ప్రధాన మంత్రి కార్యాలయం

కాశ్మీర్‌లో శుభ ఆచారాలతో ‘మోదీ కి గ్యారెంటీ కి గాడీ’కి స్వాగతం


జమ్మూ, కాశ్మీర్‌లోని షేక్ పురా నుండి విబిఎస్వై లబ్ధిదారుడైన పాల విక్రేత శ్రీమతి నజియా నజీర్‌తో సంభాషించిన ప్ర‌ధాన మంత్రి

"జమ్మూ, కాశ్మీర్‌లో విబిఎస్వై పట్ల ఉన్న ఉత్సాహం దేశవ్యాప్తంగా సానుకూల సందేశాన్ని పంపుతుంది: ప్రధానమంత్రి"

Posted On: 09 DEC 2023 2:47PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర (విబిఎస్వై) లబ్ధిదారులతో సంభాషించారు. ఈ పథకాల ప్రయోజనాలు నిర్దేశిత లబ్ధిదారులందరికీ సమయానుకూలంగా చేరేలా చూడడం ద్వారా ప్రభుత్వ ప్రధాన పథకాల సంతృప్తిని పొందేందుకు దేశవ్యాప్తంగా విక్షిత్ భారత్ సంకల్ప్ యాత్ర చేపట్టారు.

జమ్మూ, కాశ్మీర్‌లోని షేక్ పురా నుండి పాల విక్రేత, విబిఎస్వై లబ్ధిదారురాలు శ్రీమతి నజియా నజీర్‌తో సంభాషిస్తూ, ప్రధాన మంత్రి ఆమె కుటుంబ సభ్యుల గురించి అడిగారు. తన భర్త ఆటోడ్రైవర్‌ అని, తన ఇద్దరు పిల్లలు యూటీలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారని ఆమె బదులిచ్చారు.

గత సంవత్సరాలతో పోల్చితే తన గ్రామంలో స్పష్టమైన మార్పుల గురించి ప్రధాన మంత్రి అడిగినప్పుడు, నజియా నజీర్, ఒకప్పుడు నీటి సమస్యలు ఉన్న వారి ఇళ్లకు ఇప్పుడు పరిశుభ్రమైన, సురక్షితమైన నీటి సరఫరాతో కుళాయిలు వచ్చాయని, జల్ జీవన్ మిషన్ తమ కథను మలుపు తిప్పిందని అన్నారు. ఉజ్వల యోజన కింద గ్యాస్ కనెక్షన్ల ప్రయోజనాలు, పీఎంజికేఏవై ను మరో 5 సంవత్సరాలు పొడిగించినందుకు ఆమె ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ మోదీ తన గ్రామంలో విబిఎస్వై వ్యాన్ అనుభవం, ప్రభావం గురించి కూడా అడిగి తెలుసుకున్నారు. కాశ్మీరీ సంస్కృతి ప్రకారం పవిత్రమైన సందర్భాలలో నిర్వహించే ఆచారాల ద్వారా ప్రజలు దీనిని స్వాగతిస్తున్నారని ఆమె బదులిచ్చారు.

శ్రీమతి నజియా నజీర్‌తో సంభాషించడంపై ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా తమ పిల్లలను చదివించి, దేశాభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగుతున్న కాశ్మీర్‌లోని మహిళా శక్తిపై విశ్వాసం వ్యక్తం చేశారు. జమ్మూ, కాశ్మీర్‌లో విబిఎస్వై పట్ల ఉన్న ఉత్సాహం దేశంలోని ఇతర ప్రాంతాలకు సానుకూల సందేశాన్ని పంపుతుందని పేర్కొంటూ, "మీ ఉత్సాహం నా బలానికి మూలం" అని అన్నారు. కొత్త తరాల ఉజ్వల భవిష్యత్తుకు ఇది హామీ అని ఆయన అన్నారు. దేశం నలుమూలల నుండి ప్రజలు అభివృద్ధి బాటలో చేరడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. జమ్మూ, కాశ్మీర్ ప్రజల సహకారాన్ని కొనియాడారు.

 

***



(Release ID: 1984834) Visitor Counter : 42