ప్రధాన మంత్రి కార్యాలయం

జమ్మూలోని సరిహద్దు ప్రాంతానికి చెందిన సర్పంచ్‌ అంకితభావానికి ప్రధాన మంత్రి ప్రశంసలు


"ప్రయోజనాలన్నీ చివరి వ్యక్తికి అందేలా చూస్తాం.' మోడీ గ్యారెంటీ' వాహనం ప్రతి గ్రామానికి వెళ్తుంది"

Posted On: 30 NOV 2023 1:25PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా వికసిత్ భారత్ సంక‌ల్ప్ యాత్ర ల‌బ్దిదారుల‌తో సంభాషించారు. ప్రధాన మంత్రి మహిళా కిసాన్ డ్రోన్ కేంద్రాన్ని కూడా ఆయన ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మం వేదికగా, ప్ర‌ధాన మంత్రి దేవఘర్ ఎయిమ్స్ లో అధిగమించిన  మైలురాయి 10,000వ జన్ ఔషధి కేంద్రాన్ని అంకితం చేశారు. ఇంకా, దేశంలో జన్ ఔషధి కేంద్రాల సంఖ్యను 10,000 నుండి 25,000కి పెంచే కార్యక్రమాన్ని కూడా శ్రీ మోదీ ప్రారంభించారు. ఈ ఏడాది ప్రారంభంలో తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు డ్రోన్‌లను అందించడం, జన్ ఔషధి కేంద్రాల సంఖ్యను 10,000 నుండి 25,000కి పెంచడం వంటి ఈ రెండు కార్యక్రమాలను ప్రధాని ప్రకటించారు. ఈ వాగ్దానాలను నేడు నెరవేరుస్తూ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్, ఫార్మ్ మెషినరీ బ్యాంక్ స్కీమ్, కిసాన్ సమ్మాన్ నిధి యోజన వంటి బహుళ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను తాను పొందినట్లు రంగ్‌పూర్ గ్రామ సర్పంచ్, జమ్మూ జిల్లాలోని అర్నియాకు చెందిన రైతు శ్రీమతి బల్వీర్ కౌర్ ప్రధానికి తెలియజేశారు. తన గ్రామం సరిహద్దుకు సమీపంలో ఉందని ఆమె తెలిపారు. కిసాన్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి కొనుగోలు చేసిన ట్రాక్టర్ యజమాని అయినందుకు శ్రీ మోదీ ఆమెను అభినందించారు.

ఆమె చేతి వేళ్ళను లెక్కించేలా తన ప్రాంతం డేటాను కలిగి ఉండడాన్ని ప్రధాని ఆమెను అభినందించారు, ఆమె బదులిస్తూ 'ఆప్ సే హి సీఖా హై గ్రాస్ రూట్ పార్ కామ్ కర్నా. కామ్ కర్తీ హూన్ ఔర్ భూల్తీ నహీ హూన్.” (అట్టడుగు స్థాయిలో పని చేయడం, పని వివరాలను మరచిపోకుండా చేయడం నేను మీ నుండి నేర్చుకున్నాను). ప్రభుత్వ పథకాలను సంతృప్తి స్థాయిలో తీసుకెళ్లడం, అమలు చేయడం గురించి అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు. శ్రీమతి కౌర్‌కు చుట్టుపక్కల పది గ్రామాలకు చేరుకుని ప్రచారం చేయాలని సూచించారు. క్యూలో నిలబడిన చివరి వ్యక్తికి అన్ని ప్రయోజనాలు చేరుతాయన్న నమ్మకాన్ని ప్రధాని నొక్కి చెప్పారు. ప్ర‌ధాన మంత్రి వికసిత్ భార‌త్ సంక‌ల్ప యాత్ర ఉద్దేశ్యంపై మాట్లాడుతూ, ప్ర‌స్తుతం ఉన్న ల‌బ్దిదారుల అనుభ‌వాల నుండి నేర్చుకోవాల‌ని, ఇంకా ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌ని వారిని కూడా దీనిలో కలిపించడం  దీని ఉద్దేశ్యం అని అన్నారు.

 

***



(Release ID: 1981350) Visitor Counter : 48