ప్రధాన మంత్రి కార్యాలయం

370 వ అధికరణాన్ని రద్దు చేయడం అనే అంశం లో సర్వోన్నత న్యాయస్థానం చేసిన ఉత్తరువు చరిత్రాత్మకం గా ఉంది: ప్రధాన మంత్రి


క్రింద కు పడి తిరిగి లేచి నిల్చొన్న జమ్ము, కశ్మీర్ మరియు లద్దాఖ్ ల లోని ప్రజల కు హామీ ని ప్రధాన మంత్రి ఇచ్చారు

Posted On: 11 DEC 2023 12:48PM by PIB Hyderabad

మూడు వందల డెబ్భయ్యో అధికరణాన్ని రద్దు చేయడం అనే అంశం పై సర్వోన్నత న్యాయస్థానం యొక్క నిర్ణయం చరిత్రాత్మకమైంది గా ఉంది, అంతేకాదు 2019 వ సంవత్సరం లో ఆగస్టు 5 వ తేదీ నాడు భారతదేశం యొక్క పార్లమెంటు ద్వారా తీసుకొన్నటువంటి నిర్ణయాన్ని రాజ్యాంగబద్ధంగా పరిరక్షించింది కూడా ను అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

 

 

న్యాయస్థానం తనకు గల అపారమైనటువంటి జ్ఞానం తో ఏకత్వం యొక్క సారాన్ని బలపరచిందని, ఏకత్వం యొక్క మూల సారాన్ని భారతదేశం లో పౌరులు గా ఉన్నటువంటి మనం మిగతా అన్ని అంశాల కంటే ఎంతో ఉన్నతమైంది గా భావించడం తో పాటు గా దాని ని పదిలపరచుకొంటున్నాం కూడా అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

 

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

 ఆర్టికల్ 370 వ అధికరణాన్ని రద్దు చేయడం అనే అంశం లో సర్వోన్నత న్యాయస్థానం తీసుకొన్న నేటి నిర్ణయం చరిత్రాత్మకం గా ఉంది. ఇది 2019 వ సంవత్సరం లో ఆగస్టు 5 వ తేదీ నాడు భారతదేశం యొక్క పార్లమెంటు ద్వారా తీసుకొన్నటువంటి నిర్ణయాన్ని రాజ్యాంగబద్ధం గా పరిరక్షించింది; ఇది జమ్ము, కశ్మీర్ మరియు లద్దాఖ్ ల లోని మన సోదరీమణుల మరియు మన సోదరుల యొక్క ఆశ, ప్రగతి, ఇంకా ఏకత్వాల తాలూకు తిరుగులేని అటువంటి ప్రకటన గా కూడా ను ఉంది. న్యాయస్థానం తన అపారమైనటువంటి జ్ఞానం తో, ఏకత్వం యొక్క మూల సారాన్ని బలపరచింది. భారతదేశం లో పౌరులు గా మనం ఏకత్వం యొక్క మూల సారాన్ని మిగిలిన అన్నిటి కంటే ప్రియమైంది గా మరియు ఉన్నతమైంది గా భావించడం తో పాటు గా పదిలపరచుకొంటున్నాం.

 

 

అనేక విపత్కర పరిస్థితుల ను తట్టుకొని మనుగడ ను సాగిస్తున్నటువంటి జమ్ము, కశ్మీర్ మరియు లద్దాఖ్ ల ప్రజల కు నేను ఇవ్వదలచుకొన్న హామీ ఏమిటి అంటే అది మీ యొక్క కలల ను నెరవేర్చడం పట్ల మా నిబద్ధత అచంచలమైంది అనేదే. ప్రగతి తాలూకు ఫలాలు మీ చెంతకు చేరుకోవడం ఒక్కటే కాకుండా, ఆ ప్రయోజనాల ను మన సమాజం లో 370 వ అధికరణం కారణం గా యాతన లు పడ్డ ఆ అందరి కంటే బలహీనమైన వర్గాల వారి కి మరియు నిరాదరణ కు గురి అయిన వర్గాల వారి కి సైతం అందేటట్లు గా పూచీ పడడాని కి కూడా ను మేం కంకణం కట్టుకొన్నాం.

 

 

ఈ రోజు న వెలువడ్డ నిర్ణయం  ఒక చట్టపరమైనటువంటి దస్తావేజు పత్రం మాత్రమే కాదు, ఇది ఆశ యొక్క ఒక పెద్ద కిరణం గా కూడాను ఉంది. దీనిలో  ఉజ్వల భవిష్యత్తు తాలూకు వాగ్దానం ఇమిడి ఉంది , దీనితో పాటే ఒక బలమైనటువంటి మరియు ఇప్పటి కంటే ఎక్కువ ఐకమత్యం తో కూడి ఉండే భారతదేశాన్ని నిర్మించాలన్న మన సామూహిక సంకల్పం కూడా దీని లో ఉంది. 

#NayaJammuKashmir’’ అని పేర్కొన్నారు.

 

"आर्टिकल 370 हटाने को लेकर सुप्रीम कोर्ट का आज का निर्णय ऐतिहासिक हैजो अगस्त, 2019 को संसद में लिए गए फैसले पर संवैधानिक मुहर लगाता है। इसमें जम्मूकश्मीर और लद्दाख के हमारे भाई-बहनों के लिए उम्मीदउन्नति और एकता का एक सशक्त संदेश है। माननीय कोर्ट के इस फैसले ने हमारी राष्ट्रीय एकता के मूल भाव को और मजबूत किया हैजो हर भारतवासी के लिए सर्वोपरि है।

 

मैं जम्मूकश्मीर और लद्दाख के अपने परिवारजनों को विश्वास दिलाना चाहता हूं कि आपके सपनों को पूरा करने के लिए हम हर तरह से प्रतिबद्ध हैं। हम यह सुनिश्चित करने के लिए संकल्पबद्ध हैं कि विकास का लाभ समाज के हर वर्ग तक पहुंचे। आर्टिकल 370 का दंश झेलने वाला कोई भी व्यक्ति इससे वंचित ना रहे।

 

आज का निर्णय सिर्फ एक कानूनी दस्तावेज ही नहीं हैबल्कि यह आशा की एक बड़ी किरण भी है। इसमें उज्ज्वल भविष्य का वादा हैसाथ ही एक सशक्त और एकजुट भारत के निर्माण का हमारा सामूहिक संकल्प भी है।

 

#NayaJammuKashmir"

 

 

 

***

DS/ST



(Release ID: 1985421) Visitor Counter : 93