సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఢిల్లీలో విక్షిత్ భారత్ సంకల్ప్ యాత్ర రీ సఫ్దర్‌జంగ్ ఎన్‌క్లేవ్ సమీపంలోని హుమాయుపూర్‌లో లబ్ధిదారులతో మాట్లాడిన సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి శ్రీ అపూర్వ చంద్ర

Posted On: 06 DEC 2023 4:17PM by PIB Hyderabad

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించి, అర్హులైన వారికి పథకాల ప్రయోజనాలు అందేలా చూసేందుకు విక్షిత్ భారత్ సంకల్ప్  యాత్ర  ఢిల్లీలో  వివిధ ప్రదేశాలతో సహా వివిధ నగరాల్లో జరిగింది.   ఇప్పటి వరకు వికాసిత్ భారత్ ఐఈసి  వ్యాన్‌లు ఢిల్లీలోని వివిధ జిల్లాల్లో 85 ప్రాంతాల్లో జరిగింది.అవగాహన కార్యక్రమంలో భాగంగా  పీఎం స్వానిధి, ముద్ర రుణాలు , స్టాండ్ అప్ ఇండియా, స్టార్ట్ అప్ ఇండియా, డిజిటల్ చెల్లింపులు, , పీఎం ఈ బస్ సేవ, ఆయుష్మాన్ భారత్, పీఎం ఆవాస్  (అర్బన్) ప్రధానమంత్రి ఉజ్వల యోజన వంటి సంక్షేమ పథకాల గురించి అవగాహన కల్పించారు. 

కేంద్ర సమాచార , ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అపూర్వ చంద్ర ఈరోజు దక్షిణ ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఎన్‌క్లేవ్‌లోని హుమాయుపూర్‌లో విక్షిత్ భారత్ సంకల్ప్ యాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ పథకాల లబ్ధిదారులతో ఆయన విక్షిత్ భారత్ ప్రతిజ్ఞ చేయించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను ప్రజలకు చేరవేయడం యాత్ర లక్ష్యమని కార్యదర్శి తెలిపారు. జనవరి నెలాఖరు నాటికి 2.60 లక్షల గ్రామ పంచాయతీలు, 3,600 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో ప్రచార కార్యక్రమాలు జరుగుతాయన్నారు. దేశవ్యాప్తంగా రెండు వేలకు పైగా వ్యాన్‌లు పనిచేస్తున్నాయని ఆయన చెప్పారు.

 ప్రచారంలో భాగంగా ప్రత్యేకంగా రూపొందించిన 5 ఐఈసి  (ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్) వ్యాన్‌లు ఢిల్లీలోని 11 జిల్లాల్లో తీరుతున్నాయి. 600 కి పైగా ప్రాంతాలలో కార్యక్రమాలు నిర్వహిస్తారు.

కార్యక్రమంలో భాగంగా తక్షణ సేవలు అందించేందుకు కార్యక్రమాలు జరుగుతున్నాయి. పీఎం స్వనిధి ,ఆరోగ్య , ఆయుష్మాన్ కార్డ్, ఆధార్ అప్‌డేషన్ క్యాంప్, పీఎం ఉజ్వల వంటి  సేవలు కార్యక్రమం జరుగుతున్న ప్రాంతంలో అందిస్తున్నారు.   సేవలు పొందేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఈ శిబిరాలను సందర్శిస్తున్నారు.

నవంబర్ 15న జార్ఖండ్‌లోని ఖుంటిలో జనజాతీయ గౌరవ్ దివస్ సందర్భంగా వికాసిత్ భారత్ సంకల్ప్ యాత్ర ను ప్రధానమంత్రి శ్రీ  నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. నవంబర్ 28న లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ  నీకే సక్సేనా ఢిల్లీ పట్టణ ప్రచారాన్ని ప్రారంభించారు.

***


(Release ID: 1983615) Visitor Counter : 93