ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆంధ్ర  ప్రదేశ్ లోని తిరుమల లో గల శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం లో జరిగిన ప్రార్థన  కార్యక్రమంలో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 27 NOV 2023 10:01AM by PIB Hyderabad

ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుమల లో ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం లో జరిగిన ప్రార్థన కార్యక్రమంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలుపంచుకొన్నారు. నూట నలభై కోట్ల మంది భారతదేశం ప్రజల కు మంచి ఆరోగ్యం, శ్రేయం మరియు సమృద్ధి కలగడం కోసం భగవాన్ వేంకటేశ్వర స్వామి వారి దీవెనల కై ప్రధాన మంత్రి వేడుకొన్నారు. తిరుమల లోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం తాలూకు దృశ్యాల ను కొన్నింటిని కూడా శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక పోస్టు లో :

‘‘భారతదేశం లోని 140 కోట్ల మంది దేశవాసుల కు మంచి ఆరోగ్యం, శ్రేయం మరియు సమృద్ధి కలగడం కోసం తిరుమల లో శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం లో భగవాన్ వేంకటేశ్వర స్వామి వారి దీవెన లు ప్రాప్తించాలి అంటూ వేడుకొన్నాను.’’ అని పేర్కొన్నారు.

 

 

 

ఈ సందర్భం యొక్క మరికొన్ని దృశ్యాలను ప్రధాన మంత్రి శేర్ చేశారు.

ఆయన ఈ క్రింది విధం గా పేర్కొన్నారు:

ఓం నమో వేంకటాశాయ.

తిరుమల నుండి మరికొన్ని దృశ్యాలు.

 

 

***


(రిలీజ్ ఐడి: 1980301) సందర్శకుల సూచీ సంఖ్య : : 158