువలు, ఇనుమడిస్తున్న భాగస్వామ్యంతో కూడిన సౌహార్ద ప్రయాణం. ఈ నేపథ్యంలో గణతంత్ర కొరియా అధ్యక్షుడు గౌరవనీయ యూన్ సుక్ యోల్‌కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన రెండు దేశాల ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా లోతుగా విస్తరించడంలో మీతో కలసి ముందడుగు వేయడానికి సదా సిద్ధంగా ఉంటాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

******



(Release ID: 1985880) Visitor Counter : 78