ప్రధాన మంత్రి కార్యాలయం

‘ట్రాన్స్‌ఫార్మింగ్ క్లయిమేట్ ఫైనాన్స్’ అంశం పై సిఒపి-28 ప్రెసిడెన్సీ యొక్క సమావేశం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

Posted On: 01 DEC 2023 6:24PM by PIB Hyderabad

యోర్ హైనెసెస్ ,

 


ఎక్స్‌లన్సిజ్ ,



భారతదేశం జి-20 కి అధ్యక్షత ను వహించిన కాలం లో, సుస్థిరమైన అభివృద్ధి మరియు జలవాయు పరివర్తన అనే రెండు అంశాల కు అగ్ర ప్రాధాన్యాన్ని కట్టబెట్టింది.

 


మనం ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తుసూత్రాన్ని మా యొక్క అధ్యక్ష పదవీ కాలాని కి మూలాధారం గా తీసుకొన్నాం.


మరి ఉమ్మడి ప్రయాస ల ద్వారా, అనేక అంశాల లో సర్వసమ్మతి ని సాధించడం లో సైతం మనం సఫలం అయ్యాం.

 


మిత్రులారా,



భారతదేశం సహా, వికాస శీల దేశాలు (గ్లోబల్ సౌథ్) అన్నీ పోషించినటువంటి పాత్ర జలవాయు పరివర్తన విషయం లో చాలా తక్కువ గా ఉంది అనేది మనకు అందరికీ తెలిసిందే.

 


అయితే, జలవాయు పరివర్తన తాలూకు ప్రభావాలు ఆ దేశాల పైన చాలా ఎక్కువ గా ఉన్నాయి. వనరుల లేమి తో సతమతం అవుతూ ఉండి కూడా ఈ దేశాలు జలవాయు సంబంధి కార్యాచరణ కు కట్టుబడి ఉన్నాయి.

 


వికాస శీల దేశాల మహత్వాకాంక్ష లు నెరవేరాలి అంటే జలవాయు పరివర్తన, ఇంకా సాంకేతిక విజ్ఞానం చాలా అవసరం అని చెప్పాలి.

 

జలవాయు పరివర్తన తో పోరాడడాని కి గాను అభివృద్ధి చెందిన దేశాల సాయం తమకు అవసరపడుతుంది అని వికాస శీల దేశాలు అపేక్షిస్తున్నాయి.

 

ఇది స్వాభావికం, న్యాయోచితమూను.


మిత్రులారా,

జలవాయు సంబంధి కార్యాచరణ కు 2030 వ సంవత్సరానికల్లా ట్రిలియన్ కొద్దీ డాలర్ ల మేర కు క్లయిమేట్ ఫైనాన్స్ అవసరం అనే సంగతి ని జి-20 లో అంగీకరించడం జరిగింది.


ఆ క్లయిమేట్ ఫైనాన్స్ లభ్యత, ఆచరణీయత మరియు స్థోమత ల పరం గా కీలకం.


యుఎఇ యొక్క క్లయిమేట్ ఫైనాన్స్ ఫ్రేమ్ వర్క్ కార్యక్రమం ఈ దిశ లో దోహద పడుతుంది అని నేను ఆశిస్తున్నాను.


లాస్ ఎండ్ డేమిజ్ ఫండ్ ను కార్యరంగం లోకి తీసుకు రావాలని నిన్నటి రోజు న చేసినటువంటి చరిత్రాత్మకమైన నిర్ణయాన్ని భారతదేశం స్వాగతిస్తున్నది.

దీని తో సిఒపి-28 సమిట్ లో ఒక క్రొత్త ఆశ ను చిగురింప చేసింది.

క్లయిమేట్ ఫైనాన్స్ సంబంధి ఇతర అంశాల లో కూడా సిఒపి సమిట్ నిర్ధిష్టమైనటువంటి ఫలితాల ను ప్రసాదిస్తుంది అని మనం ఆశిద్దాం.


ఇక్కడ నాలుగు విషయాలు ఉన్నాయి.. వాటిలో ఒకటోది ఏమిటి అంటే, సిఒపి-28 లో న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్ ఆన్ క్లయిమేట్ ఫైనాన్స్ విషయం లో వాస్తవిక పురోగతి ఉంటుంది అనేదే.

 

రెండోది ఏమిటి అంటే, గ్రీన్ క్లయిమేట్ ఫండ్ లో మరియు అడేప్టేశన్ ఫండ్ లో ఎటువంటి క్షీణత ను చోటు చేసుకోనీయడం జరుగదు, ఈ ఫండ్ లను వెనువెంటనే భర్తీ చేయడం జరుగుతుంది అనేదే.


ఇక మూడోది ఏమిటి అంటే, మల్టీలేటరల్ డెవలప్‌మెంట్ బ్యాంక్స్ అనేవి అభివృద్ధి తో పాటుగా జలవాయు సంబంధి కార్యాచరణ కు గాను భరించగలిగే స్థాయి లో ఆర్థిక సహాయాన్ని అందించనున్నాయి అనేదే.

మరి, నాలుగో అంశాని కి వస్తే, అది ఏమిటంటే అభివృద్ధి చెందిన దేశాలు 2050 వ సంవత్సరాని కంటే ముందు గానే వాటి యొక్క కర్బన పాద ముద్ర ను తప్పక తొలగిస్తాయి అనేదే.


ఒక క్లయిమేట్ ఇన్‌వెస్ట్‌మెంట్ ఫండ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు గా యుఎఇ చేసిన ప్రకటన ను కూడా నేను ఆహ్వానించడమే కాకుండా వారి కి అభినందనల ను తెలియ జేస్తున్నాను.
మీకు అందరికీ అనేకానేక ధన్యవాదాలు.

అస్వీకరణ: ఇది ప్రధాన మంత్రి పత్రికా ప్రకటన కు రమారమి అనువాదం. సిసలు పత్రికా ప్రకటన హిందీ భాష లో ఉండింది.

***

 



(Release ID: 1982853) Visitor Counter : 101