పర్యటక మంత్రిత్వ శాఖ
భారతదేశాన్ని ప్రపంచ స్థాయి ప్రధాన మైస్ గమ్యస్థానంగా అభివృద్ధి చేసేందుకు పరిశ్రమ వర్గాలతో సమావేశం నిర్వహించనున్న భారత పర్యాటక మంత్రిత్వ శాఖ
ఈ నెల 30న న్యూదిల్లీలోని భారత్ మంటపంలో రౌండ్ టేబుల్ సమావేశం, పాల్గొననున్న మైస్ పరిశ్రమ ప్రముఖులు
Posted On:
28 NOV 2023 11:33AM by PIB Hyderabad
భారతదేశాన్ని ప్రపంచ స్థాయి ప్రధాన మైస్ (సమావేశాలు, ప్రోత్సాహకాలు, సదస్సులు, ప్రదర్శనలు) గమ్యస్థానంగా అభివృద్ధి చేసేందుకు. భారత పర్యాటక మంత్రిత్వ శాఖ పరిశ్రమ వర్గాలతో ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తోంది. ఈ నెల 30న, న్యూదిల్లీలోని భారత్ మంటపంలో ఈ భేటీ జరుగుతుంది.
భారతదేశ జీ20 అధ్యక్షత సమయంలో, దేశవ్యాప్తంగా 56 నగరాల్లో 200కు పైగా సమావేశాలు జరిగాయి. ఇది, జాతీయ & అంతర్జాతీయ స్థాయిలో అంచనాలకు మించిన ఆసక్తిని రేకెత్తించింది. జీ20 సమావేశాల ద్వారా, భారతదేశంలోని బలమైన మైస్ మౌలిక సదుపాయాలు, సాంస్కృతిక & ప్రాకృతిక వారసత్వం ప్రపంచానికి మరింత స్పష్టంగా తెలిసొచ్చింది. దీనిని అంతే ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్లడానికి, భారతదేశాన్ని మైస్‌లో ప్రపంచ ప్రథమ గమ్యస్థానంగా నిలబెట్టేందుకు పర్యాటక మంత్రిత్వ శాఖ చురుగ్గా పని చేస్తోంది.
భారతదేశాన్ని ప్రధాన మైస్ గమ్యస్థానంగా ప్రోత్సహించే లక్ష్యంతో రూపొందించిన కీలక కార్యక్రమాల గురించి రౌండ్ టేబుల్ సమావేశంలో పర్యాటక మంత్రిత్వ శాఖ వివరిస్తుంది. ఇందులో ప్రధాన భాగం మైస్ పరిశ్రమ కోసం జాతీయ వ్యూహం, మార్గసూచీది. మైస్ పరిశ్రమ వృద్ధికి కేంద్ర, రాష్ట్ర, నగర స్థాయుల్లో అనుకూల పరిస్థితులు, సంస్థాగత విధానాలను సృష్టించడం జాతీయ వ్యూహం లక్ష్యం. ప్రపంచ మైస్ వ్యాపారంలో భారతదేశ వాటాను గణనీయంగా పెంచడం ఉద్దేశం.
న్యూదిల్లీలో జరిగే రౌండ్ టేబుల్ సమావేశానికి మైస్ పరిశ్రమ సీఈవోలు, సీనియర్ అధికార్లు, ప్రముఖులు హాజరవుతారు.
న్యూదిల్లీని ప్రపంచ స్థాయి మైస్ గమ్యస్థానంగా మార్చేందుకు, కీలకమైన మైస్ గమ్యస్థానాల్లో నగర-స్థాయి 'మైస్ ప్రమోషన్ బ్యూరో'ను ఏర్పాటు చేయడానికి మంత్రిత్వ శాఖ ఒక నమూనాను రూపొందించింది. దీనికి సంబంధించి, పరిశ్రమల ప్రముఖుల నుంచి సూచనలు, అభిప్రాయాలను కోరుతుంది. గమ్యస్థానంలో పూర్తి మైస్ అనుకూల వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వ-ప్రైవేట్ రంగాలు కలిసి పని చేసేలా ఈ నమూనా ఉంటుంది. నగరంలో సదస్సులు, సమావేశాలు నిర్వహించడానికి ఏక గమ్యస్థానంగా ఇది పని చేస్తుంది.
భారతదేశాన్ని ప్రపంచ స్థాయి ప్రధాన మైస్ గమ్యస్థానంగా తీర్చిదిద్దడానికి, పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా 'మీట్ ఇన్ ఇండియా' బ్రాండ్‌ను ఆవిష్కరించింది. దీనిలో భాగంగా, రాష్ట్రాలు, పరిశ్రమల భాగస్వామ్యంతో సామాజిక మాధ్యమాల్లో ప్రచారాలు చేపడతారు. పరిశ్రమ వర్గాల అభిప్రాయాలు, సూచనలు తీసుకోవడం, భారతదేశంలో మైస్ రంగం అభివృద్ధికి భాగస్వామ్యంతో కూడిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం రౌండ్ టేబుల్ లక్ష్యం.
****
(Release ID: 1980408)
Visitor Counter : 76