ప్రధాన మంత్రి కార్యాలయం

ఫ్రాన్స్ లోని సెర్గీ లో ఏర్పాటు చేసిన తిరువళ్ళువర్ యొక్క విగ్రహం ఫ్రాన్స్ కు మరియు భారతదేశాని కి మధ్య ఉమ్మడి సాంస్కృతిక బంధానికి ఒక సుందరమైన ప్రమాణం గా ఉంది: ప్రధాన మంత్రి

Posted On: 10 DEC 2023 8:10PM by PIB Hyderabad

ఫ్రాన్స్ లోని సెర్గీ లో ఏర్పాటు చేసిన తిరువళ్ళువర్ యొక్క విగ్రహం ఫ్రాన్స్ కు మరియు భారతదేశాని కి మధ్య గల ఉమ్మడి సాంస్కృతిక బంధాని కి ఒక సుందరమైన ప్రమాణం గా ఉంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

  

ఫ్రాన్స్ లో ఓ పట్టణం అయిన సెర్గీ యొక్క మేయరు శ్రీ జీన్-పాల్ జీండన్ తిరువళ్ళువర్  విగ్రహం యొక్క ప్రారంభ కార్యక్రమాన్ని కళ్ళకు కట్టే కొన్ని ఛాయాచిత్రాల ను విడుదల చేశారు.

 

శ్రీ జీన్-పాల్ జీండన్ ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన సమాచారం పట్ల ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ -

‘‘ఫ్రాన్స్ లోని సెర్గీ లో ఏర్పాటైన తిరువళ్ళువర్ విగ్రహం మన ఉమ్మడి సాంస్కృతిక బంధాని కి ఒక సుందరమైన సంకేతం గా ఉంది.  జ్ఞానాని కి మరియు ప్రజ్ఞ కు ఒక సమున్నతమైనటువంటి ప్రతీక గా తిరువళ్ళువర్ నిలచారు.  ఆయన యొక్క రచన లు ప్రపంచం అంతటా లక్షల కొద్దీ ప్రజల కు ప్రేరణ ను ఇస్తున్నాయి’’ అని ఎక్స్ మాధ్యం లో పేర్కొన్నారు.



(Release ID: 1985417) Visitor Counter : 97