ప్రధాన మంత్రి కార్యాలయం

వికసిత్ భారత్సంకల్ప్ యాత్ర యొక్క లబ్ధిదారుల తో నవంబరు 30 వ తేదీ న సమావేశమై మాట్లాడనున్న ప్రధాన మంత్రి


మహిళల నాయకత్వం లో అభివృద్ధి సాధన దిశ లో ఒక ముఖ్యమైనఅడుగు ను వేస్తూ, ప్రధాన మంత్రి మహిళా కిసాన్ డ్రోన్ కేంద్రాన్ని  ప్రారంభించనున్న ప్రధాన మంత్రి

రాబోయే మూడు సంవత్సరాల  లో మహిళా ఎస్‌హెచ్‌జి స్ కు 15,000 డ్రోన్ లను అందజేయడం జరుగుతుంది

10,000 వ జన్ ఔషధి కేంద్రాన్ని ఎఐఐఎమ్ఎస్ దేవ్‌ఘర్ లో దేశ ప్రజల కు అంకితం చేయనున్న ప్రధాన మంత్రి

దేశం లో జన్ ఔషధి కేంద్రాల సంఖ్య ను 10,000 నుండి 25,000 కు పెంచేందుకు ఉద్దేశించిన ఒక కార్యక్రమాన్ని కూడా ప్రారంభించనున్న ప్రధానమంత్రి

ఈ రెండు కార్యక్రమాలు ఈ ఏడాది స్వాతంత్య్ర దినంసందర్భం లో ప్రధాన మంత్రి చేసిన ప్రసంగం లో భాగం గా ప్రకటించిన వాగ్ధానాల ను నెరవేర్చడాన్నిసూచించేటటువంటివే 

Posted On: 29 NOV 2023 11:59AM by PIB Hyderabad

వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రయొక్క లబ్ధిదారుల తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నవంబరు 30 వ తేదీ నాడు ఉదయం 11 గంటల కు వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా సమావేశమై, మాట్లాడనున్నారు. ప్రభుత్వం యొక్క కీలకమైన కార్యక్రమాల ప్రయోజనాలను అర్హులైన అందరికీ సమయబద్ధమైన రీతి న అందించాలి అనే లక్ష్య సాధన కై దేశవ్యాప్తం గా వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర ను చేపట్టడం జరుగుతున్నది.

 

 

మహిళల నాయకత్వం లో అభివృద్ధి సాధన కు పూచీ పడాలి అనేది ప్రధాన మంత్రి నిరంతర ప్రయాస గా ఉన్నది. ఈ దిశ లో మరొక ముందంజా అన్నట్లు గా ప్రధాన మంత్రి తాజా గా ‘ప్రధాన మంత్రి మహిళా కిసాన్ డ్రోన్ కేంద్ర’ ను ప్రారంభించనున్నారు. ఈ పథకం మహిళా స్వయం సహాయ సమూహాల (ఎస్‌హెచ్‌జి స్) కు డ్రోన్ లను అందిస్తుంది. తద్ద్వారా ఈ సాంకేతికత ను వారు ఉపయోగించుకొని, బ్రతుకు తెరువు పరమైన సహాయాన్ని పొందగలుగుతారన్నమాట. రాబోయే మూడు సంవత్సరాల లో 15,000 డ్రోన్ స్ ను మహిళా స్వయం సహాయ సమూహాల కు అందించడం జరుగుతుంది. డ్రోన్ స్ ను ఉపయోగించడం లో అవసరమైన శిక్షణ ను సైతం మహిళల కు అందించడం జరుగుతుంది. వ్యవసాయం లో సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకోవడాన్ని ఈ కార్యక్రమం ప్రోత్సహిస్తుంది.

 

స్వాస్థ్య సంరక్షణ ను అందరికి అందుబాటు లోకి తీసుకు రావాలి; మరి ఆరోగ్య సంరక్షణ ను సులభ పద్ధతి లో అందరి చెంతకు చేర్చాలి అనేది ఒక ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని ఆవిష్కరించడాని కి ఉద్దేశించినటువంటి ప్రధాన మంత్రి దృష్టికోణం లో కీలకం గా ఉంటున్నది. ఈ దిశ లో చేపట్టిన ముఖ్య కార్యక్రమాల లో ఒక కార్యక్రమమే జన్ ఔషధి కేంద్రాల స్థాపన గా ఉంది. జన్ ఔషధి కేంద్రాల లో మందుల ను తక్కువ ధరల కు అందుబాటు లో ఉంచడం జరుగుతున్నది. తాజా కార్యక్రమం లో భాగం గా ప్రధాన మంత్రి 10,000 వ జన్ ఔషధి కేంద్రాన్ని ఎఐఐఎమ్ఎస్ దేవ్‌ఘర్ లో దేశ ప్రజల కు అంకితం చేయనున్నారు. దీనికి తోడు, దేశం లో జన్ ఔషధి కేంద్రాల ను 10,000 నుండి 25,000 కు పెంచేందుకు ఉద్దేశించిన ఒక కార్యక్రమాన్ని కూడా ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు.

 

మహిళా ఎస్ హెచ్ జిస్ కు డ్రోన్ స్ ను సమకూర్చడం మరియు దేశం లో జన్ ఔషధి కేంద్రాల సంఖ్య ను 10,000 స్థాయి నుండి 25,000 స్థాయి కి పెంచడం అనే ఈ రెండు కార్యక్రమాల ను ఈ సంవత్సరం లో స్వాతంత్య్ర దినం నాడు ప్రధాన మంత్రి తాను చేసిన ప్రసంగం లో భాగం గా ప్రకటించారు. తాజా కార్యక్రమం ఈ వాగ్దానాలు సాకారం కావడాన్ని సూచిస్తుంది.

 

 

***



(Release ID: 1980921) Visitor Counter : 108